మరో సంగ్రామానికి సిద్ధ్దమవుతున్న తెలంగాణ

దేశ అధికారాన్ని నిర్ణయించగలిగే పార్లమెంటు ఎన్నికలు త్వరలో రానున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ప్రధానంగా రెండు జాతీయ పార్టీలు తమ కూటములను సన్నద్దం చేసుకుంటున్న దశలో, తెలంగాణ రాష్ట్రం కూడా అందుకు రంగం సిధ్ధం  చేసుకుంటున్నది. తాజాగా పక్షం రోజుల క్రితం జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఒక విధంగా మహా యుద్దంగా ముగిసాయి. ఈ ఎన్నికలకు రెండు ఏండ్ల ముందు నుండే రాజకీయ పార్టీలు యుద్దానికి సిధ్ధ్దపడుతూరావడంతో ఇక్కడి ఎన్నికలపైన దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. త్వరలో జరుగనున్న లోకసభ ఎన్నికల విషయంలో కూడా తెలంగాణ మరోసారి ఆకర్షణీయమైన ప్రాంతంగా నిలువబోతోంది. ఎందుకంటే ఈ దేశాన్ని ఏలగలిగే శక్తి ఉన్న రెండు జాతీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు ఇక్కడినుండి పోటీ చేయబోతున్నట్లు ఆసక్తికరమైన వార్తలు వెలువడడమే అందుకు కారణం. తెలంగాణలో దశాబ్ధకాలం తర్వాత తిరిగి కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టడంతో ఇక్కడ రాజకీయ పరిణామాల్లో అనూహ్య మార్పు సంభవించాయి. అధికారాన్ని హస్తగతం చేసుకున్న హస్తం పార్టీ దూకుడు పెంచింది.

ఎన్నికల సమయంలో తామిచ్చిన ఆరు గ్యారంటీలను వందరోజుల్లోనే అమలుచేస్తామని ప్రతినబూనిన ఆ పార్టీ ఇప్పటికే రెండు హామీలను పూర్తిచేయడం ద్వారా ప్రజలనుండి మెప్పు పొందుతోంది. మిగతా గ్యారంటీలను కూడా వంద రోజుల్లోపే అమలులోకి తీసుకువొచ్చే విధంగా ఒకపక్క కసరత్తు చేస్తూనే, రానున్న స్థానిక, లోకసభ ఎన్నికలకు రంగాన్ని సిధ్ధం  చేసుకుంటోంది. ముఖ్యంగా ఆ పార్టీకి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. ఎందుకంటే రాష్ట్రంలోలాగానే కేంద్రంలోకూడా ఆ పార్టీ అధికారానికి దూరమై దాదాపు పదేళ్ళు కావొస్తున్నది. ఈ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు తమ ‘ఇండియా’కూటమిని అందుకు సం సిధ్ధం  చేసే ప్రయత్నంలో ఉంది. కాగా రాష్ట్రంలో కూడా తాజాగా అధికారాన్ని చేపట్టిన ఉత్సాహాన్ని పార్లమెంటు ఎన్నికల ద్వారా ఇనుమడిరచుకోవాలనుకుంటోంది. అందుకు తెలంగాణలోని 17 స్థానాలకు కనీసం 16 స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంగా ఎన్నికల వ్యూహరచన చేస్తున్నది. అందులో భాగంగానే ఇటీవల ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ఇన్‌ఛార్జిని నియమించింది. అయితే ఇన్‌ఛార్జిలంతా సిఎంతోపాటు అందరూ మంత్రులేకావడం విశేషం. ఎట్టి పరిస్థితుల్లో  పదహారు స్థానాలను గెలువాలన్నదే ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తాజా శాసనసభ ఎన్నికల మాదిరిగానే కార్యకర్తలు, నాయకుల్లో జోష్‌ నింపేందుకు కీలక నిర్ణయాన్ని ఆ పార్టీ రాష్ట్రశాఖ ప్రకటించింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత  ఈనెల 18న  మొదటిసారిగా ఇక్కడ జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటి సమావేశం తమ పార్టీ అగ్రనేత సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీచేయించాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీనిద్వారా కాంగ్రెస్‌ వర్గాల్లో  మరింత ఉత్సాహం ఉరకలు వేసే అవకాశముందని ఆ పార్టీ భావిస్తోంది. అంతేగాక  తెలంగాణను ఇచ్చిన దేవతకు తాము సమర్పించుకునే చిన్న కానుకగా ఆ పార్టీ భావిస్తున్నది. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంకోల్పోయే ప్రమాదమున్నప్పటికీ కోట్లాది  మంది తెలంగాణ ప్రజల కోరికను మన్నించి  తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేసిన సోనియాగాంధీని ఇక్కడినుండి గెలిపించుకోవడం ద్వారా రుణం తీర్చుకునే అవకాశం లభించినట్లు అవుతుందని ఆ సమావేశంలో పార్టీనేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తున్నది. అందులో భాగంగా ఆమెకు అనువైన నియోజవర్గమేదన్న విషయం కూడా ప్రచారంలో ఉంది.

పూర్వం అంటే 1980లో ఆనాడు అధికారానికి దూరమైన ఇందిరాగాంధీని మెదక్‌ నియోజకవర్గ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలీలో కేవలం ఏడువేల మేజార్టీ వొస్తే, మెదక్‌ ప్రజలు  దాదాపు రెండులక్షల మెజార్టీతో గెలిపించడమేకాదు, ప్రధాని పీఠం  ఎక్కేందుకు కారకులైనారు. ఇప్పుడు సోనియాగాంధీ కూడా అదే మెదక్‌ నుండి నిలబడినా గెలిపిస్తామంటున్నారు. కాని పక్షంలో నిన్నమొన్నటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌ గిరి  నుంచి అయినా గెలిపిస్తామంటున్నారు. మల్కాజ్‌ గిరి  వివిధ రాష్ట్రాల జనాభాతో ఒక విధంగా మినీ ఇండియాగా పేరున్న నియోజకవర్గం. మరో నియోజకవర్గం కరీంనగర్‌. ఈ మూడిరటిలో ఎక్కడినుంచి అయినా నిలబడాల్సిందిగా తాము సోనియాను అభ్యర్ధిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు షబ్బీర్‌ అలీ ఇటీవల మీడియా ముందు వెల్లడిరచడం గమనార్హం. ఇదిలా ఉంటే బిజెపి కూడా అదే దారిలో ఉన్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ పైన కాషాయ జంఢా పాతాలన్న తమ లక్ష్యం చెయ్యిజారి పోవడంతో పార్లమెంటు ఎన్నికల్లోనైనా తమ సత్తా చాటుకోవాలనుకుంటోంది బిజెపి. అందుకు  ఇక్కడ ఎన్నికల వేడిని రగిలించాలనుకుంటోంది. అందుకోసం ఇక్కడినుండి సరాసరి ప్రధాని నరేంద్ర మోదీనే పోటీకి పెట్టాలనుకుంటోంది. ఆయనకు కూడా మల్కాజీగిరి స్థానమే సరైందిగా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. కాని పక్షంలో ఆ పార్టీ ఎంపి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిTelangana is preparing for another warస్తున్న సికిందరాబాద్‌ అయితే ఇప్పటికే ఆ పార్టీ బలంగా  ఉండడంతో అక్కడి నుంచి సులభంగా గెలిచే అవకాశాలుంటాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. మరో నిమోజకర్గం మహబూబ్‌నగర్‌గా ఆ పార్టీవర్గాలు ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తున్నది. గతంలో ఈ నియోజకవర్గంనుంచి ప్రాతినిధ్యం వహించిన జితేందర్‌రెడ్డి ఇప్పుడు బిజెపిలోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొత్తానికి అ రెండు పార్టీలకూడా తమ పార్టీలకు చెందిన ముఖ్యనాయకులను ఇక్కడినుండి పోటీలోకి దించడంద్వారా బిఆర్‌ఎస్‌ను గట్టిదెబ్బ తీయాలను కుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page