బడ్జెట్‌ అం‌టే బ్రహ్మపదార్థం కాదు

  • నిధుల సమాహారం…వనరుల సమకూర్పు మాత్రమే
  • బడ్జెట్‌ను విమర్శించడం సహజమే
  • వనరుల సమీకరణకే అప్పులు..ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం
  • మనకన్నా 24 రాష్ట్రాల అప్పులు అధికం.. వాటిపై బాధపడాల్సిన అసవరం లేదు
  • ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలను అణిచి వేస్తామనే దుర్మార్గ వైఖరితో కేంద్రం
  • అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్‌

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 15 : బడ్జెట్‌ అనేది నిధుల కూర్పు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌స్పష్టం చేశారు. ఇది ఓ రకంగా వనరుల సమకూర్చుకోవడం తప్ప మరోటి కాదన్నారు. అప్పులు అనేది కూడా ఆస్తులను సమకూర్చడమే అవుతుందన్నారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం కేసీఆర్‌ ‌సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ‌మాట్లాడుతూ…తన ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకున్న సభ్యులకు వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యం పరిణతి చెందే క్రమంలో చట్టసభల్లో జరగవలసిన చర్చల సరళి మరింత అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందన్నారు. యువ నాయకత్వానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సక్రమమైన చర్చలు జరిగితే మంచి ఫలితాలు వొస్తాయన్నారు. బడ్జెట్‌ అం‌టే బ్రహ్మపదార్థం అన్నట్టు, అంకెలు మాత్రమే చెప్తారని అన్నట్టు మన దేశంలో ప్రబలి ఉందన్నారు. పార్లమెంట్‌లో కానీ, వివిధ రాష్ట్రాల్లో  బడ్జెట్‌లో కానీ రెండు విషయాలు గమనిస్తాం. ఆర్థిక మంత్రి బడ్జెట్‌  ‌ప్రవేశపెడుతారు. అద్భుతమై నబడ్జెట్‌ అని అధికార సభ్యులు, పసలేని, పనికిమాలిన బడ్జెట్‌ అని విపక్ష సభ్యులు అంటారు. ఈ అభిప్రాయంలో మార్పు లేదు. సీట్లు మారినా కూడా ఇదే ధోరణి కొనసాగుతుంది. బడ్జెట్‌ అనేది నిధుల కూర్పు. ఈ సమకూర్చబడ్డ నిధులను ఎలా ఉపయోగించాలనేది కూడా ప్రధానం అని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థ కొత్తపుంతలు తొక్కుతోంది. మొట్టమొదటి దేశ బడ్జెట్‌  190 ‌కోట్లు.. దాంట్లో 91 కోట్లు రక్షణ రంగానికే. ఎంఏ పొలిటికల్‌ ‌సైన్స్ ‌చదివేటప్పుడు చెన్నారెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పుడు ఏపీ బడ్జెట్‌  680 ‌కోట్లు. ఇప్పుడేమో లక్షల కోట్లలో మాట్లాడుతున్నామని సీఎం కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. చట్ట సభల్లో ప్రతి విషయంపై చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. బడ్జెట్‌  ‌పై ప్రతిపక్షాలు విమర్శించడం సహజమే నన్నారు. బడ్జెట్‌ అం‌టే అధికారపక్షం ఆహా అంటది..ప్రతిపక్షం పసలేదంటదన్నారు. ప్రభుత్వానికి రెండు అధికారాలు ఉంటాయన్నారు. ఒకటి ట్యాక్స్ ‌విధించే అధికారం..