బాసర ఐ.టి.ని బతికించుకుందాం!!

‘‘‌రెండేళ్ళ క్రితం బాసరక్యాంపస్‌లో వెల్లువెత్తిన విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసి, విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు మోపిన నాటి ప్రభుత్వ హయంలో ప్రతిపక్షనాయకుడిగా రేవంత్‌ ‌రెడ్డి సాహసం మర్చిపోలేనిది. బాసర క్యాంపస్‌ ‌వెనుక వ్యవసాయ క్షేత్రాలు, ముళ్ళ కంచెలు దాటి బాసర క్యాంపస్‌లో ప్రవేశించేందుకు రేవంత్‌ ‌రెడ్డి తనదైన శైలిలో దూసుకెళ్ళారు.బాసర విద్యార్థుల ఉద్యమానికి అది ఊపిరులూదింది.రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్‌ ‌రెడ్డి సాహసం పై పత్రికలు వార్తలు రాశాయి. బాసరా విద్యార్థుల ప్రతి డిమాండ్‌ ‌ను తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేసిన ఆయనను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు..’’

అక్కడ వీచే గాలి వుంటుంది. కానీ..
పీల్చుకోవటానికి భయం..
అక్కడ పచ్చిక దారులుంటాయి. కానీ..
వాటిపై నడవాలంటే భయం…
అక్కడ వినే వారంటారు..కానీ
మాట్లాడాలంటే భయం.
అది అచ్చంగా భగల్‌ ‌పూర్‌ ‌జైలును తలపిస్తుం
ది.

అప్రకటిత ఆంక్షలతో అడుగడుగున నిఘానేత్రం కింద ఇనుప బూట్ల సవ్వళ్ళ తో ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపిస్తుంది. నాజీ నియంత హిట్లర్‌ ఏర్పాటు చేసిన కాన్‌ ‌సన్‌ ‌ట్రేట్‌ ‌క్యాంప్‌ ‌లాగే కనీస హక్కులు కూడా కానరాని చోటది.
అది కరడు గట్టిన నేరస్తుల నిలయం కాదు. రాష్ట్ర స్థాయి మెరిట్‌ ‌సాధించిన ముక్కుపచ్చలారని విద్యార్థుల విద్యాకేంద్రం.ఏటా లక్షలమంది రాసే ఎస్సెస్సీ పబ్లిక్‌ ‌పరీక్షల్లోంచి ఎంపికైన ఎనిమిది వేల మంది టాపర్‌ ‌విద్యార్థుల జాతీయ స్థాయి సాంకేతిక విద్యనందించే విశ్వ విద్యాలయం.

నిర్మల్‌ ‌జిల్లా ముథోల్‌ ‌లోని బాసర త్రిపుల్‌ ఐ.‌టి.దశాబ్ధాల కాలంగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై కనీస మౌలిక వసతులకోసం ,విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు చేసే ఉద్యమాలను యాజమాన్యం ,పోలీసులు సహకారంతో ఉక్కుపాదం మోపి అణచివేత కు గురిచేస్తున్నారు. క్యాంపస్‌ ‌లో ఏం జరుగుతుందో బయటి వారికి ఎలాంటి సమాచారం లభించదు. తరచూ విద్యార్థుల ఆత్మహత్యలపై ఎలాంటి విచారణలు జరగవు. రెండేళ్ళ క్రితం విద్యార్థులు సాగించిన మడమతిప్పని ఉద్యమం క్యాంపస్‌ ‌గేట్‌ ‌దాటి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.విద్యార్థి,యువజన సంఘాలను రాజకీయ నాయకులను ప్రతిపక్ష నాయకులను కూడా క్యాపస్‌ ‌లోకి రాకుండా పోలీసుల మోహరింపు జరిగింది.

