రెండువందల సంవత్సరాల వలస పరిపాలన నుంచి భారతదేశాన్ని విముక్తి పరుచుటకై స్వతంత్ర ఉద్యమంలో తమ ప్రాణాలను జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు మహనీయులు ఎందరో. వీరిలో ప్రముఖులు భారతదేశ మూడవ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్. దేశానికి స్వతంత్రం వచ్చాక కూడా దేశ అభివృద్ధిలో దేశ ప్రజలను ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దుటలో తన వంతు కృషిచేసిన మహనీయుడు. మొత్తం భారతదేశం నా ఇల్లు ప్రజలందరూ నా కుటుంబం’’అనే నినాదంతో తన పుట్టుక నుండి మరణం వరకు దేశ సేవలో దేశాభివృద్ధిలో తనదైన శైలిలో కృషి చేసినటువంటి మహానుభా వుడు జాకీర్ హుస్సేన్. భారతదేశ మూడవ రాష్ట్రపతిగా 1967 నుండి 1969 వరకు పనిచేశారు. ఒక విద్యావేత్త, రాజకీయ నాయకుడు, భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుడిగా కూడా గుర్తింపు పొందారు.హుస్సేన్ 1897 ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో అంటే నాటి బ్రిటిష్ ఇండియా నేటి భారతదేశ రాష్ట్రమైన తెలంగాణలో జన్మించారు. ఇతని తండ్రి పఖున్ జాతికి చెందినవాడు.
హైదరాబాదు నుండి ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లా ఖాయమ్ గంజ్ కు వలస వెళ్లారు. హుస్సేన్ ఉత్తరప్రదేశ్లోని ఇస్లామోయ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. ఉన్నత విద్య అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ లోని ఆంగ్లో మహమ్మద్ ఓరియంటల్ కాలేజీలో అభ్యసించాడు. ఆలీ గారు యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకుడుగా ప్రముఖ పాత్ర పోషించాడు ఆ తర్వాత లండన్‌లోని కింగ్స్ కాలేజ్, బెర్లిన్ విశ్వవిద్యాలయం నుండి విద్యను అభ్యసించారు.హుస్సేన్ 1920లో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ స్థాపనలో ముఖ్యపాత్ర పోషించారు. బ్రిటిష్ వారితో పోరాటానికి మహాత్మా గాంధీతో చేతులు కలిపి బేసిక్ విద్యపై కఠోర పరిశ్రమ చేసి భారత దేశంలో విద్యాభిన్నతికి శ్రమించారు ఆ కాలంలో హుస్సేన్ ఉత్తమ దార్శనికుడిగా భారత విద్య మార్గదర్శికుడిగా గుర్తింపు పొందారు.
నాటి కాలంలో తన రాజకీయ ప్రత్యైనా మహమ్మద్ అలీ జిన్నా చేత కూడా అభినందనలు అందుకున్నారంటే జాకీర్ హుస్సేన్ గారి విద్య దేశ స్వతంత్ర పోరాటం దేశ సేవ ఎంత నిజాయితీగా నిర్వహించారు మనకు అర్థం అవుతుంది. తనకున్న సంపద మొత్తము దేశాభివృద్ధికి ధారపోసిన మహోన్నత వ్యక్తి జాకీర్ హుస్సేన్. దేశానికి స్వతంత్రం సిద్ధించిన తర్వాత 1948 నుండి 1956 వరకు అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా కూడా పనిచేశారు. ఆలీగర్ ముస్లిం యూనివర్సిటీ విద్యాభివృద్ధిలో వైస్ ఛాన్సలర్ గా ప్రముఖ పాత్ర వహించి విద్యార్థికి కావాల్సిన అన్ని రకాలైన వసతులనుకల్పించడంతోపాటు వారి విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేశారు. తన వైస్ ఛాన్సలర్ పదవి ముగిసిన తరువాత 1956వ సంవత్సరంలో భారత దేశ పార్లమెంటు సభ్యుడుగా నామినేటెడ్ చేయబడ్డాడు. హుస్సేన్ 1957లో బీహార్ గవర్నర్‌గానియమితు లయ్యారు. 1962లో భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1967లో భారతదేశ మూడవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. హుస్సేన్ ఒక ప్రజాస్వామ్యవాది, మత సామరస్యానికి అత్యంత ప్రాధాన్యతని ఇచ్చిన వారిలో జాకీర్ హుస్సేన్ ప్రముఖులు. హుస్సేన్ 1969 మే 3న న్యూఢల్లీిలో హఠాన్మరణం చెందారు.
జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ స్థాపన విద్యారంగంలో సేవమత సామరస్యానికి కృషి 1963 లో భారత ప్రభుత్వం జాకీర్ హుస్సేన్ గారిని భారతరత్న అవార్డుతో సత్కరించింది. భారతదేశ మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి. రాష్ట్రపతి పదవిలో ఉండగానే మరణించిన మొట్టమొదటి వ్యక్తి జాకీర్ హుస్సేన్.జాకీర్ హుస్సేన్ ఒక గొప్ప విద్యావేత్త, రాజకీయ నాయకుడు, భారతదేశ మూడవ రాష్ట్రపతి. విద్యారంగం, మత సామరస్యానికి ఆయన చేసిన కృషి ఎంతో గొప్పది. ఫిబ్రవరి 8 జాకీర్ హుస్సేన్ గారి జన్మదిన గుర్తు చేసుకుంటూ దేశానికి వారు అందించిన సేవలు మరువరానివి భారతీయులుగా మనం ఏ మతంలో పుట్టిన ఏ కులంలో పుట్టిన ఏ ప్రాంతంలో పుట్టిన దేశ సేవకై మన జీవితాన్ని ధారపోయలనే విషయం జాకీర్ హుస్సేన్ జీవితం ద్వారా మనకు అర్థమవుతుంది. దేశ అభివృద్ధిలో మనందరం సహకరించి. నేటి నాయకులు ప్రజలు. పౌరులు జాకీర్ హుస్సేన్ గారి ఆశయ సాధనలో నడవాలని ఆశిద్దాం.
-పూసపాటి వేదాద్రి,
కవి సాహితీ విశ్లేషకులు
9912197694





