Take a fresh look at your lifestyle.

‘‌మధ్య’ తరగతి బడ్జెట్‌

  • 2023-24 ‌మొత్తం పద్దు రూ.45.03 లక్షల కోట్లు
  • ఆదాయ పన్ను పరిమితి 5 లక్షల నుంచి రూ.7లక్షలకు పెంపు  
  • ఆదాయం రూ.7 లక్షలు దాటితే 5 స్లాబుల్లో 5 నుంచి 30 శాతం వరకు పన్ను
  • వేతన జీవులకు ఊరట…స్టాండర్డ్ ‌డిడక్షన్‌ ‌రూ.3 లక్షలకు పెంపు
  • మూలధన వ్యయానికి రూ.10 లక్షల కోట్లు
  • రైల్వేలకు పెద్ద పీట..గతం కన్నా నాలుగు రెట్ల బడ్జెట్‌
  • ‌టూరిజం అభివృద్ధికి ప్రత్యేక నిధులు
  • కొత్తగా 50 ఎయిర్‌పోర్టులు, హెలిప్యాడ్‌ల నిర్మాణం
  • నిరుద్యోగుల కోసం పీఎం కౌశల్‌ ‌పథకం
  • మహిళల కోసం కొత్త పథకం
  • సీనియర్‌ ‌సిటిజన్ల డిపాజిట్‌ ‌పరిమితి రూ.30 లక్షల వరకు పెంపు
  • నీతి ఆయోగ్‌ ‌మరో మూడేళ్లపాటు పొడిగింపు
  • 5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌లు
  • రూ.75వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన
  • అర్బన్‌ ఇన్‌ ‌ఫ్రా ఫండ్‌ ‌కోసం రూ.10వేల కోట్లు
  • వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయింపు
  • రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల సౌకర్యం ఏడాది పొడిగింపు
  • గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15వేల కోట్లు
  • ఎంఎస్‌ఎంఈలకు, వ్యవసాయ రంగానికి, గ్రామీణ ప్రాంతాలకు దక్కని ఊరట

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : ఇటీవల బిజెపి కార్యవర్గ సమావేశాలలో ప్రధాని మోడీ మధ్య తరగతి ప్రజలను దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినట్లు వొచ్చిన వార్తలకు అనుగుణంగానే బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌లోక్‌ ‌సభలో ప్రవేశపెట్టిన 2023-24 సాధారణ బడ్జెట్‌ ఉం‌ది. 2024 సాధారణ ఎన్నికలకు ముందు చివరి సారిగా ప్రవేశ పెట్టే పూర్తి స్థాయి బడ్జెట్‌ ‌కావడంలో ఎలాంటి జిమ్మిక్కులు, మెరుపులు, పెద్దగా వడ్డింపులు, ఊరడింపులు, అంకెల గారడీలు లేకుండా బడ్జెట్‌ ఒకింత మధ్య తరగతి ప్రజలకు అనుకూలంగా ఉంది. అయితే ఈ సారీ బడ్జెట్‌ ‌ప్రతిపాదనల్లో ప్రస్తావించిన అంశాల్లో ప్రధానంగా చెప్పుకోదగిన అంశాలు…ఆదాయపు పన్ను పరిమితిని రూ. 5 లక్షల నుంచి 7 లక్షలకు పెంపు, పన్ను స్లాబులను 5 లక్షలకు కుదింపు, వేతన జీవులకు స్టాండర్డ్ ‌డిడక్షన్‌ ‌రూ. 2.50 లక్షల నుండి 3 లక్షలకు పెంపు, రైల్వేలకు అత్యధికంగా రూ.2.40 లక్షల కోట్ల కేటాయింపు, ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్‌కు ప్రాధాన్యం వంటివి.

