సోషల్ వి•డియా పోస్టులపై సిపి ఆగ్రహం
ప్రజాతంత్ర, నిజామాబాద్, మార్చి 22 : జిల్లాలోని బోధన్ పట్టణంలో 144 సెక్షన్ కొనసాగుతున్నది. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేవారకు144 సెక్షన్ కొనసాగనున్నది. సున్నిత ప్రాంతాలలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. వివాదానికి కారణమైన విగ్రహం చుట్టూ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విగ్రహం చుట్టూ ప్రత్యేక పికెట్, బారికేడ్లతో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. విగ్రహానికి 300 వి•టర్ల వరకు పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు. ప్రత్యేక పోలీసు బలగాలతో పహారా కాస్తున్నారు. ఇదిలావుంటే సోషల్ వి•డియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది వ్యక్తులు శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా సామాజిక మాద్యమాలలో పోస్టులు పెడుతున్నారు.
అలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వ్యక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తారన్నారు. ఎవరు కూడా ప్రజలకు రెచ్చగొట్టే పోస్టులు సామాజిక మాద్యమలలో పెట్టకూడదని ఓ ప్రకటనలో సీపీ తెలిపారు. బోధన్ వివాదం నేపథ్యంలో సోషల్ వి•డియా ప్రచారాలపై నిజామాబాద్ కమిషనర్ నాగరాజు వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది వ్యక్తులు శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని తెలిపారు. అటువంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు సీపీ నాగరాజు వి•డియాకు ప్రకటన విడుదల చేశారు.