పోలీసుల వలయాన్ని ఛేదించుకొని క్యాంపస్‌ ‌లోకి వెళ్ళే సాహసం చేశారు నాటి కాంగ్రెస్‌ ‌లీడర్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి.నాటి ముఖ్యమంత్రి కే.సి.ఆర్‌. ‌క్యాంపస్‌ ‌సందర్శించాలనే ప్రధాన డిమాండ్‌ ‌తో మరో పన్నెండు డిమాండ్లతో ఎండా వానల కోర్చి నిరవధికంగా చేసిన ఆ ఉద్యమం నాటి ప్రభుత్వం మెడలు వంచింది. ఐదుగురు మంత్రులు, గవర్నర్‌ ‌క్యాంపస్‌ ‌సందర్శించి విద్యార్థుల ఉద్యమాన్ని శాంతింప చేశారు.మంత్రులు గవర్నర్‌ ఇచ్చిన హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి. కానీ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రధాన విద్యార్థి నాయకులపై పలు తప్పడు కేసులు బనాయించి పోలీస్‌ ‌స్టేషన్లు తిప్పారు. ఉద్యమం వీడితే కేసులు ఎత్తేస్తామని వ్యక్తిగత బెదిరింపులకు క్యాంపస్‌ ‌యాజమాన్యం గురిచేసింది. అయినా ఉద్యమం విజయవంతంగా కొనసాగింది.ఇందుకు ప్రధానంగా సహకరించింది వారు ఏర్పాటు చేసుకున్న స్టూడెంట్స్ ‌యూనియన్‌. ‌నిత్యం సమాచార ప్రసారానికి నిర్వహించే సోషల్‌ ‌మీడియా. ఆ ఉద్యమం ఫలితంగా ఎంతోకొంత చిన్నపాటి సమస్యల పరిష్కారం జరిగినట్లే చేశారు కాని తిరిగి అదే ఆంక్షల పర్వం ప్రారంభించారు.

బాగు పడని బాసరా త్రిపుల్‌ ఐ.‌టి.
బాసర త్రిపుల్‌ ఐ.‌టి.ని 2018 నుండి నిధులు, నియమామాకాల విషయంలో నాటి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. విద్యార్థుల మౌలిక సదుపాయాలు సన్నగిల్లాయి. మెస్‌ ‌కాంట్రాక్ట్ ‌పేరు మారినా మనుషులు మారటం లేదు.117 మంది ఫాకల్టీ స్థానంలో పది,పన్నెండు మంది మాత్రమే ఫాకల్టీ వున్నారు. మిగతా ఖాళీలను కూడా కనీసం పార్ట్ ‌టైం వారితోనైనా నింపవచ్చును,కానీ మేనేజ్‌ ‌మెంట్‌ అం‌దుకు సిద్దపడటంలేదు. వసతి, భోజనం ఇతర సౌకర్యాలు కునారిల్లి పోవటం ప్రధాన సమస్యగా మారింది. అడ్మిషన్ల సమయంలో విద్యార్థులకు కల్పిస్తామని తెలిపే అన్ని రకాల సౌకర్యాలను విద్యార్థులకు ఇవ్వకపోవటం పై ప్రశ్నించే వారెవరూలేరు.

ఈ యేడు మరింత పతనావస్థ లోకి..
అంతర్జాతీయ స్థాయిలో దేదివ్యమానంగా వెలుగాల్సిన బాసర త్రిపుల్‌ ఐ.‌టి. నిర్వహణ ఈ సంవత్సరం మరింత దారుణంగా మారింది. పి.యు.సి.రెండవ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులను ఇంజనీరింగ్‌ ‌డిగ్రీ లోకి ప్రమోట్‌ ‌చేయటానికి మూడునెలల ఆలస్యం అవుతుందని ప్రకటించారు.మొదటి సంవత్సరం ఇంజనీరింగ్‌ ‌రెండవ సెమిస్టర్‌ ‌నిర్వహణ ఆలస్యం కావటమే ఇందుకు కారణమని తెలుస్తూంది.బ్రాంచ్‌ ‌లు కేటాయించటంలో ఆలస్యం అవుతుండటంతో పి.యు.సి.రెండవ సంవత్సరం పూర్తయిన దాదాపు 1500మంది విద్యార్థులు తమఇళ్ళకు వెళ్ళిపోయారు.మరో వైపు పి.యు.సి మొదటి సంవత్సరంలో ఈ యేడు దరఖాస్తులసంఖ్య గణనీయంగా పడిపోయింది.ఈ యేడు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు.పి.యు.సి. మొదటి రెండు సంవత్సరాల కోర్సులో నాలుగు సబ్జెక్టులకు ఫాకల్టీ లేరు.

