Take a fresh look at your lifestyle.

మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరం

  • పోరాటం దేశమంతా వ్యాపించాన్న బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవిత
  • హస్తిన వేదికగా మహిళా రిజర్వేషన్లపై దీక్ష
  • జంతర్‌మంతర్‌ ‌వద్ద ప్రారంభించిన సిపిఎం నేత ఏచూరి
  • సాయంత్రం కవితకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేసిన ఎంపి కేశవరావు
  • కవిత ఓ మంచి అడుగు వేశారు….మహిళా బిల్లుకు సంపూర్ణమద్దతు….పోరాటంలో పాల్గొంటాం : సీతారామ్‌ ఏచూరి

న్యూ దిల్లీ, మార్చి 10 : మహిళా రిజర్వేషన్‌ ‌సాధించే వరకూ విశ్రమించేది లేదని భారత జాగృతి అధ్యక్షురాలు, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. దేశంలోని మహిళలందరిని కలుపుకుని పోరాడుతామన్నారు. జంతర్‌మంతర్‌లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలని ఆమె అన్నారు. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరమని, దానిని సాధించి తీరాలని చెప్పారు. బీజేపీ బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతిస్తాయన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద దీక్ష చేపట్టారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో కవిత దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు దేశవ్యాప్తంగా 18 పార్టీల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. అంతకుముందు వేదిక వద్దకు చేరిన ఎమ్మెల్సీ కవిత పలువురు జాతీయ నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. దీక్షలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎం‌పీ కవిత, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌ ‌రెడ్డి, రేఖానాయక్‌తోపాటు భారత జాగృతి మహిళా నేతలు కూర్చుకున్నారు. సీపీఎం నేత సీతారామ్‌ ఏచూరీ దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు పెండింగ్‌లో ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాజకీయాల్లో మహిళలకు ప్రత్యేక హక్కులు ఉండాలని చెప్పారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు. మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు తెచ్చే వరకూ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం పొందేందుకు పార్లమెంటులో బీజేపీకి పుల్‌ ‌మెజార్టీ ఉందన్నారు. భారత సంస్కృతిలో మహిళకు పెద్దపీట వేశారన్నారు. అమ్మానాన్న అంటారు.. అందులో అమ్మ శబ్దమే ముందు ఉంటుంది. రాజకీయాల్లోనూ మహిళకు సముచిత స్థానం దక్కాలని స్పష్టంచేశారు. దీక్షకు మద్దతు తెలుపుతున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నదని, 1996లో నాటి ప్రధాని దేవేగౌడ హయాంలో బిల్లు పెట్టినా ఇంకా చట్టం కాలేదని చెప్పారు. ప్రస్తుతం పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని చెప్పారు. అందువల్ల బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయన్నారు.

మహిళాబిల్లు ఓ చారిత్రక అవసరమని, సాధించి తీరాలని స్పష్టం చేశారు. ధరణిలో సగం, ఆకాశంలో సగం అనే తెలుగు నానుడి ఉన్నది. అందుకే అవకాశాల్లోనూ సగం కావాలని కోరుతున్నామని చెప్పారు. దీక్షకు మద్దతు తెలుపుతున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సృష్టికి మూలమైన మహిళ తన హక్కుల కోసం ఇంకా పోరాడటం శోచనీయమని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మహిళలు అభివృద్ధిలో, పరిపాలనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మహిళలను వంటిల్లు దాటకుండా చూడాలనే భావన సరైంది కాదని విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌ ‌మహిళలందరిదని ధర్నాలో అన్నారు. మహిళా బిల్లుకు మద్దతు ప్రకటించిన బీజేపీకి అవకాశం ఇచ్చి ఎనిమిదేండ్లు దాటిపోయిందని, ఇంకా బిల్లు మాత్రం లోక్‌సభ ముందుకు రాలేదని విమర్శించారు. ఇప్పటికైనా బీజేపీ కళ్లు తెరవాలని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ప్రస్తుత పార్లమెంట్‌ ‌సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు పాస్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేశారు. మ పదవులు కాపాడుకోవడానికే మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. మహిళలను వంటిల్లు దాటకుండా చూడాలనే భావన సరైనది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని రకాలుగా రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వం బంజారాలకు స్వర్ణయుగమని చెప్పారు. బంజారాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించారని వెల్లడించారు. పార్లమెంటులో మెజార్టీ ఉన్న మోదీ సర్కార్‌ ‌మహిళా బిల్లుపెట్టకపోవడం సిగ్గుచేటని మహబూబాబాద్‌ ఎం‌పీ మాలోత్‌ ‌కవిత విమర్శించారు.

ముగిసిన ఎమ్మెల్సీ కవిత దీక్ష….నిమ్మరసం ఇచ్చి విరమింప చేసిన ఎంపి కేశవరావు
జంతర్‌మంతర్‌లో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు కోసం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష ముగిసింది. సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్సీ కవితకు ఎంపీ కే కేశవరావు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు కోసం పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు జాతీయ మహిళల సమస్య అని, మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు రాజకీయ సమస్య కాదని కవిత అన్నారు. ఇది ఏ ఒక్క పార్టీకి చెందిన అంశం కాదని, మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు తెచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆమె డిమాండ్‌ ‌చేశారు. దీని కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు పోరాడాలని, పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి చొరవ తీసుకోవాలని కవిత అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఇది ఒక్క రాష్టాన్రికి సంబంధించిన సమస్య కాదని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం మా పోరాటం కొనసాగుతోంది.