అయితే ప్రధాని మోడీ చెప్పినట్లుగా ప్రపంచం యావత్తూ భారత్‌ ‌బడ్జెట్‌ ‌వైపు చూస్తుందన్న సూచనలు ఏవీ లేకుండా బడ్జెట్‌ ‌సాధారణంగా ఆవిష్కృతం అయ్యింది. వరాలు కానీ, మాయలు కానీ లేకుండా సాదాసీదాగానే బడ్జెట్‌ ‌కేటాయింపులు చేపట్టారు. ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఎలాంటి తాయిలాలు ప్రకటించే ప్రయత్నం చేయకుండా ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన వార్షిక బ్జడెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ‌పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అమృత కాలంలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌గా ఆమె పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ అని పేర్కొన్నారు. ఈసారి బడ్జెట్‌ ‌రూపకల్పనలో ఏడు కీలక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఆదాయపు పన్నుల్లో శ్లాబుల వంటి ఉత్సాహం కొతం ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవాలి. మొత్తంగా సాదాసీదాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఐదోసారి తన 2023-2024 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. పలు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉత్సాహకరంగా ఉంటుందన్న భావన లేకుండా ముందుకు సాగారు. ఆమె బడ్జెట్‌ ‌ప్రసంగం గంటన్నర సేపు సాగింది. ఇకపోతే ఏడు ప్రాధాన్యతా అంశాల ఆధారంగా బడ్జెట్‌ ‌రూపకల్పన సాగిందని చెప్పారు. సమ్మిళిత వృద్ధి, చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు, మౌలిక సదుపాయలు-పెట్టుబడులు,సామర్థ్యాల వెలికితీత, స్వచ్ఛ పర్యావరణ అనుకూల అభివృద్ధి, యువశక్తి, విత్త విధానం ఆధారంగా బడ్జెట్‌ ‌రూపకల్పన చేసినట్లు నిర్మలాసీతారామన్‌ ‌ప్రకటించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ను తీసుకొచ్చినట్లు చెప్పారు.

వృద్ధి రేటు ఈ ఏడాది 7 శాతంగా వొస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసినట్లు చెప్పారు. గత9 సంవత్సరాల్లో తలసరి ఆదాయం రెట్టింపైందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమమే లక్ష్యంగా బ్జడెట్‌ను తీసుకొచ్చినట్లు నిర్మలమ్మ వివరించారు. తొమ్మిదేళ్లలో దేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవించిందని ఆమె చెప్పారు. దేశవ్యాప్తంగా మెడికల్‌ ‌కాలేజీలతో పాటు 157 నర్సింగ్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఏకలవ్య పాఠశాలల్లో 38,800 టీచర్ల నియామకం చేపట్టనున్నారు. మహిళా సాధికారత దిశగా భారత్‌ ‌కృషి చేస్తుందని అన్నారు. వ్యవసాయ రంగానికి రుణ, మార్కెటింగ్‌ ‌సదుపాయం కల్పిస్తామన్నారు. గ్రీన్‌ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దేశవ్యాప్తంగా 11.7కోట్ల టాయిలెట్స్ ‌నిర్మించాం. 2047 లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నాంమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌ ‌రూపొందించామన్నారు. ప్రస్తుత ఏడాదికి వృద్ధి రేటు 7శాతంగా అంచనా వేశారు. 9 ఏళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు అయ్యింది.102 కోట్ల మందికి కొవిడ్‌ ‌టీకా అందించాం. ఆత్మనిర్భర్‌ ‌భారత్‌తో చేనేత వర్గానికి లబ్ది చేకూరిందని వివరించారు.

బడ్జెట్‌ ‌ప్రసంగాన్ని 11.00 గంటలకు ప్రారంభించిన మంత్రి పన్నెండున్నర గంటలకు ముగించారు. దేశ వృద్ధి రేటు శరవేగంగా పెరుగుతుందని, భారత్‌ ఆర్థిక వృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయని అన్నారు. ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు అయ్యింది. ఉపాధి అవకాశాలను పెంపొందించడమే ఈ బడ్జెట్‌ ‌టార్గెట్‌ అని పేర్కొన్నారు. మురుగునీటి వ్యవస్థపై ప్రకటన చేస్తూ..‘మ్యాన్‌ ‌హోల్‌ ‌టు మెషీన్‌ ‌మోడ్‌’ ‌ద్వారా దేశవ్యాప్తంగా అన్ని మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేసేందుకు యంత్రాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. పలు వస్తువులపై కస్టమ్స్ ‌డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ప్రకటించారు. టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్ ‌డ్యూటీ 2.5శాతం తగ్గించింది. టీవీలు, మొబైళ్లు, ఎలక్ట్రి ‌వాహనాలు ధరలు భారీగా తగ్గనున్నాయి. వేతనజీవులకు కేంద్రం ఊరట లభించింది. ఆదాయ పన్ను పరిమితి పెంపు రూ.7లక్షల వరకు పన్ను మినహాయింపును ఇచ్చింది. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌చెప్పారు. వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.13.7లక్షల కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు. రైల్వేకు రూ.2.4లక్షల కోట్లు ఇస్తున్నామని తెలిపారు.  2013-14తో పోలిస్తే రైల్వేలకు 9 రేట్ల నిధులు కేటాయించామన్నారు. ‘పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కింద ఏటా రూ.10 వేల కోట్లు. పీఎం ఆవాస్‌ ‌యోజనకు రూ.79 వేల కోట్లు. కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు.