 

విద్యార్థులు యూట్యూబ్‌ ‌లలో సిలబస్‌ ‌చూసి పరీక్షలకు కు ప్రిపేర్‌ అవుతున్నారు. ఇప్పుడున్న పి.యు.సి.రెండు సంవత్సరాల చదువు పూర్తికాగానే ఇంజనీరింగ్‌ ‌డిగ్రీ బాసరలో కొనసాగించేందుకు 50శాతం విద్యార్థులు సిద్దంగా లేరు. పి.యు.సి. రెండు సంవత్సరాలం పూర్తి కాగానే బాసర విడిచి వెళ్ళిపోయే విద్యార్థుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. మిగిలిన సీట్లు నింపేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగటం లేదు. పి.యు.సి. రెండేళ్ళ విద్యార్థులకు నాలుగేసి సబ్జెక్టులకు ఫాకల్టీ లేదు,వున్న ఫాకల్టీ కూడా సరైన అర్హతలు,అనుభవం వున్నవారు కాకపోవటం ఫలితంగానే విద్యార్థులకు సిలబస్‌ అర్ధంకాక పరీక్షలలో ఫెయిలవుతున్నారని విద్యార్థులు అంటున్నారు.సరైన జీతాలు సకాలంలో ఇస్తే అర్హత,అనుభవం గల ఫాకల్టీ వచ్చే అవకాశం వుంటుంది. కానీ మేనేజ్‌ ‌మెంట్‌ అం‌దుకు సిద్దంగా లేదు. త్రిపుల్‌ ఐ.‌టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనసాగితే మరో మూడేళ్ళలో విద్యార్థులు లేకుండా బోసిబోతుంది.

