వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
(నిన్నటి తరువాయి…)
నేను ఇక్కడ పుట్టి పెరిగి, చదువుకుని పనిచేస్తున్నా. అవన్నీ నావి కాదని, నేను ఇక్కడి బిడ్డని కాదనటానికి వాళ్లకేం అర్హత వుంది? నా కాలికింది భూమిని లాగేయాలని చూసే వీళ్ల ప్రయత్నాలను ఏమనాలి? నేను ఇక్కడి ఆడిబిడ్డని. వరంగల్‌కు ఒక చరిత్ర వుంది. అది ఏందంటే, రాణి రుద్రమదేవి పెళ్లి చేసుకున్న వ్యక్తి వేరే ప్రాంతం అయినప్పటికీ ఆమె ఇక్కడనే పరిపాలించింది. సమ్మక్క సారక్కలు ఇక్కడనే వున్నరు! వరంగల్ కు ఆడబిడ్డలు పరిపాలించిన చరిత్ర వుంది. అలాగే, నేను పుట్టిన గడ్డ మీద నేను ఒక ఎంపీగా డెఫినెట్ గా గెలుస్తాను. వాళ్లు ఎన్ని దాడులు చేసినా, మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా గానీ కచ్చితంగా నా గడ్డను పాలించిన వీరవనితల వారసత్వ స్పూర్తితో నేను మరింత పట్టుదలతో ముందుకే వెళతాను.
సజయ: ఈ విమర్శ కేవలం బీజేపీ నుంచే వస్తోందా లేక బిఆర్‌ఎస్ ఇంకా ఇతరుల నుంచీ కూడా వస్తోందా?
డా.కడియం కావ్య: బిఆర్‌ఎస్ వాళ్ల నుంచీ ఈ విమర్శ లేదు. కేవలం ఆ పార్టీ నుంచీ మారామన్నదే వాళ్లు విమర్శిస్తున్నారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి ఆ పార్టీ నేతలు మనుషుల్ని కులాలుగా, మతాలుగా విడదీసి ప్రచారం చేసుకుంటారు. కానీ వాళ్లు చేసిన అభివృద్ధి ఏమిటనేది గానీ, దాని మీద వాళ్ల పార్టీ విధానమేమిటనేది మాత్రం ఎక్కడా చెప్పటం లేదు.
సజయ: బీఆర్‌ఎస్ పార్టీ నుంచీ వెంటనే కాంగ్రెస్ కు మారారు అనే విమర్శ మీ మీద వుంది. దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి?
డా. కడియం కావ్య: నేను మొదటిసారి ఎన్నికలలో పోటీచేస్తూ ప్రజల ముందుకి వస్తున్నాను. ఒకరకంగా ఇది నా రాజకీయ ఆరంగ్రేటమ్ అనుకోవాలి. ఈ విషయం మీద బీఆర్‌ఎస్ పార్టీకి నేను ఏదైతే నా రాజీనామా లెటర్ లో ప్రస్తావించానో దానికి పూర్తిగా కట్టుబడివున్నాను. ‘‘… గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, ఫోన్ టాపింగ్ లాంటి వ్యవహారాలు మరియు లిక్కర్ స్కామ్ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవటం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తుంది…’’

సజయ: ప్రస్తుతం దేశంలో అన్నివేపులా బుసలు కొడుతున్న ఫాసిస్టు రాజకీయాలు.. ఉదాహరణలు చాలా వున్నాయి.. తినే తిండి మీద ఆంక్షలు.. కట్టుకునే బట్ట మీద.. స్త్రీలు ఎలా వుండాలి అనేదాని మీద ఆంక్షలు.. అంతెందుకు మీ వ్యక్తిగత జీవితం మీద చేస్తున్న దాడి, విమర్శ .. వీటిని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీగా మీరు ప్రజలకు చూపిస్తున్న మార్గం ఎలా వుండబోతోంది? ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు?
