మార్కండేయ దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 21 : ఆమనగల్లు పట్టణంలోని  శ్రీ భక్త మార్కండేయ దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారు మహా గౌరీ శాకాంబరీ అలంకరణ తో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి రవి నవ్య, సత్యరాములు దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాలకృష్ణయ్య, కోశాధికారి సత్య రాములు, మున్సిపాలిటీ చైర్మన్ దుర్గయ్య, ఉపాధ్యక్షులు అప్పం శ్రీనివాసులు, మసున మురళి, చిలువేరు వాసు, ఏలే శివకుమార్, ప్రజా ప్రతినిధులు  ఎంపిటిసి కుమార్ డాక్టర్  పత్యా నాయక్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page