మహిళా రిజర్వేషన్‌ ‌సాధించే వరకు విశ్రమించేది లేదు. మోదీ సర్కార్‌ ‌తలచుకుంటే ఈ బిల్లు పాసవుతుంది. డిసెంబర్‌లో పార్లమెంట్‌ ‌సమావేశాలు ముగిసే వరకు పోరాడుతూనే ఉంటాము. రాష్ట్రపతికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ప్రారంభించిన ఈ పోరాటం ఇంకా ఉధృతమవుతుంది. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరం.. సాధించి తీరాలి అని కవిత స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు కోసం చేపట్టిన దీక్షకు మద్దతు ఇచ్చిన పార్టీలకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీక్షకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఢిల్లీ మహిళా నేతలకు, విద్యార్థి నేతలకు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు కవిత. ఈ దీక్షకు మొత్తం 18 పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.

కవిత దీక్షలో ఆప్‌ ‌నేతలు సంజయ్‌ ‌సింగ్‌, ‌చిత్ర సర్వార, నరేష్‌ ‌గుజ్రాల్‌ (అకాలీదళ్‌) ‌శివసేన ప్రతినిధులు, అంజుమ్‌ ‌జావేద్‌ ‌మిర్జా (పీడీపీ), షవి• ఫిర్దౌజ్‌ (‌నేషనల్‌ ‌కాన్ఫరెన్స్), ‌సుస్మితా దేవ్‌ (‌టీఎంసీ), కేసీ త్యాగి (జేడీయూ), సీమా మాలిక్‌ (ఎన్‌సీపీ), కే.నారాయణ (సీపీఐ), సీతారాం ఏచూరి (సీపీఎం), పూజ శుక్లా (ఎస్‌పీ), శ్యామ్‌ ‌రాజక్‌ (ఆర్‌ఎల్‌డీ), కపిల్‌ ‌సిబల్‌, ‌ప్రశాంత్‌ ‌భూషణ్‌ ‌సహా పలు విపక్ష పార్టీల నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు… దిల్లీ లిక్కర్‌ ‌స్కాం  కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శనివారం ఎమ్మెల్సీ కవిత విచారణ జరగాల్సి ఉంది. అయితే  అరుణ్‌ ‌రామచంద్ర పిల్ళై  ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. తాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌కి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో దరఖాస్తు చేశారు.

కవిత ఓ మంచి అడుగు వేశారు….మహిళా బిల్లుకు సంపూర్ణమద్దతు….పోరాటంలో పాల్గొంటాం : సీతారామ్‌ ఏచూరి
మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు ఆమోదం పొందే వరకు వామపక్ష పార్టీల మద్దతు ఉంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి అన్నారు. మహిళా రిజర్వేషన్‌ ‌కోసం చేసే పోరాటంలో పాల్గొంటామని ప్రకటించారు. మహిళలకు భాగస్వామ్యం లేనంత వరకు సమాజం ముందుకు పోదని చెప్పారు. ఎన్నో అడ్డంకుల తర్వాత మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది, కానీ లోక్‌సభ ఆమోదముద్ర వేయలేదని చెప్పారు. ప్రస్తుత పార్లమెంట్‌ ‌సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును ఆమోదించాలని సీతారాం ఏచూరి డిమాండ్‌ ‌చేశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత దిల్లీలోని జంతర్‌మంతర్‌ ‌వద్ద దీక్ష చేపట్టారు. దీక్షకు హాజరైన సీపీఎం నేత సీతారామ్‌ ఏచూరి.. కవితకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కవిత ఒక మంచి అడుగు వేశారని చెప్పారు.

ఎన్నో అడ్డంకుల తర్వాత మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది, కానీ లోక్‌సభ ఆమోదముద్ర వేయలేదని చెప్పారు. పార్లమెంట్‌ ‌సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ ‌చేశారు. గతంలో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు మోదీ కూడా మద్దతు తెలిపారని గుర్తుచేశారు. ఆయన ప్రధానమంత్రి అయి తొమ్మిదేండ్లు పూర్తయినా ఇప్పటివరకు లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టలేదని విమర్శించారు. ప్రస్తుత పార్లమెంట్‌ ‌బ్జడెట్‌ ‌సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు తీసుకురావాలని పట్టుబడతామని చెప్పారు. మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నదని, 1996లో నాటి ప్రధాని దేవేగౌడ హయాంలో బిల్లు పెట్టినా ఇంకా చట్టం కాలేదని చెప్పారు. ప్రస్తుతం పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని చెప్పారు. అందువల్ల బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయన్నారు. మహిళాబిల్లు ఓ చారిత్రక అవసరమని, సాధించి తీరాలని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్‌ ‌సాధించే వరకూ విశ్రమించేది లేదని వెళ్లడించారు.

Leave a Reply