డా. కడియం కావ్య: ఇప్పుడు ఎలా వుందంటే ఈ పదేళ్ల బీజేపీ పాలనతో వంద రెండువందల ఏళ్లనాటి పరిస్థితుల్లోకి తీసుకు వెళుతున్నారు. మణిపూర్లో అంత ఘోరమైన అల్లర్లు, మహిళలను వివస్త్రలను చేసి రోడ్లమీద నడిపించడాలు… మంచినీళ్లు తాగినరనీ, మామిడికాయలు కోసినరనీ ఎస్సీల మీద చాలా ఘోరమైన ట్రీట్మెంట్ కూడా బీజేపీ ప్రభుత్వంలోనే పెరిగిపోతున్నాయి. తోటి మనుషుల మీద మూత్రం పోస్తరా ఎవరైనా? అది వీళ్లే చేస్తున్నారు. మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేయలేని పరిస్థితుల్ని దేశంలో తీసుకొచ్చినప్పుడు ఇలాంటి ప్రభుత్వాలు మనకు అవసరమా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కానీ, నాకు బాధ కలిగించే విషయం ఏందంటే, ఎవరైతే చదువుకునే విద్యార్థులున్నారో వారిని పూర్తిగా బ్రెయిన్ వాష్ చేసేస్తున్నారు. ఎలా అంటే, మన దేశాన్ని కాపాడుతున్నది బీజేపీయే, మన హిందూధర్మాన్ని కాపాడుతున్నది బీజేపీయే అనే తీరుగా వాళ్ల మైండ్ వాష్ చేసేస్తున్నరు. వాళ్ల తీరుకి కొంతమంది ఎట్రాక్ట్ అయిపోతున్నరు. వాళ్లకి పూర్తిస్థాయి మెచ్యూరిటీ లేదు, ఫ్యూచర్ జనరేషన్ ఏ విధంగా వుంటుంది అనే వాస్తవం, అవగాహన లేదు. నేను ఒక దళిత మహిళగా వరంగల్ లోకసభ ఎన్నికల బరిలో వున్నానంటే అది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు నాకు ఇచ్చిన హక్కుగా నేను భావిస్తాను. రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు అది.

అట్లాంటి రాజ్యాంగాన్ని మార్చేస్తాను, రెండిరట మూడొంతుల మెజార్టీ వస్తే చాలు, అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగం మార్చేస్తాను అనే ధీమాలో నరేంద్రమోడీ గారు వున్నారంటే మనమెంత భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నామనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే, నాకే కాదు ఎంతోమందికి ఎన్నో రకాలైన కలలు వుంటాయి. అవన్నీ నిజమవ్వాలంటే ఏం చేయాలి? డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కేవలం ఎస్సీ, ఎస్టీలకే కాదు మహిళలు, ఇంకా భారతదేశంలోని అశేష ప్రజానీకానికి, ప్రతి ఒక్కరికీ కావలసిన వ్యక్తి. వారికి వోటు హక్కు, చదువుకునే హక్కు కల్పించారు. ఇంకా అనేక హక్కుల్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. అలాంటి వ్యక్తిని తీసేస్తాము, రాజ్యాంగాన్ని మార్చేస్తాము అనటం ఏమిటి? అంత అవసరం ఏమొచ్చింది? నువ్వు అభివృద్ధిని చూపించు. అభివృద్ధి ఏం చేశావు? దక్షిణాది రాష్ట్రాలలో, మన తెలంగాణలో, వరంగల్ లో ఏంచేశావు? ఒక్కటి చూపించు. అడిగితే చూపించటానికి కూడా వాళ్ల దగ్గర ఒక్కటి లేదు. అట్లాంటి పరిస్థితిలో దేశం వున్నది. ఎక్కడ చూసినా మీడియా గానీ, ఈడీ గానీ వీళ్ల చెప్పుచేతల్లో వుండటం వల్ల జరుగుతున్న దారుణాలు హండ్రెడ్ కి హండ్రెడ్ బయటకు రావటం లేదు. సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని బయటకు వస్తున్నాయి. అన్నీ మాత్రం బయటకు రావటం లేదు. చాలా దారుణమైన స్థితిలో దేశాన్ని నెట్టివేస్తున్నారు. కేవలం షో పాలిటిక్స్ మాత్రమే నడుస్తున్నాయి.
