- కొలియర్స్, ష్యూర్గి సంస్థల నూతన కార్యాలయాల ప్రారంభోత్దవంలో మంత్రి కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : ఐటిలో తెలంగాణకు పోటీ బెంగళూరుతో కాదని.. సింగపూర్, మలేసియా దేశాలతో అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో అద్భుతమైన ఇన్‌ఫ్రాస్టక్చ్ర ఉందని తెలిపారు. హైదరాబాద్ రాయదుర్గంలో కొలియర్స్, ష్యూర్గి సంస్థల నూతన కార్యాలయాలను మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
భాగ్యగనరంలో కొవిడ్ వల్ల హైబ్రిడ్ విధానంలో పనిచేస్తున్నా.. ఫలితాలు మాత్రం ఎక్కడా తగ్గట్లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీ కార్యకలాపాలు హైదరాబాద్‌కే పరిమితం కాదని.. టైర్-2 సిటీలో కూడా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాయదుర్గంలోని మైహోమ్ ట్విట్జాలో కొలియర్స్, ష్యూర్గి సంస్థల కార్యాలయాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు.