Take a fresh look at your lifestyle.

మహిళలకు ఆత్మగౌరవం కావాలి

దేశంలోని రోజురోజుకూ మహిళలపై, విద్యార్థినులపై జరుగుతున్న టువంటి హింస మహిళా లోకానికి ఆందోళన కలిగి స్తుంది. దశాబ్దాల తరబడి మహిళలను మతాల పేరిట, కులాల పేరిట మూఢ విశ్వా సాలు ఆచార సంప్రదాయాల పేరిట అట్టడుక్కి తోసేసింది. నాటి బ్రాహ్మణ వర్గం అగ్రవర్ణ ఆధిపత్య దురహంకారం వ్యవస్థలో మహిళలను కనీసం మనిషిగా గుర్తించని సమాజం ఇది సతి సహాగమనం  వంటింటి పాతివ్రత్యం, గృహనిర్బంధం, కుల మతాల తారతమ్యం, విద్యా నేరంగా భావించే సాంప్రదాయ వ్యవస్థ నిర్మాణమైన రోజులు అవి. దళిత, బహుజన, ఆదివాసి, మహిళలను, దేవదాసిలు, శివపార్వతులు, జోగినిలుగా మార్చి దేవుడికి ఇచ్చి వివాహం జరిపించేవారు.

వారు జీవితకాలం దేవుడికి సేవ చేస్తూ ఉండేవారు. ఇలా శతాబ్దాల తరబడి మహిళలను సంస్కృతి పేరుతో అనేక రకాలుగా అణిచివేస్తూనే ఉన్నారు నేటికీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి రూపం మారింది తప్ప మూలం మారలేదు అన్న విధంగా నేడు మహిళలు, విద్యార్థినిలు, లైంగిక వేధింపులకు, అత్యాచార, ఘటనలకు, గృహహింస, వరకట్న వేధింపులకు తీవ్రమైన మానసిక, ఇబ్బందులతో గురవుతున్నారు.

వ్యవస్థలో లోపాలు:
మహిళలను రక్షించడం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు అనేక చట్టాలు చేశారు. అవి చేసినప్పటికీ  పూర్తిస్థాయిలో అమలు చేయడంలో  విఫలమవుతున్నారు. దోషులకు నేరాన్ని బట్టి వివిధ రకాలుగా శిక్షలు ఖరారు చేసినా, మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేసిన ఇంకా మహిళలు ఎక్కడో ఒక చోట వేధింపులకు, అణిచివేతకు, ర్యాగింగ్‌ ‌లకు గురవుతున్నారు. దానికి కారణం వ్యవస్థలో లోపాలతో పాటు చట్టాలలో లొసుగులు రాజకీయ ఒత్తిడి వలన నేరం చేసిన వారు శిక్ష నుండి తప్పించుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు, విద్యార్థినీలకు  చట్టాల పైన విద్యావంతుల చేత అవగాహన కల్పించాలి. అందుకే అనుకున్నటువంటి ఫలితాలు ఆశించే విధంగా రావడం జరుగుతుంది. మనం సమాజంలో మార్పులకు తగినట్టుగా మనం వ్యవహార శైలిని మార్చుకుంటున్నప్పుడు పితృస్వామ్య సమాజం నుంచి మార్పులు కోరుకోవడం తప్పేమీ కాదు కదా ? మహిళలను సాంప్రదాయాలు ఆంక్షల పేరుతో మానసికంగా శక్తిహీనులుగా మార్చుతున్నారు.

అలాంటి మూఢవిశ్వాసపు కట్టుబాట్లని పటాపంచలు చేసి నైతిక విలువలు కలిగిన వ్యవస్థని నిర్మించగలగాలి. పిల్లలను లింగ వివక్షత లేకుండా పెంచాలి. ప్రభుత్వాలు నాణ్యమైన ప్రమాణాలు కలిగిన శాస్త్రీయ విద్యా, విధానాన్ని అమలు చేయాలి. మహిళలు విద్య ద్వారానే స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని పొందగలుగుతారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, ప్రగతిని సాధించడంలో ముందు వరుసలో ఉంటారు. మేధస్సుని బంధించే ఏ సాంప్రదాయాన్ని అయినా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మహిళలకు ఆత్మ గౌరవాన్ని నిలిపే స్వాతంత్ర జీవన విధానం కావాలి.