image.png

మళ్ళీ భగ్గుమన్న బాసర క్యాంపస్‌
ఈ ‌యేడు ప్రారంభంలోనే మళ్ళీ బాసర క్యాంపస్‌ ‌లో విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. విశ్వవిద్యాలయం లో పేర్కుపోయిన సమస్యల పై చర్చించేందుకు ఒక విద్యార్థి యూనియన్‌ ఏర్పాటు చేసుకోవాలని జూన్‌ 22‌న స్పెషల్‌ ఆఫీసర్‌ ‌కు వినతి పత్రం ఇచ్చారు. విద్యార్థుల యూనియన్‌ ఏర్పాటును వ్యతిరేకంగా స్పెషల్‌ ఆఫీసర్‌ అనుమతి ఇవ్వటంపై తాత్సారం చేస్తూ వచ్చారు. గత రెండేళ్ళ క్రితం వరకం వున్న స్టూడెంట్స్ ‌గవర్నింగ్‌ ‌కౌన్సిల్‌ ‌విద్యార్థులు సమస్యల పై రిజిస్టార్‌, ‌ఛాన్సలర్‌ ‌లకు ప్రాతినిధ్యాలు చేసేది. దాని స్థానంలో మరో విద్యార్థి యూనియన్‌ ఏర్పాటు కు కావల్సిన యు.జి.సి నియమనిబంధనలు తెలపాలని విద్యార్థులు స్పెషల్‌ ఆఫీసర్‌ ‌ను కోరారు. స్పెషల్‌ ఆఫీసర్‌ ‌స్పందించక పోవటంతో సమాచార చట్టం కింద ఆ నియమనిబంధనలు కోరేందుకు సిద్దమయ్యరు.
సమాచార చట్టం ‘పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌’ ‌బాధ్యతల వహించే పదవిలో ‘అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌’,అసిస్టెంట్‌ ‌పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ ‌బాధ్యతల వహించే పదవిలో రిజిస్టార్‌ ‌లేరు. ఫలితంగా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఐదు లక్ష్యాలు సాధన కోసం ఒక కమిటీ గా తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్‌ అఫ్‌ ‌సాలిడారిటీ (టి.ఎస్‌.ఎ.ఎస్‌.) ఏర్పాటు చేసుకున్నారు.అసోసియేషన్‌ ‌రిజిస్ట్రేషన్‌ ‌నెం.533/2024 పూర్తయింది. ఈ కమిటీని విశ్వవిద్యాలయం స్పెషల్‌ ఆఫీసర్‌ ‌దృష్టి కి తీసుకెళ్ళి గుర్తింపు కోసం డిమాండ్‌ ‌చేశారు.పైగా యూనివర్సిటీ గ్రాంట్స్ ‌కమీషన్‌ ‌క్యాంపస్‌ ‌లో విద్యార్థుల యూనియన్‌ ఏర్పాటు పై నిర్ధేశించిన అన్ని నియమనిబంధనలు పాటించామని పేర్కొటూ అసోసియేషన్‌ ‌స్పెషల్‌ ఆఫీసర్‌ ‌కు లిఖిత పూర్వకంగా తెలిపారు. విద్యార్థులు సాలిడారిటీ కోసం ఒక కమిటీగా ఏర్పడటానికి కూడా అనుమతి ంచని స్పెషల్‌ ఆఫీసర్‌ ‌విద్యార్థుల సంక్షేమం ఎలా కోరుతుందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
చీఫ్‌ ‌సెక్యూరిటీ అధికారా! నియంత హిట్లరా!
252 ఎకరాల విశాలమైన ఐ.ఐ.ఐ.టి బాసరలో చదివే ఎనిమిది వేల మంది విద్యార్థులలో పదహారేళ్ళు దాటని పిల్లలు మూడు వేలమంది,19 ఏళ్ళ వయసు లోపు పిల్లలు మరో ఐదు వేల మంది వుంటారు. సగం మంది అంటే నాలుగు వేల మంది బాలికలుంటారు.ఏటా లక్షలమంది రాసే ఎస్సెస్సీ పబ్లిక్‌ ‌పరీక్షల్లోంచి ఎంపికైన ఎనిమిది వేల మంది చదువుల్లో టాపర్‌ ‌విద్యార్థులు మాత్రమే బాసరలో చేరగలుగుతారు. అలాంటి చదువుల్లో క్రమశిక్షణలో మేటి అయిన విద్యార్థుల సెక్యూరిటీ కోసం ఒక ఆఫీసర్‌ ‌ను ఏర్పాటు చేయటం సంతోషమే. కానీ ఇందుకు స్థానిక పోలీస్‌ ‌సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ ‌కు ఆ బాధ్యతల్లో డిప్యూట్‌ ‌చేయటం, అడుగడుగంన పోలీసుల నిఘా ఏర్పాటు పై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్‌ ‌సి.ఐ. ర్యాంక్‌ అధికారి చేతిలో క్యాంపస్‌ ‌సెక్యూరిటీ అనేది పిల్లలను భయభ్రాంతులను చేయటానికే!అని విద్యార్థుల అభిప్రాయం.క్యాంపస్‌ ‌లో వున్న పోలీస్‌ ఔట్‌ ‌పోస్ట్ ‌శాంతి భద్రతలను కాపాడాల్సింది బదులు ప్రతి విద్యార్థి రకరకాలుగా వేధించే పనులు మాత్రమే చేస్తుందనేది వారి ఫిర్యాదు.అకారణంగా వేధింపులకు గురి చేయటమే కాదు, ఎంతోకొంత ప్రశ్నించే విద్యార్థులను సరిగ్గా పరీక్షల ముందు రోజు సస్పెండ్‌ ‌చేస్తూ ప్రకటన చేయటం, వారిని పరీక్షలు రాయకుండా చేయటం రాక్షసానందం పొందటమేనని,అవి ఉద్దేశపూర్వక వేధింపులే అని విద్యార్థుల ఆరోపణ.క్యాంపస్‌ ‌లో ఇద్దరు కూడి కనిపిస్తే చాలు బెదిరించి క్లాస్‌ ‌తదితర వివరాలు తీసుకోవటం, బయట కనిపిస్తే సస్పెండ్‌ ‌చేయిస్తానని బెదిరింపులు చేయటమే సెక్యూరిటీ సిబ్బందికి తగదని విద్యార్థులం కోరుతున్నారు. విశ్వవిద్యాలయం లో పోలీస్‌ ఔట్‌ ‌పోస్ట్ ఎత్తి వేయాలని వారు డిమాండ్‌ ‌చేస్తూ వినతి పత్రం అందచేయనున్నారు.

