Take a fresh look at your lifestyle.

బిఆర్‌ఎస్‌కు గుర్తింపు ఇవ్వని లోక్‌సభ

బిఎసి నుంచి పేరు తొలగింపు
న్యూదిల్లీ,మార్చి1 : టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి లోక్‌సభ సచివాలయం షాక్‌ ఇచ్చింది. లోకసభ బీఏసీ నుంచే టీఆర్‌ఎస్‌ను తొలగించింది. అలాగే ఇంతవరకు బీఆర్‌ఎస్‌కు గుర్తింపు కూడా ఇవ్వలేకపోయింది. టిఆర్‌ఎస్‌ ‌బిఆర్‌ఎస్‌గా మారినా లోక్‌సభ, రాజ్యసభలు బిఆర్‌ఎస్‌కు ఇంకా గుర్తింపును ఇవ్వలేదు. ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీకి బీఎసీలో సభ్యత్వం లభించనుంది. టీఆర్‌ఎస్‌ ‌తరపున లోకసభ పక్ష నేత నామా నాగేశ్వరరావు బీఏసీ సభ్యుడిగా ఉన్నారు. బీఏసీకి నామాని ఆహ్వానిస్తూ లోక్‌సభ సచివాలయం సమాచారం ఇచ్చింది. మంత్రిత్వ శాఖల వారీగా డిమాండ్స్ ‌ఫర్‌ ‌గ్రాంట్స్ ‌పై చర్చించేందుకు బేఏసీ సమావేశం ఉన్నట్లు లోకసభ సచివాలయం సమాచారం పంపించింది. బీఏసీ సమావేశ సమాచారంలో విషయం బయటపడింది.

బీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం లోకసభలో 9 మంది సభ్యులు ఉన్నారు. దీంతో లోకసభ సచివాలయం ఆహ్వానితుల జాబితాలోకి తీసుకుంది. గత ఏడాది అక్టోబర్‌ 5‌న పార్టీ పేరు మార్పుపై ఈసీకి టీఆర్‌ఎస్‌ ‌లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ ఈసీ ఆమోదం తెలిపింది. అనంతరం గత ఏడాది డిసెంబర్‌ 9‌న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌జెండాను ఆవిష్కరించారు. టీఆర్‌ఎస్‌ ‌కాస్తా బీఆర్‌ఎస్‌గా మారి దాదాపు 3 నెలలు అవుతున్నా కూడా లోక్‌సభ సచివాలయం మాత్రం నేటికీ ఆ పార్టీకి గుర్తింపునివ్వలేదు.

Leave a Reply