మహిళామణులు వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండకపోవడంతో అత్యాచారాలు పెరుగుతున్నాయంటారు. గతంలో జరిగిన తొమ్మిది నెలల పాపను ఏ వస్త్రా ధారణ చూసి హత్యాచారానికి పాల్పడ్డారు.? మహిళలకు స్వేచ్ఛను ఇవ్వడమే హత్యాచారలకు కారణం అని మరికొందరు అంటారు. ఇలాంటి ఆలోచన భావనలే పితృస్వామ్యం సమాజం అభివృద్ధికి అవకాశం ఇస్తున్నాయి. దీనిని అడ్డుకోకపోతే ఇలాంటి విధానాలను నిర్మూలించకపోతే మహిళలు దాదాపుగా 200 సంవత్సరాల కిందకు వెళ్లిపోయే ప్రమాదం ఉండే అవకాశం కనిపిస్తోంది.

నమ్మకం కలిగించాలి:
ప్రస్తుత పరిస్థితికి యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం, ఆశ్లీల చిత్రాలు చూడడం, పిల్లల ఫోన్‌ ‌వాడకంపై పెద్దల నియంత్రణ లేకపోవడం, పెద్దలు పెంచిపోచేస్తున్న గుండాయిజం, మాఫియా, మతోన్మాద సంస్కృతికి కూడా అత్యాచారాలకు కారణం అవుతుంది. అత్యాచారాలు జరగకుండా చూడాల్సిన ప్రభుత్వాలు సంబంధిత విభాగాలను, జరిగిన తర్వాత బాధితుల పక్షాన ఉండవలసిన సంస్థలను బలోపేతం చేయాల్సి ఉంటుంది. పేదరికంతో డబ్బు కోసం కన్న వాళ్ళు ఆడపిల్లలను సంతలో సరుకుగా అమ్మేస్తున్నారు. మహిళ కొన్ని సమస్యల కారణంగా తప్పని పరిస్థితిలో తప్పు చేస్తుంది అనేది వాస్తవం. అలాంటి మహిళలను చేరదీసి సంబంధిత సంస్థలు, అధికారులు కౌన్సిలింగ్‌ ‌చేసి ఆదుకోవాలి. వృత్తి శిక్షణలను ఇప్పించి ఉపాధి కల్పించాలి. మహిళలపై జరుగుతున్న దాడులు అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి.

వరంగల్‌ ‌జిల్లా కాకతీయ మెడికల్‌ ‌కాలేజీలో సీనియర్‌ ‌విద్యార్థులు, జూనియర్‌ ‌గిరిజన విద్యార్థికి రాగింగ్‌ ‌పేరిట వేధింపులకు గురి చేసి, కులం పేరుతో అవమానం పరిచి ఆత్మహత్య యత్నం చేసుకొని మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు పోయింది. ప్రధానంగా విద్యాసంస్థలో, ప్రధాన కూడలిలో ర్యాగింగ్‌ ‌పై అవగాహన సదస్సులు నిర్వహించాలి. మహిళలపై జరిగిన దాడులను ధైర్యంగా ఎదుర్కొనే విధంగా మహిళలకు అవగాహన కల్పించి, భాదిత మహిళలకు అండగా నిలబడాలి. ఇలాంటి బాధితులకు సరియైన న్యాయం దొరుకుతుందనే నమ్మకం కలిగించాలి. అప్పుడే బాధితులు ధైర్యంగా వారికి జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పగలరు. తప్పు చేసినవారికి చట్టాలు సవరించైనా సత్వరమే శిక్షించి బాధితులకు న్యాయం చేకూర్చాలి. అప్పుడే నమ్మకం కలుగుతుంది.

image.png
లాకవత్‌ ‌చిరంజీవి నాయక్‌
‌కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్‌

Leave a Reply