అదే కాంగ్రెస్ వైపు నుంచీ ప్రధానమంత్రి అభ్యర్థిగా వున్న రాహుల్ గాంధీ గారిని తీసుకుంటే, ఆయన ఒకటే ఒక స్లోగన్ ఇచ్చారు, ‘‘నఫరత్ కె బాజార్ మే మొహబ్బత్ ఫూల్ కాంటో’’ అని! ఎంత మంచి స్లోగన్! ‘విద్వేషం వున్నచోట ప్రేమను పంచమని’ ఒక ప్రధానమంత్రి అభ్యర్థి చెప్తున్నరు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాటలో నడిచి జనగణన చేసి అందరికీ సమన్యాయం చేస్తా అని చెప్తున్నరు. ఆయన మన దేశానికి బంగారు బాటలు వేసే వైపు వుంటే ఇప్పుడు వున్న ప్రధానమంత్రి గారు మనల్ని శతాబ్దాల వెనక్కి నడిపించేలా చేస్తున్నరు. ఒక దళిత మహిళగా నాకు కూడా భయంగానే వుంటుంది. రానున్న భవిష్యత్తులో నా బిడ్డల పరిస్థితి, నా సమూహం పరిస్థితి ఏంది అనేది! ఇప్పుడు మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు, కేవలం ఉత్తరప్రదేశ్, బీహార్ లోనే వుంది అని అనుకోవటానికి ఏమీ లేదు. మళ్లీ ఈ వ్యక్తినే ప్రధానమంత్రిని గనుక చేస్తే ఇంకో ఐదేళ్లలో అన్ని రాష్ట్రాలలో పరిస్థితి మరింత దారుణంగా వుంటుంది. ప్రతిచోటా మసీదుల మీదా, చర్చిల మీద బుల్డోజర్లు ఎక్కిస్తున్నారు. అంత అవసరమేందీ? ఒక వ్యక్తికి స్వేచ్చ లేకుండా చేసే కుట్ర నరేంద్రమోడీ చేస్తున్నరనేది అందరూ గమనించాలి, అందుకే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలి. ఎందుకంటే, వారిద్దరికీ తేడా గమనించమని నేను ప్రజలను కోరుకుంటున్నాను.
ఈ పదేళ్ల కాలంలో ఎంతమంది మీద అఘాయిత్యాలు చేయించిన్రు, ఎన్ని ఘోరాలు జరిగాయి ఆలోచించండి. ఇంకోవైపు ఆయన చెప్పిన ప్రామిస్‌లు ఏవీ అమలు చేయలేదు. నల్లధనం ఎందుకు బయటకు తేలేదు, ప్రతి వొక్కరికీ అక్కౌంట్లలో వేస్తానని చెప్పిన పదిహేను లక్షలు ఎందుకు వేయలేదు? ఎన్నో చెప్పింన్రు, కానీ ఏమీ చేయలేదు. ఏమన్నా కొత్త విద్యా సంస్థలు వచ్చాయా? ఒక ఎన్‌ఐటీ, ఐఐటీ, ఐఐఎం అయినా ఇస్రో అయినా, మెడికల్ కాలేజీలయినా, ప్రాజెక్టులు అయినా అవన్నీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చినవే. మరి బిజేపీ ఏంచేసింది? చరిత్ర పుస్తకాలను మారుస్తూ ప్రజల్ని విజ్ఞానం వైపు కాకుండా ఇంకా ఇంకా మూఢనమ్మకాలలోకి తీసుకువెళ్లే కోర్స్లను ముందుకి తీసుకువస్తోంది. సైన్స్ ని వెనక్కి నెట్టడమే ప్రధాన ఉద్దేశంలాగా కనిపిస్తోంది. దేశం అనేది సామాజిక, విజ్ఞానరంగాలలో పురోగతిలోకి వెళ్లాలి గానీ ఈయన వెనక్కి నడిపిస్తున్నరు. కాబట్టి ప్రజలు ఈ తేడాను గమనించి ఈ ఎన్నికలలో వోటు వేయాలని కోరుకుంటున్నాను.