మూలధన వ్యయాలు మొత్తం రూ.10 లక్షల కోట్లు కేటాయిస్తున్నాం’ అని నిర్మలా సీతారామన్‌ ‌వెల్లడించారు. కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారికి మోడీ సర్కారు గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పింది. పీఎం ఆవాస్‌ ‌యోజన పథకానికి బ్జడెట్‌లో నిధులు భారీగా పెంచింది. గతేడాది ఈ పథకానికి రూ.48వేల కోట్లు కేటాయించగా.. ఈ సారి ఆ మొత్తాన్ని 66శాతం పెంచింది. ప్రస్తుత బ్జడెట్‌ ‌లో రూ.79వేల కోట్లు కేటాయించింది. వడ్డీ రేట్ల పెరుగుదలతో సందిగ్దంలో పడ్డ గృహ కొనుగోలుదారులకు కేంద్రం ప్రకటన ఊరటనిచ్చింది. కేంద్రం తాజా నిర్ణయంతో పీఎం ఆవాస్‌ ‌యోజన కింద మరింత మందికి లబ్ది చేకూరనుంది. ప్రధాన మంత్రి ఆవాస్‌ ‌యోజన కింద ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రజలకు రుణాలపై సబ్సిడీ ఇస్తుంది. మూడు లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులు.  పీఎం ఆవాస్‌ ‌యోజనలో భాగంగా ప్రభుత్వం మూడు విడతలుగా రూ.2.50 లక్షల సాయం అందిస్తుంది. మొదటి విడతలో రూ. 50 వేలు, రెండో విడతలో రూ. 1.50 లక్షలు, మూడో విడతగా కొ.50 వేలు ఇస్తారు. మొత్తం రూ. 2.50 లక్షల సబ్సిడీలో ఒక లక్ష సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది.

కేంద్ర ప్రభుత్వం మిగిలిన 1.50 లక్షలు మంజూరు చేస్తుంది. బడ్జెట్‌లో కేంద్రం రైల్వేలకు రికార్డు స్థాయి కేటాయింపులు చేసింది. రైల్వేల అభివృద్ధికి రూ.2.4లక్షల కోట్ల నిధులు ఇచ్చింది. 2013 -14తో పోలిస్తే రైల్వేలకు కేటాయించిన నిధులు 9 రెట్లు ఎక్కువ. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తామని నిర్మలా సీతారామన్‌ ‌ప్రకటించారు. ఇక మౌలిక వసతుల అభివృద్ధికి 33 శాతం ఎక్కువగా నిధులతో పాటు మూలధనం కింద రూ.10లక్షల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. బడ్జెట్‌లో డిజిటల్‌ ‌విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. చిన్నారులు, యుక్త వయస్సు వారి కోసం నేషనల్‌ ‌డిజిటల్‌ ‌లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌చెప్పారు. నాణ్యమైన పుస్తకాల లభ్యతను సులభతరం చేయడం కోసం దీనిని అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. భౌగోళిక, భాషాపరమైన, కళలపరంగా, అన్ని స్థాయుల్లో పుస్తకాలను ఇది అందుబాటులోకి ఉంచుతుంది. ‘యువత కోసం పంచాయతీ, వార్డు స్థాయుల్లో ఫిజికల్‌ ‌లైబ్రరీలు ఏర్పాటుకు రాష్ట్రాలకు ప్రోత్సాహం అందిస్తాం. నేషనల్‌ ‌డిజిటల్‌ ‌లైబ్రరీ సదుపాయాన్ని పొందేందుకు కావాల్సిన మౌలిక వసతులకు తోడ్పాటు అందిస్తాం’ అని వెల్లడించారు. రానున్న మూడు సంవత్సరాలకు 740 ఏకలవ్య మోడల్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాల కోసం నియామకాలు చేపట్టనున్నట్లు చెప్పారు.

