- రేపు వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఖాతాల్లో రూ.750 కోట్లు జమ
- త్వరలో ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమం
- ప్రత్యేక పరీక్షలు, మందులు
- ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి
సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 6 : సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. 100 మహిళా హాస్పిటళ్లను ప్రారంభం చేస్తామన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా కార్యక్రమం తీసుకురాబోతున్నామన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేకంగా పరీక్షలు, మందులు ఇవ్వబోతున్నామన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని అందరూ మహిళలు వినియోగించుకోవాలన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన రూ.750 కోట్లు విడుదల అవుతాయని, 8న మహిళల ఖాతాల్లో రూ.750 కోట్లు జమవుతాయన్నారు.
సంగారెడ్డి పట్టణంలో జిల్లా సమాఖ్య దుకాణ సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, టీఎస్ ఐఎండీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, చేనేత సహకార సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్ పాల్గొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా పేదల పెళ్లిళ్లకు రూ.1,00,116 ఇస్తున్నారన్నారు. మహిళల పౌష్టికాహారం కోసం ఆరోగ్యలక్ష్మి, అమ్మ ఒడి వాహనాలు, కేసీఆర్ కిట్ తీసుకువచ్చామన్నారు. సంగారెడ్డి జిల్లాలో 83శాతం ప్రభుత్వ హాస్పిటళ్లలో డెలివరీ అవుతున్నాయని, ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్యం మెరుగైందని అన్నారు. ఏప్రిల్ నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. న్యూట్రిషన్ కిట్ తల్లికి అవసరమైన పౌష్టికాహారం ఉంటుందన్నారు.
తెలంగాణలో 6లక్షల గర్భిణులు ఏడాదికి రెండుసార్లు న్యూట్రిషన్ కిట్ ఇస్తామన్నారు. మాతాశిశు మరణాలను తగ్గించేనీదుకు న్యూట్రిషన్ కిట్ తెస్తున్నామన్నారు. మహిళల కోసం ఇంటింటికీ నల్లా పెట్టి తాగునీరు ఇస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మిషన్ భగీరథ ద్వారా సురక్షిత తాగునీరు ఇస్తున్నామన్నారు. ర్రాష్టంలో 46 మహిళా రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టి నాణ్యమైన విద్యనందిస్తున్నామన్నారు. దశల వారీగా రానున్న రోజుల్లో గ్రామ సమాఖ్య భవనాలు నిర్మిస్తామన్నారు. సెర్ప్, వీవోఏ ఉద్యోగులకు వేతన సవరణ చేసి జీతాలు పెరిగి వొస్తాయన్నారు. ప్రభుత్వపరంగా మూడు ఐవీఎఫ్ ఇంఫటాలిటీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల కోసం ఎంతో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను దీవించాలన్నారు.