బీజేపీ తన ఈ పదేళ్ల పాలనలో పౌరులెవరి అభివృద్ధి కోసం పనిచేయలేదన్నది నిర్వివాదాంశం. ధరలు ఆకాశానికి వెళ్లాయి. జీఎస్టీ భారం, నిరుద్యోగం .. ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు. మతకోణం నుంచీ 400 సీట్లని రాబట్టుకోవాలని చేసిన ప్రయత్నం ముందుకు వెళ్లటం లేదని, 200 కూడా వచ్చే పరిస్థితి కూడా లేదని అర్థమయిన తర్వాత ఆయన మొన్న మహిళల గురించీ మాట్లాడినదేమిటి? కాంగ్రెస్ వస్తే పుస్తెలు లాక్కుంటుంది అని. ఏదైతే తలా తోకా లేకుండా మాట్లాడుతున్నరో అందరూ చూస్తూనే వున్నరు. ఏ విధంగా దేశాన్ని ముందుకి తీసుకు వెళ్లాలనుకుంటున్నారో, ఎలా వ్యక్తి స్వేచ్ఛను అడ్డుకోవాలనుకుంటున్నారో అందరికీ అర్థమవుతోంది. ఎంత సేపటికీ రామమందిరం విషయమొక్కటే చూపించి అదే మొత్తం సమస్య అంటే కుదరదు కదా? ఆ ఒక్క దానితోనే అందరూ కడుపునిండా తింటారు, ఉద్యోగాలు వస్తాయి, సుఖంగా వుంటారు అని చెబితే ప్రజలు ఎలా నమ్ముతారు? రాముడు అందరికీ దేవుడే. శ్రీరామనవమి పండుగని ఎప్పటి నుంచో అందరూ చేసుకుంటూనే వున్నాము. మనకు ఇంకా చాలా పండుగలు వున్నాయి, అన్ని పండుగలు చక్కగా చేసుకుని రిలాక్స్ అవ్వాలంటే ప్రజలందరికీ ముందు జీవనభద్రత వుండాలి కదా? ఆ విషయాలు మాత్రం మాట్లాడకుండా అభివృద్ధి ఏం చేస్తారో చెప్పకుండా ఒకటే మాట్లాడితే కుదరదు కదా? ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. విభిన్న సమూహాల, సంస్కృతుల ప్రజలు వున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వికలాంగులు, మహిళలు, దళితులు, ఆదివాసులు, ట్రాన్స్ జెండర్ వ్యక్తులు, నిరుపేదలు, ఆర్థికంగా వెనకబడినవారు- వీరి సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాలంటే
స్పష్టంగా ప్రణాళికా బద్ధంగానే వెళ్లాల్సిన అవసరం ఎంతైనా వుంది. ప్రత్యేక బడ్జెట్లు అవసరమవుతాయి. ఆ వైపుగా కాంగ్రెస్ పార్టీ చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తోంది. మేము ఏమి చేయబోతున్నామనేది మా మానిఫెస్టోలో కూడా ప్రకటించాము. అదే ‘ఐదు న్యాయాలు’. 1. సమన్యాయం, 2. రైతు న్యాయం, 3. కార్మిక న్యాయం, 4. యువ న్యాయం, 5. మహిళా న్యాయం.
సజయ : మీ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల్లో మీరు ప్రధానంగా ఫోకస్ చేయబోయే అంశాలు ఏమిటి? వాటిని ఎలా అధిగమిస్తారు? అదేవిధంగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మీరు ఏ ప్రధాన అంశాలపై దృష్టి పెట్టి ప్రణాళికాబద్ధమైన, చట్టబద్ధమైన కార్యకలాపాలను రూపొందించి స్థానికంగా అమలు చేయాలని అనుకుంటున్నారు?
డా. కడియం కావ్య: నేను ఇక్కడే పుట్టి, పెరగటం వల్ల నాకు ఇక్కడి అనేక సమస్యల మీద అవగాహన వుంది. ముఖ్యంగా ఆడపిల్లలు, మహిళలు ఎదుర్కునే అంశాల మీద చాలా పనిచేశాను. మెన్స్ట్రువల్ హైజీన్ గురించి చెప్పటానికి ప్యాడ్స్ ఇవ్వటానికి అనేక ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లినపుడు కచ్చితంగా అక్కడి టాయిలెట్స్ ఎలా వున్నాయి, వాటి నిర్వహణ, నీళ్లు వున్నాయా, సెక్యూరిటీ ఎలా వుంది అని చూసేదాన్ని. ముఖ్యంగా అమ్మాయిలకు అత్యంత అవసరమైన విషయాలు ఇవి. చాలా స్కూల్స్ లో, హాస్టల్స్ లో నిర్వహణ సరిగ్గా వుండేది కాదు. సరైన బడ్జెట్ వుండేది కాదు. నేను ప్రభుత్వ డాక్టర్ గా పనిచేసేటప్పుడు హాస్పిటల్స్ లో ఎలా వుండేది నాకు అనుభవమే! గర్భిణీ స్త్రీలకు బేసిక్ సౌకర్యాలు కూడా లేకపోతే చెకప్ చేయించుకోవటానికి వచ్చినపుడు చాలా ఇబ్బందులు పడేవారు. కమ్యూనిటి హెల్త్ సెంటర్స్ లో ఈ సౌకర్యాలు లేక చిన్న పాయిజనింగ్ కేసు వచ్చినా గానీ వేరే పెద్ద హాస్పిటల్ కు రిఫర్ చేయాల్సి వస్తోంది. వరంగల్ లోక్ సభ నియోజక వర్గం పరిధిలో నా మొదటి ప్రాధాన్యత ఆరోగ్యం, విద్య. ప్రజలకు, ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావటం. నాణ్యమైన సేవలు అందేలా చేయటం.

