మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర డిసెంబర్ 09: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి కే సి ఆర్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి అధేశాల మేరకు మహేశ్వరం శివగంగ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు సి ఎం కే సి ఆర్ ఇంట్లో కాలు జరిగి తుంటి ఎముక విరగడంతో నిన్న డాక్టర్లు బృందం ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు.కొని రోజులు బెడ్ రెస్ట్ అవసరం అని అన్నారని తేలిపారు.ఆలయ కమిటీ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్ గౌడ్, మాజీ చైర్మన్ మునగపాటి నవీన్,మాజీ సర్పంచ్ ఆనందం, కో ఆప్షన్ సభ్యుడు ఆదిల్ అలీ,దర్శకుడు కడమోని ప్రభాకర్, నాయకులు దుడ్డు కృష్ణ, ఆకుల వీరి బాబు ,కె మహిందర్, సున్నం కృష్ణ, వీరేందర్ తో పాటు తధితరులు పాల్గొన్నారు.