సికింద్రాబాద్ బోయిగూడ అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున సీఎం పరిహారం ప్రకటించారు. మృతదేహాలను బీహార్‌కు పంపించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం తెల్లవారుజామున టింబర్ డిపోలో చెలరేగిన మంటలకు మొత్తం 11 మంది మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో కొందరు సజీవదహనం కాగా, మరికొందరు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలకు గాంధీ హాస్పిటల్ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. గాయపడిన వ్యక్తికి కూడా గాంధీ లోనే చికిత్స అందిస్తున్నారు.