అరెస్ట్‌ను ఖండిరచిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..బిఎస్పీకి రాజీనామా
ప్రవీణ్ వ్యాఖ్యలపై సోషల్ విూడియాలో విమర్శలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి
బిఎస్పీకి రాజీనామా చేసిన అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్
బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీని వీడారు. ఈ మేరకు సోషల్ విూడియా వేదికగా వెల్లడిరచారు. కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందని, పార్టీని వీడటం తప్ప మరో అవకాశం లేకుండాపోయిందని పేర్కొన్నారు. భారాస`బీఎస్పీ పొత్తు ఒప్పందంలో భాగంగా ఆయన నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే అనూహ్యంగా బిఎస్పీని వీడడం సంచలనం కలిగించింది. ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. మా పొత్తు గురించి వార్త బయటకు వచ్చిన వెంటనే భాజపా దాన్ని భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ప్రస్థానాన్ని ఆపలేను.
చివరి వరకు బహుజనవాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటా అని ప్రవీణ్ కుమార్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. తెలంగాణలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇక బీఎస్పీదే అన్నారు. బీఎస్పీకి రాజీనామా చేసిన తరువాత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్.. భారాస అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. తన రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం ప్రకటించే అవకాశముంది.బీఆర్ఎస్`బీఎస్పీ పొత్తులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలలోని నాగర్‌ర్నూల్‌తో పాటు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీఎస్పీ పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ చీఫ్‌గా ప్రవీణకుమార్ ప్రకటించారు. నాగర్‌కర్నూల్ స్థానం నుంచి స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎన్నికలో బరిలో దిగనున్నారని బీఎస్పీ ప్రకటించింది. ఇక హైదరాబాద్ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నదానిపై బీఎస్పీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇలాంటి తరుణంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఎస్పీకి రాజీనామా చేయటం పార్టీకి పెద్ద షాక్ అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.