అవగాహన పెంచేలా కృషి చేయటం. తర్వాత యువతకు ఉపాధి అవకాశాలు, లెదర్ పార్క్, టెక్స్టైల్ పార్క్ లను డెవలప్ చేయటం. తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ని ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయలేదు. వరంగల్ స్మార్ట్ సిటీస్ లో లిస్ట్ అయి వుంది కానీ అవసరమైన పూర్తిస్థాయి ఫండ్స్ ఇంకా అందించలేదు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ వరంగల్. రెండో రాజధాని అని చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషన్ హబ్, ఐటీ హబ్, ఇండస్ట్రియల్ హబ్ వంటివి బాగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఎయిర్పోర్టు, వోఆరార్ వంటివి కూడా పరిశీలనలో వున్నాయి. ఒక ఐఐఎమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పదేళ్ల బిజీపీ పాలనలో ఏ వక్కటీ వరంగల్ కు రాలేదు. సమ్మక్క సారక్క జాతరకు జాతీయహోదా కల్పించలేదు. ఎన్నో విషయాలు పెండిరగ్లో వున్నాయి. వాటన్నిటి కోసమూ, ఎలాగైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో కేంద్రంలో కూడా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఇక్కడ అవన్నీ చేయటానికి అవకాశం వుంటుంది. ముప్ఫై ఐదు సంవత్సరాల తర్వాత వరంగల్ లోక్ సభ బరిలో ఒక మహిళ అందునా ఒక యువ దళిత మహిళగా పోటీచేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ నాకు కల్పించింది. యువతకి సహజంగానే చాలా ఇన్నోవేటివ్ ఆలోచనలు వుంటాయి. క్లారిటీ ఆఫ్ థాట్ వుంటుంది. నిర్మాణాత్మకమైన విమర్శను అంగీకరిస్తారు. ఒక యువ దళిత మహిళా డాక్టర్ గా ‘పే బ్యాక్ టు సొసైటి’ అని నమ్మిన వ్యక్తిని నేను. ఎన్నో అంశాలలో వివిధ సమూహాలు, ప్రభుత్వాలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించాను. రాజకీయ నాయకులు, పార్టీలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయి అని ప్రజలు నిరంతరం గమనిస్తూనే వుంటారు. నిరంకుశత్వాన్ని సహించరు. ఎంత డిక్టేటర్ నయినా గద్దె దింపటానికి వెనుకాడరు. ప్రజాస్వామ్యం నిలబడటం అంటే ఇదే. ఇది రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాలి.
కాంగ్రెస్ పార్టీ తన మానిఫెస్టో లో చెప్పినట్లు ‘ఐదు న్యాయ’ అంశాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు పథకాలు అన్నిటినీ చూసి ఆలోచించి, వరంగల్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి వోటు వేయమని అడుగుతున్నాను. ఒక డాక్టర్ గా, సోషల్ యాక్టివిస్ట్ గా, నిజాయితీపరుడైన సీనియర్ రాజకీయ నాయకుడు కడియం శ్రీహరి గారి కుమార్తెగా కుల, మత విద్వేషాలకు, జెండర్ విద్వేషానికి తావులేని అభివృద్ధిని కోరుకునే వ్యక్తిగా ఈ ఎన్నికలలో పోటీచేస్తున్నాను. మనుషుల మధ్య విద్వేషం కాదు, సమగ్ర జీవనాభివృద్ధి కావాలి.
-కె.సజయ, సామాజికవిశ్లేషకులు,
స్వతంత్ర జర్నలిస్ట్
-కె.సజయ, సామాజికవిశ్లేషకులు,
స్వతంత్ర జర్నలిస్ట్