image.png
అప్పుడు అరెస్టయిన ప్రతిపక్ష నాయకుడు
నేడు వరాలిచ్చే ముఖ్యమంత్రి..

రెండేళ్ళ క్రితం బాసరక్యాంపస్‌ ‌లో వెల్లువెత్తిన విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసి, విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు మోపిన నాటి ప్రభుత్వ హయంలో ప్రతిపక్షనాయకుడిగా రేవంత్‌ ‌రెడ్డి సాహసం మర్చిపోలేనిది. బాసర క్యాంపస్‌ ‌వెనుక వ్యవసాయ క్షేత్రాలు, ముళ్ళ కంచెలు దాటి బాసర క్యాంపస్‌ ‌లో ప్రవేశించేందుకు రేవంత్‌ ‌రెడ్డి తనదైన శైలిలో దూసుకెళ్ళారు.బాసర విద్యార్థుల ఉద్యమానికి అది ఊపిరులూదింది.రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్‌ ‌రెడ్డి సాహసం పై పత్రికలు వార్తలు రాశాయి. బాసరా విద్యార్థుల ప్రతి డిమాండ్‌ ‌ను తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేసిన ఆయనను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆ నాయకుడే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నారు. బాసర ఐ.ఐ.ఐ.టి.లో దశాబ్ధాల కాలంగా తిష్టా వేసిన సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే సిద్దపడాల్సిన అవసరం ఆయనపై వుంది.

దశాబ్ద కాలంగా ఖాలీగా వున్న 117 రెగ్యులర్‌ ‌పోస్టులు..

దశాబ్ద కాలంగా ఖాలీగా వున్న 117 రెగ్యులర్‌ ‌పోస్టుల భర్తీ ఎందుకు చేయటం లేదు? మెస్‌ ‌కాంట్రాక్టర్ల మార్పు, వైస్‌ ‌ఛాన్సలర్‌ ,‌రిజిస్టార్‌ ‌ల నియమాకం, క్యాంపస్‌ ‌లో పోలీస్‌ ఔట్‌ ‌పోస్ట్ ఎత్తివేత వంటి తక్షణ సమస్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదు? బాసర త్రిపుల్‌ ఐ.‌టి. ఎందుకు వివాదాస్పదంగా మారుతుంది.?రాష్ట్ర ప్రభుత్వం కూడా నియంత్రణ చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది?. సందర్శకులకీ అనుమతులు ఇవ్వలేని పరిస్థితి అక్కడ ఏముంది..? అది ఏమైనా దేశ రక్షణ రహస్యాలు ఉన్న ప్రదేశమా..అన్ని ఆంక్షల మధ్య, నిర్భంధం మధ్య విద్యార్థుల చదువులు సజావుగా ఎట్లా కొనసాగుతాయి?రాష్ట్రంలో ఏ యూనివర్సిటీ లో లేని ప్రత్యేక పరిస్థితులు ఏమున్నాయి? బాసర త్రిపుల్‌ ఐ.‌టి.నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు భారంగా మారుతూంది?.. ప్రభుత్వాలు మారిన అక్కడి పరిస్థితులు మారకపోవడానికి కారణాలేమిటి?రాష్ట్రంలోని విద్యా వేత్తలు, మేధావులు బాసర పై ఎందుకు స్పందించరు.. విద్యార్థులు ఎల్లకాలం ఆందోళన చేయాల్సిందేనా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page