భారత సంస్కరణల శిల్పి భారతరత్న పివి

పదవులకే వన్నెలు చెక్కిన శిల్పి  సంస్కరణల ఆధ్యుడు అపర మేధావి పండితమూర్తి పాములపర్తి వేంకట నరసింహారావు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించడం తెలంగాణకే కాక దేశానికే గొప్ప గర్వకారణం. కేంద్రంలో విదేశాంగ, రక్షణ, మానవ వనరుల శాఖ మంత్రి గా పనిచేసి దేశానికి కీర్తిని అందించిన కిరీటీ. దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలు నెలకొల్పి ఎందరో గ్రామీణ పిల్లలకు ఉచితంగా భోజన వసతి  విద్యనందిస్తున్న  రూప శిల్పి ఇవి గ్రామీణ భారతావనికి కలికితురాయివంటివి.  ఉమ్మడి రాష్ట్రంలో పివి చేసిన సంస్కరణలు చిరస్మరణీయం. ఆ మహానుభావుడు అందించిన భూసంస్కరణలు, ప్రత్యేకంగా తెలంగాణలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకోని వచ్చి ఇప్పుడు ఫలాలు అందరూ అనుభవిస్తూన్నారు. మంథని శాసనసభ్యుడుగా, మానేరు నది పై వారిది నిర్మింపచేసి, ఆ ప్రాంతవారికి ఎనలేని సౌకర్యం కల్పించినారు. ఇప్పటికీ ఈ తరం ప్రజలు కూడా పివి ని  ఎంతగానో కోనియాడుతుంటారు. ఈ వారధి మంథని, కాళేశ్వరం , మహాదేవపూర్‌  ప్రాంతంలో అభివృద్ధికి పునాదులు వేసి పెను మార్పులకు  నిలయముగా నిలిచినది.
మొట్టమొదటిసారి కాంగ్రెస్‌ పార్టీ నుండి నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తి ఐదు సంవత్సరాలు దేశాన్ని ఏలిన దక్షిణ భారతదేశానికి చెందిన తెలంగాణ ప్రాంతపు  పాములపర్తి వేంకట నరసింహారావు ప్రధాని పదవిని అధిష్టించి సామాన్యుడు అంగ బలం లేని వ్యక్తి దేశాధినేత కావచ్చని నిరూపించినాడు. పివి గొప్ప తత్వవేత్త  మహా మేధావి  అనేక గ్రంథాలు రచించిన పండితమూర్తి అపర రాజకీయ చాణుక్యుడు.

భారతదేశ చరిత్రను నిర్ణయాత్మకంగా మార్చిన వ్యక్తి. విధిలేని పరిస్థితుల్లో  అధికారం అతని తలుపు తట్టిన సమయంలో, దేశం మండల్‌ (వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు) మరియు రామ మందిరం (బాబ్రీ మసీదుపై హిందూ జాతీయవాద వాదనలు) ప్రాతినిధ్యం వహించే రాజకీయ శక్తుల మధ్య సమర్థవంతంగా విభజించబడిరది. దేశం సామాజిక పతనం అంచున ఉండటమే కాదు, కాంగ్రెస్‌ పార్టీ కూడా రాజకీయంగా ఆయనను అణగదొక్కే దిశగా ప్రయత్నం మొదలు పెట్టినారు. అతి తక్కువ కాలంలోనే ఆయన తన పార్టీ పతనాన్ని అరికట్టడమే కాకుండా స్వాతంత్య్రోద్యమం నుండి అత్యంత ఉత్పాదక రాజకీయ వేదికలపై దేశాన్ని ఏకం చేయగలిగిన ఘనత పివిదే. తెలుగు మాతృభాష అయితే, అయన భాషా ప్రతిభ మూలంగా  ఇతర భాషలను ఎంచుకునేలా చేసింది  ఉర్దు పర్షియన్‌ మరియు మరాఠీ, మహారాష్ట్ర  విశ్వవిద్యాలయంలో గణితం మరియు తరువాత న్యాయశాస్త్ర విద్యను పూర్తి చేసినాడు. హిందీలో ఎంత ప్రావీణ్యం సంపాదించినాడు ఒక ప్రసిద్ధ తెలుగు నవల అనువాదానికి ప్రభుత్వ అవార్డును పొందినాడు. పివి తన జీవితకాలంలో కనీసం 15 భాషల్లో ప్రావీణ్యం సంపాదించినారు.

జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌ సమావేశానికి భారతదేశ ప్రతినిధి బృందానికి ప్రతిపక్ష బిజెపి నాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయిని పంపించినాడు తరువాత ఆయన దేశ ప్రధానమంత్రి అయ్యారు. ఇటీవలి సంవత్సరాలలో అత్యంత ధ్రువణ రాజకీయాలలో, అటువంటి సంఘటన ఊహించలేనిది. తెలంగాణలోని  నిరాడంబరమైన కుటుంబంలో జన్మించిన పివి, ఎప్పుడూ స్వయం ప్రతిపత్తి కలిగి ఉండేవారు,  రాజకీయ ఔన్నత్యం కంటే పాండిత్యం మరియు మేధోపరమైన అభ్యున్నతి ఎక్కువ మక్కువ కలిగి ఉండేవారు. పివి గొప్పతనాన్ని  నాకు తెలియపరచిన మా తండ్రి  రామేశ్వర రావు ఫలితంగా ఆయనను కలవాలని ప్రబలమైన కోరిక నెరవేర్చుకొన్నాను అదృష్టంగా ఇంతటి ఆదర్శ పురుషున్ని భారత ప్రధానమంత్రి భారతరత్న బిరుదాంకితున్ని గురించి వ్రాయడం  మరుపురాని మధురమైన ఘట్టంగా మరియు జీవితం ధన్యమైందని  భావిస్తున్నాను.

-దండంరాజు రాంచందర్‌ రావు
రిటైర్డ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌,
సింగరేణిభవన్‌  హైదరాబాద్‌
 సెల్‌: 9849592958

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *