పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 11:పటాన్ చెరు డివిజన్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న 160 దుకాణాల సముదాయం నిర్మాణ పనులను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయితే.. ఇటు వ్యాపారస్తులకు అటు రైతులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, మార్కెటింగ్ శాఖ అధికారులు, పాల్గొన్నారు.
మార్కెట్ యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్
