Take a fresh look at your lifestyle.

బీజేపీ ప్రతి అడుగు పేద ప్రజలపై పిడుగు…

  • పెద్ద నోట్ల రద్దుతో భారీగా పెరిగిన నల్ల ధనం ..
  • అదొక అట్టర్‌ ‌ప్లాప్‌ ‌షో
  • బీజేపీ చేసేది చారానా…చెప్పేది బారానా
  • కరెన్సీ చలామణి రెట్టింపు అయిందన్న మంత్రి హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 14 : ‘‘బీజేపీ చెప్పేదొకటి, చేసేదొకటి..దీనికి పెద్ద ఉదాహరణ పెద్ద నోట్ల రద్దు. నోట్ల రద్దుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌సోమవారం పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానంతో నిజాలు బయటకు వొచ్చాయని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. మంగళవారం బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో  మంత్రి హరీష్‌ ‌రావు మీడియాతో మాట్లాడుతూ..నోట్ల రద్దు అట్టర్‌ ‌ప్లాప్‌ ‌షో అని కేంద్రం అంగీకరించకనే అంగీకరించింది. బీజేపీ చేసేది చారానా…చెప్పేది బారానా..నోట్ల రద్దు గొప్పది కాదు గనుకే బీజేపీ నేతలు దీనిపై మాట్లాడటం లేదు. మౌనం అంగీకారాన్ని సూచిస్తుందని అన్నారు. నోట్ల రద్దుతో నకిలీ కరెన్సీ తగ్గక పోగా 54 శాతం పెరిగిందని ఆర్‌బిఐ గణాంకాలు చెబుతున్నాయని పేర్కొంటూ నోట్ల రద్దు మొదటి లక్ష్యం దొంగ నోట్లు అరికట్టడం.. ఇది అట్టర్‌ ‌ప్లాప్‌ అయ్యింది. కరెన్సీ చలామణి తగ్గించి డిజిటల్‌ ‌పే మెంట్స్ ‌పెంచడం నోట్ల రద్దు మరో లక్ష్యం..ఇది కూడా అట్టర్‌ ‌ప్లాప్‌ అయింది. కరెన్సీ చలామణి రెట్టింపు అయ్యిందని దుయ్యబట్టారు.

నోట్ల రద్దుకు ముందు కరెన్సీ చలామణి జీడీపీలో 11 శాతం ఉంటే ఇపుడు 13 శాతంకు పెరిగింది…పెద్ద నోట్ల చలామణి నోట్ల రద్దు తర్వాత రెట్టింపు అయ్యింది. 500, 1000 నోట్ల రద్దు అన్నారు..2 వేల నోటు తెచ్చారు…పెద్ద నోట్ల వాడకం పరిమితం చేయాలనుకున్నారు…కానీ విపరీతంగా పెరిగిందని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. సీబీడీటీయే చెప్పింది నల్ల ధనం భారీగా పెరిగిందని…..592 కేసుల్లో 40 వేల కోట్ల నల్లధనం పట్టుకున్నారు. నోట్ల రద్దుతో నల్లధనం ఉండదని లక్ష్యం పెట్టుకుని దాంట్లో కూడా అట్టర్‌ ‌ప్లాప్‌ అయ్యారు. నోట్ల రద్దుతో తీవ్రవాద కార్యకలాపాలు, మాదక ద్రవ్యాల రవాణా తగ్గుతాయని భ్రమింప జేశారు. ఈ మూడో లక్ష్యం కూడా అట్టర్‌ ‌ప్లాప్‌ అయ్యింది..అని మంత్రి తీవ్రంగా విమర్శించారు. ప్రణాళిక లేకుండా ఆలోచన రహితంగా నోట్ల రద్దు చేశారు…దేశ ఆర్థిక వ్యవస్థపై నోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపింది….5 లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది. నోట్లు మార్చుకోవడానికి లైన్లలో నిలబడి 108 మంది మరణించారు.

మరెంతో మంది పరోక్షంగా దెబ్బ తిన్నారు..62 లక్షల మంది ఉపాధి కోల్పోయారు..కొత్త నోట్ల ముద్రణకు 21 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఈ మొత్తంతో ఒక ప్రాజెక్టు పూర్తయి ఉండేది..నోట్ల రద్దుతో 50 రోజుల్లో అంతా బాగుంటుందని పెద్దలు భరోసా ఇచ్చారు….2 వేల రోజులైంది. ఏం మార్పు తెచ్చారు..అని హరీష్‌ ‌రావు ప్రశ్నించారు. బీజేపీ వేసే ప్రతి అడుగు పేద ప్రజలపై పిడుగులా మారింది. నీతి ఆయోగ్‌ ‌నేతి బీర కాయలో నెయ్యి చందంగా మారింది. అప్పులు చేయడం, తప్పులు చేయడం బీజేపీ విధానంగా మారింది. కేంద్రం ప్రతి రోజూ చేస్తున్న అప్పు 4618 కోట్ల రూపాయలు..ఒక కోటి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు మోదీ హయాంలో తెచ్చారు..అని మంత్రి వివరించారు.

రైతుల కోసం తెచ్చిన నల్ల చట్టాలపై క్షమాపణ చెప్పిన ప్రధాని నోట్ల రద్దుపై కూడా క్షమాపణ చెప్పాలి….స్విస్‌ ‌బ్యాంకుల్లో నల్ల ధనం తగ్గక పోగా పెరిగింది..కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు పై తక్షణమే శ్వేత పత్రం ప్రకటించాలి..విదేశీ మారక నిల్వలు, రూపాయి విలువ రోజు రోజుకు తగ్గిపోతున్నాయి..బీజేపీది డొల్ల ప్రచారం.. ప్రజలను భ్రమల్లో ఉంచడం బీజేపీ విధానం…బీజేపీ వాగ్దానాల అమలుపై శ్వేత పత్రం ప్రకటించాలి..అని మంత్రి డిమాండ్‌ ‌చేసారు. అన్నిట్లో దేశాన్ని దిగజార్చిన బీజేపీ మత పిచ్చి పెంచడంలో విజయం సాధించింది. బీజేపీ కో హాఠావో..దేశ్‌ ‌కో బచావో మా నినాదం..ప్రధాని మీద నమ్మకంతో అపుడు పెద్ద నోట్ల రద్దును సమర్థించాము..వారు చెప్పిన లక్ష్యాలను ఆచరణలో చూపలేదు…ప్రజలకు ఎదురైన ఇబ్బందులను ప్రస్తావించి తీరాల్సిందే…అని మంత్రి టి.హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్‌, ‌కృష్ణమోహన్‌ ‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీలు దండే విఠల్‌, ‌దేశపతి శ్రీనివాస్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply