న్యూ దిల్లీ, మార్చి 30 : పాకిస్తాన్‌కు భారత్‌లో భారీ షాక్ తగిలింది. ఆ దేశ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతాను ట్విట్టర్ ఇండియా నిలిపివేసింది. లీగల్ డిమాండ్ నేపథ్యంలోనే మార్చి 30వ తేదీ నుంచి ఆ ఖాతాను భారత్‌లో ట్విట్టర్ బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సరైన కారణాన్ని ఇప్పటి వరకు ట్విటర్ వెల్లడించలేదు. భారత్‌లో ఉన్నవారు ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించగా.. ’అకౌంట్ విత్‌హెల్డ్’ అని చూపిస్తోంది. భారత్‌లో పాక్ ట్విట్టర్ ఖాతా నిలిపివేయడం ఆరు నెల్లలోనే ఇది రెండోసారి. ఈ విషయంపై భారత్, పాకిస్థాన్ అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.
చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా పాకిస్థాన్ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతా ను భారతదేశంలో చూడకుండా బ్లాక్ చేసినట్లు సోషల్ డియా ఎలాట్‌ఫామ్‌లోని నోటీసుల ప్రకారం వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. కంపెనీ మార్గదర్శకాలు, కోర్టు ఆర్డర్ వంటి చెల్లుబాటు అయ్యే చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా… ట్విట్టర్ పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఖాతాను భారత్‌లో బ్లాక్ చేసినట్లు పేర్కొంది. అమెరికా, కెనడా వంటి ఇతర దేశాల్లో పాకిస్థాన్ ప్రభుత్వ ట్విటర్ ఖాతా పని చేస్తోంది.