- పీయూష్ గోయల్ అహంకారపూరిత వ్యాఖ్యలు
- బిజెపి అహంకారాన్ని సహించేది లేదు
- దేన్నాయినా భరిస్తాం కానీ అవమానాన్ని సహించం
- ఉద్యమంలో తెలంగాణేతరులు ఎన్నో అవమానాలు చేశారు
- ఉద్యమంతోనే వారిని అణచివేసి తెలంగాణ సాధించాం
- బియ్యం కొనమంటే కాకమ్మ కబుర్లెందుకు చెబుతారు
- మీడియా సమావేశంలో మండిపడ్డ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర,ఏప్రిల్ 1: నూకలు కూడా తింటాం..కేందద్రంలోని బిజెపిని గద్దెదింపుతామని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు దేన్నయినా సహిస్తారు తప్ప.. అవమాన్ని సహించే ప్రసక్తి లేదన్నారు. ఉద్యమ సమయంలో ఇలాంటి అవమానాలు చేసిన వారు కాలగగర్భంలో కలసిపోయారని అన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డితో కలసి మంత్రి డియాతో మాట్లాడారు. అడుగడుగునా తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను అవమాన పరుస్తున్న బిజెపి తీరుపై మంత్రి మండిపడ్డారు. నూకలు తినమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారని,… బిడ్డా నూకలు తినమని చెప్తావా. అటుకులో, అన్నమో తిని తెలంగాణ సాధించుకున్నాం. అవసరమైతే నూకలు తింటాం.. మిమ్మల్ని గద్దె దించుతాం. ఇది మా రైతులు చేసి చూపిస్తారు. తెలంగాణ ఏదైనా సహిస్తది కానీ అవమానాన్ని సహించదు. సమైక్య పాలకులు మాట్లాడిన మాదిరిగానే ఇప్పుడు పీయూష్ గోయల్ మాట్లాడుతున్నారు. నాడు సమైక్య పాలకులు అవమానిస్తే.. నేడు పీయూష్ గోయల్
అవమానిస్తున్నారు.
సమైక్యవాదులకు చరమగీతం పాడాం.. కు కూడా ఆరోజులు దగ్గర్లోనే ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. పార్లమెంట్‌లో మరోసారి తెలంగాణ రైతాంగాన్ని అవమానపరిచేలా గోయల్ మాట్లాడారు. మమ్మల్ని నాలుగు మాటలు అంటే పడుతాం. తెలంగాణ రైతాంగాన్ని, ప్రజల్ని అవమానపరిస్తే సహించేది లేదని సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. గోయల్‌కు అహంకారింపులు, వక్రీకరణలు అలవాటుగా మారాయి. మా మంత్రులు వెళ్లి యాసంగిలో పండే పంట బాయిల్డ్ రైస్ మాత్రమే అని చెప్పినప్పుడు.. ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయించండి అని అవమానించారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ధాన్యం కొనమంటే బియ్యం కొంటామని అనడం సరికాదన్నారు. తెలంగాణ యాసంగిలో బియ్యం ఎక్కువగా రావు, బాయిల్డ్ రైస్ మాత్రమే కొనాలన్నారు. తెలంగాణ రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నాం.
రైతుబంధు ఇస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి సాగుకు పుష్కలంగా నీరు అందిస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ రైతులకు కేసీఆర్ ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు. రైతుల ఆత్మహత్యలు తగ్గి, సంతోషంగా ఉన్నారు. పంజాబ్‌తో తెలంగాణకు లింక్ పెట్టడం సరికాదు. మాయమాటలతో రైతుల్ని మభ్య పెడుతున్నారు. రైతుల్ని మేం కాదు.. రే మోసం చేస్తున్నారు. పంజాబ్ బియ్యానికి, తెలంగాణ బియ్యానికి తేడా లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ రైతులకు, ప్రజలకు గోయల్ క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. దేశానికి అవసరమయ్యే విత్తనాల్లో 60 శాతం తెలంగాణెళి అందిస్తోందని హరీశ్‌రావు పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ ఇస్తామంటే రా రైస్ మాత్రమే ఇవ్వాలని మెలిక పెట్టడమేంటి? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు అవమానాలను సహించరని తేల్చిచెప్పారు.
పీయూష్ గోయల్ ఒక వ్యాపారిలా మాట్లాడుతున్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోవడం లేదు. తోవ చూపించాల్సింది పోయి తొండి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధ్క ఇచ్చేది మేం కాదు.. రు ఇస్తున్నారని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈడీ, ఐటీ దాడులు చేస్తామని ధ్కలు ఇస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వార్త రాస్తే వారికి ధ్కలు ఇచ్చి దాడులు చేయిస్తున్నారు. రైతుల పక్షాన నిలబడి గొంతెత్తి ధాన్యం కొనమని అడగడం ధ్క కానే కాదు. ఇది కేవలం డిమాండ్ మాత్రమే. ధ్కల సంస్క•తి బీజేపీది అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.డబ్ల్యూటీవో ఒప్పందాలను మార్చగలిగే శక్తి రైతులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రే ఆ ఒప్పందాలను మార్చాలని కేంద్రానికి సూచించారు. ఎనిమిదేండ్ల నుంచి రే అధికారంలో ఉన్నారు. ఆ ఒప్పందాలను మార్చి రాష్టాల్ర రైతుల ప్రయోజనాలను కాపాడాలి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు. ఆదాయం రెట్టింపు చేయకుండా, రైతుల పెట్టుబడిని రెట్టింపు చేశారు. ఎరువుల ధరలు రెట్టింపు అయ్యాయి. వ్యవసాయాన్ని లాభదాయకంగా చేస్తామని చెప్పి రైతులను అప్పుల ఊబిల్లోకి దింపారు. రైతులకు బీజేపీ చేసిందే లేదు. అన్యాయం చేశారు. రైతులపై కార్లు ఎక్కించి నడిరోడ్డుపై హత్య చేసిన చరిత్ర బీజేపీది అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.