ఎల్.బి నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ని హైదరాబాదు లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల అమెరికా పర్యటనను విజయ వంతంగా పూర్తి చేసుకుని, నగరానికి వచ్చిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సేవ కార్యక్రమాల చేపడుతున్న శ్రీనివాస గుప్త ను కేటీఆర్ అభినందించారు. మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని మంత్రి కేటీఆర్ సూచించారు.