ఈ పాఠశాలల కింద 3.5 లక్షల గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గ్లోబల్‌ ‌హబ్‌ ‌ఫోర్‌ ‌మిల్లెట్స్ ‌కింద మిల్లెట్స్‌లో భారతదేశం చాలా ముందుంది. రైతులకు పౌష్టికాహారం, ఆహార భద్రత, ప్రణాళిక కోసం మిల్లెట్స్ ‌కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీఅన్నా రాడి, శ్రీఅన్నా బజ్రా, శ్రీఅన్నా రందానా, కుంగ్ని, కుట్టు అన్ని ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. మినుముల్లో రైతుల సహకారం ఎంతో ఉందని, శ్రీ అన్నను హబ్‌గా మార్చేందుకు కఅషి చేస్తున్నామన్నారు. శ్రీఅన్న నిర్మాణానికి హైదరాబాద్‌లోని రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ ‌నుంచి చాలా సాయం అందుతుంది. 2023-24 సంవత్సరానికి రూ. 20 లక్షల కోట్ల రుణ లక్ష్యం నిర్దేశిరచబడింది. వ్యవసాయ రంగానికి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. త్వరలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మిల్లెట్స్ ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌తెలిపారు. భారతదేశం ఏ 100 ద్వారా దేశం ప్రపంచవ్యాప్తంగా బలోపేతం అవుతుంది. గ్రావి•ణ మహిళల కోసం 81 లక్షల స్వయం సహాయక సంఘాలకు సహాయం లభించింది.

ఇక ముందు ఇది మరింత పెరుగుతుంది. క్రాప్ట్, ‌ట్రేడ్‌లో పనిచేస్తున్నవారికి, కళ, హస్తకళలకు సహకరించేందుకు పీఎం విశ్వ కర్మ కౌశల్‌ ‌సమ్మాన్‌ ‌తీసుకొస్తున్నాం. స్వావలంబన భారతదేశానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. దీని ద్వారా ఆర్థికంగా చేయూత అందించడమే కాకుండా వారి సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచడంపై దఅష్టి సారించి వారికి సామాజిక భద్రత కల్పించారు. మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహిస్తాం. శతాబ్దాల తరబడి తమ స్వహస్తాలతో సంప్రదాయబద్ధంగా పని చేసేవారిని విశ్వకర్మ అనే పేరుతో సంబోధిస్తున్నారు. తొలిసారిగా వారికి సహాయ ప్యాకేజీని నిర్ణయించారు. వాటిని వీజు చైన్‌తో అనుసంధానించే పని జరుగుతుంది.

గరీబ్‌ ‌కళ్యాణ్‌ అన్న యోజనలో రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేశాం. 2014 నుంచి నిరంతరంగా చేస్తున్న కృషి వల్ల ప్రపంచంలోనే 10 నుంచి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం. పీఎం సురక్ష, పీఎం జీవన్‌ ‌జ్యోతి యోజన ద్వారా కోట్లాది మందికి లబ్థి చేకూరుతుందని నిర్మలా సీతారామన్‌ ‌తెలిపారు.  ప్రభుత్వం 220 కోట్ల కోవిడ్‌ ‌టీకాలను అందించాం. 44.6 కోట్ల మంది ప్రజలు పీఎం సురక్ష, పీఎం జీవన్‌ ‌జ్యోతి యోజన ద్వారా పొందారు. ప్రధానమంత్రి కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి ద్వారా కోట్లాది మంది రైతులు లబ్ది పొందుతున్నారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వం సబ్‌కా సాథ్‌, ‌సబ్‌కా వికాస్‌ ‌ద్వారా ముందుకు సాగింది. 28 నెలల్లో 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఇచ్చాం అంటే చిన్న విషయం కాదన్నారు నిర్మలా సీతారామన్‌. ‌గత కొన్నేళ్లలో భారత ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు అయిందని ఆర్థిక మంత్రి తెలిపారు. తలసరి ఆదాయం ఏటా రూ.1.97 లక్షలకు చేరుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ గతంలో కంటే మరింత వ్యవస్థీకృతమైంది. దీని ప్రభావం ప్రజల జీవన స్థితిగతులపై కనిపిస్తోంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రేటు దాదాపు 7 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ . ఉపాధి అవకాశాలను పెంపొందించాలనేది ప్రభుత్వ ప్రత్యేక దృష్టి  భారతదేశం నుండి   జి 20 అధ్యక్ష పదవి ఒక పెద్ద అవకాశం. ఇది భారతదేశ బలాన్ని చూపుతుందన్నారు . బడ్జెట్‌ ‌కేటాయింపులు చెబుతున్నప్పుడు ప్రధాని సహా మంత్రులు, ఎంపిలు బల్లలు చరిచారు.

Leave a Reply