‘‘ఆర్థిక కష్టాలు ఉండవు అయినా ఇంకా ఏదో కావాలన్న తపన నిద్రపట్ట నీయదు. కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉన్నా, ప్రతి ఒక్కరిలో తెలియని ఆవేదన, విద్యార్థి చక్కగా చదువుతాడు. పరీక్షలంటే భయం, తెలివితేటలు పుష్కలంగా ఉన్నా సమస్య వస్తే ఎదుర్కొనలేకపోవడం. ఆరోగ్యంగా ఉన్నా ఒంటరిగా బయటకు వెళ్లేందుకు భయపడడం. పెద్దలు, అధికారులు మందలిస్తే మానసికంగా కుంగిపోవడం, ఇలా రోజు రోజు కు పెరుగుతున్న మానసిక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు.’’
ఆర్థిక కష్టాలు ఉండవు అయినా ఇంకా ఏదో కావాలన్న తపన నిద్రపట్ట నీయదు. కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉన్నా, ప్రతి ఒక్కరిలో తెలియని ఆవేదన, విద్యార్థి చక్కగా చదువుతాడు. పరీక్షలంటే భయం, తెలివితేటలు పుష్కలంగా ఉన్నా సమస్య వస్తే ఎదుర్కొనలేకపోవడం. ఆరోగ్యంగా ఉన్నా ఒంటరిగా బయటకు వెళ్లేందుకు భయపడడం. పెద్దలు, అధికారులు మందలిస్తే మానసికంగా కుంగిపోవడం, ఇలా రోజు రోజు కు పెరుగుతున్న మానసిక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు.
మానసిక భాదకు ఏదైనా కారణం కావచ్చు. మానసిక క్షోభను బయటకు చెప్పలేక మనసులో దాచుకోలేక మానసిక ఆరోగ్య నిపుణలను కలిస్తే మెంటల్ అని అంటారేమోనని ఎలాంటి చికిత్స తీసుకోకుండానే ఇంట్లోనే నాలుగు గోడల మధ్య చాలా మంది సతమతం.
మనోవేదనతో సతమతం
మనిషి ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో కాలంతో పాటుగా పరుగులు తీస్తూ మనిషి కూడా ఒక యంత్రం వలే మారిపోయాడు. మనిషి ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి డబ్బు సంపాధన వేటలో పడి , కంపెనీల సంస్థల టార్గెట్ల సాధనలో పరుగులు తీస్తూ ఉన్నాడు. మానసిక ఆరోగ్యానికి తన జీవిత గమనంలో సమయం కెటాయించక శారీరక దృఢత్వాన్ని కోల్పోతున్నాడు. విలాస వంతమైన జీవన విధానంలో విహారిస్తూ కొద్దిపాటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు పరిష్కరించలేని స్తాయికి పడిపోతున్నాడు. సమాజంలో ఎక్కువ మంది యువత నిరాశ, నిస్పృహలతో మానసిక ఆందోళనకు గురై అనారోగ్యం పాలవుతున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఎంత సంపాదించిన ఆరోగ్యంగా లేకపోతే సంపాదనంతా వృధాయే. ఇతరులను నవ్వుతూ పలకరించు, ఇతరులతో ప్రేమగా మాట్లాడు, అందరికి ఆత్మీయతను పంచు ఇదే ఆరోగ్యానికి సూత్రం. మనం ఉన్న ఆధునిక సాంకేతికత రంగంలో దూసుకెల్తున్న ప్రస్తుత పరిస్తితులలో అన్ని పనులను సులభంగా చేసుకుంటూ, జీవన శైలి సుఖమయంగా మారింది. టి.వి రిమోట్ నుండి మొబైల్ ఫోన్ వరకు అన్ని పనులు చేతులపై జరగటం వలన శారీరక పనులకు దూరమయినామేమో అని అన్పిస్తుంది. ఫలితంగా లైఫ్ స్టైల్ వ్యాధులకు కూడా అంతే వేగంగా గురవుతున్నాము. శారీరక పనులు చేయకపోవటం, ఒత్తిడి, అనారోగ్యకర ఆహార అలవాట్లు, నిద్రలేమి, స్మోకింగ్, ఆల్కహాల్ తాగటం మరియు కాలుష్యం వంటి వాటి వలన లైఫ్ స్టైల్ వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది.మానసిక భాదకు ఏదైనా కారణం కావచ్చు. మానసిక క్షోభను బయటకు చెప్పలేక మనసులో దాచుకోలేక మానసిక ఆరోగ్య నిపుణలను కలిస్తే మెంటల్ అని అంటారేమోనని ఎలాంటి చికిత్స తీసుకోకుండానే ఇంట్లోనే నాలుగు గోడల మధ్య చాలా మంది సతమతం అవుతుంటారు.
ప్రతి రోజు మనలను వెంటాడే ఆలోచనలు, మనం చేసే పనులు మన మెదడు పైనే ఆధార పది ఉంటాయి. మన కర్తవ్యాలను నెరవేర్చుకుంటూ లక్ష్యాలను చెరీ ఆనందంగా జీవించేందుకు ఇతర శారీరక అవయవాలతో పాటుగా మానసిక ఆరోగ్యం సంతృప్తికరంగా ఉండేలా చూసుకోవాలి. శారీరక మానసిక ఆరోగ్యాలు ఒక దానిపై ఒకరి ఆధారపడి ఉంటాయి. దీర్ఘకాలిక శారీరక సమస్యలు కొన్ని సార్లు మెదడు పై తీవ్ర ప్రాభావాన్ని చూపుతాయి. అలాగే మానసిక రుగ్మతలతో శారీరకంగా క్షీణించిపోతారు.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే
మానసిక దృఢత్వం వల్లనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మానసిక దృఢత్వం కోసం యోగా, మెడిటేషన్ లాంటివి చేయాలి.మానసిక ఆరోగ్యం పై అభివృద్ది చెందిన దేశాలలో ఉన్న చైతన్యం మన దేశంలో కూడా పెంపొందించాలి. ఉద్వేగాలు అదుపులో ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సహనంను అలవరచుకోవాలి. పిల్లలలో సహనంను చిన్నప్పటి నుండే పెంపొందించాలి.ప్రతిరోజు కనీసం 45 నిమిషాల పాటు శారీరక వ్యాయామం నడక, జాగింగ్ చేయాలి. ప్రతి పనిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. సమయాన్ని సరైన ప్రణాళిక ద్వారా పూర్తి స్తాయిలో సద్వినియోగం చేసుకోవాలి. జీవన శైలి వ్యాధుల భారిన పడకముందే మేల్కొని, శారీరక పనులు (ఎక్షర్ సైజ్), ఆరోగ్యకర ఆహారం (సమతుల ఆహారం) తీసుకోవడం, ఒత్తిడి లేని, ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించటం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మానసిక ఆరోగ్యమే మనిషి ఆరోగ్య కరమైన జీవన విధానం.
– డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి
రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్
ఆధునిక హైదరాబాద్ వాస్తు శిల్పి 7వ నిజాం