Take a fresh look at your lifestyle.

మద్యం మత్తులో టిసి దుశ్చర్య

  • మహిళ తలపై మూత్ర విసర్జన
  • పట్టుకుని దేశశుద్ధి చేసిన ప్రయాణికులు

న్యూ దిల్లీ, మార్చి 14 : ఇటీవల విమానంలో ఓ వ్యక్తి మహిళపై మూత్రవిసర్జన చేయగా..తాజాగా ఓ రైలో టిసినే ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధ్యతగా వ్యవహరించాల్సిన రైల్వే టీసీ రైల్లో అర్థరాత్రి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ఓ మహిళ తలపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. అకల్‌ ‌తఖ్త్ ఎక్స్‌ప్రెస్‌ ఏ1 ‌కోచ్‌ ‌లో ప్రయాణిస్తున్న బాధితురాలు.. తన భర్త రాజేష్‌ ‌కుమార్‌తో అమృత్‌ ‌సర్‌ ‌నుంచి కోల్‌ ‌కతా వెళ్తుంది.

అర్థరాత్రి రైల్వే టీసీ మున్నా కుమార్‌ ‌మద్యం మత్తులో బాధితురాలి తలపై మూత్ర విసర్జన చేశాడు. దాంతో ఆగ్రహించిన సదరు మహిళ టీసీతో గొడవకు దిగింది. గొడవ వల్ల మెళకువ వచ్చిన మిగతా ప్రయాణికులు టీసీని పట్టుకొని చితక బాదారు. తర్వాత ఛార్‌ ‌భాగ్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌లో రైల్వే పోలీసులకు అప్పగించారు. నిందుతుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు రిజిస్టర్‌ ‌చేశారు. నిందితుడిని బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Leave a Reply