రెండవది అరెస్ట్ ‌చేసే అధికారం అని అన్నారు. అప్పులను అప్పుగా చూడొద్దని.. వనరుల సవి•కరణగా చూడాలన్నారు. అప్పుల్లో మన రాష్ట్రం దేశంలో 25వ స్థానంలో ఉందన్నారు. ఆర్థిక క్రమశిక్షణను కఠినంగా పాటిస్తున్నామన్నారు. మనకంటే ఎక్కువ అప్పులు చేస్తున్న రాష్టాల్రు చాలానే ఉన్నాయన్నారు. మన అప్పుల శాతం 23 శాతమేనన్నారు. అప్పులపై భట్టికి ఆందోళన అవసరం లేదన్నారు. ప్రస్తుతం భారత దేశ అప్పు152 లక్షల కోట్లు అని అన్నారు. అవినీతిని పూర్తిగా నిర్మూలించామన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుంద న్నారు. పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రాల ఉనికి లేకుండా చేస్తాం..రాష్ట్రాలను అణిచివేస్తామనే దుర్మార్గ వైఖరితో కేంద్రం ఉందన్నారు. కేంద్రం ఇష్టమున్నట్లు నిధుల సవి•కరణ చేసుకుంటుందన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే నీతినే కేంద్రం పాటించాలన్నారు. కేంద్రం ఫర్ఫామెన్స్ ‌సరిగ్గా లేదని..మనకంటే బ్యాడ్‌గా ఉందన్నారు. నిధుల సవి•కరణపై కేంద్రం ఆంక్షలు పెడుతుందన్నారు. కేంద్రం తీరు ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధమన్నారు. రాష్ట్రం అప్పులపై రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదని కెసిఆర్‌ అన్నారు. బడ్జెట్‌ ‌రెండు రకాలుగా ఉంటుంది. ఒక గవర్నమెంట్‌ ‌బడ్జెట్‌ .ఒక ప్రైవేటు ఫ్యామిలీ బడ్జెట్‌ . ఈ ‌రెండింటి మధ్య తేడా ఉంటుంది. ప్రైవేటు బడ్జెట్‌ ‌వాళ్ల బ్యాంకు బ్యాలెన్స్, ‌సంవత్సరం వొచ్చే మొత్తం వి•ద కలిపి వొచ్చే ఆదాయంపై ఆధారపడి ప్లానింగ్‌ ఉం‌టుంది. గర్నమెంట్‌ ‌విషయంలో మొదటిసారి ప్లాన్‌ ‌ప్రిపేర్‌ అవుతుంది. ఆ నిధుల కూర్పు జరుగుతుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉండే వైటల్‌ ‌పవర్‌ ‌రెండే రెండు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎవరిపైనా పన్ను విధించొచ్చు. టాక్స్ ఎక్కువైందా ? తక్కువైందా ప్రజాకోర్టులో ప్రజలకు నచ్చకపోతే తీర్పు చెబుతారు. ప్రజాస్వామ్యంలో ఉండే గొప్పదనమే అది. రాజ్యాంగం ప్రకారం.. కొన్ని పన్నులు రాష్ట్రాలు..కొన్ని కేంద్రం వసూలు చేస్తాయి. కేంద్రం వసూలు చేసిన రాష్ట్రాల వాటా. ఫైనాన్స్ ‌కమిషన్‌ ‌గ్రాంట్స్ ‌పోను పన్నేతర ఇంకో వెసులుబాటు మార్కెట్‌ ‌బారోయింగ్‌. ఇవన్ని కలిపి సమాహారం బడ్జెట్‌ అన్నారు. కఠోరమైన శ్రమశిక్షణను పాటిస్తున్నాం. అవినీతిని అణచివేశాం. గతంలో ఎన్నడూ లేనటువంటి పారదర్శకతను ప్రవేశపెట్టాం. రైతుబంధు కింద రూ.50 వేలకోట్లు ఇచ్చాం. ఆ రోజుల్లో మిమ్మల్ని లక్ష్మీపుత్రుడని అనే వాన్ని. వి•రు వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే పథకాన్ని ప్రారంభించాం. వందశాతం పారదర్శకత. ఎక్కడా పైరవీలు లేవు..మధ్య దలారులు లేరు. ఇలా అనేక విషయాల్లో డైరెక్ట్ ‌బెనిఫిట్‌ ‌ట్రాన్స్‌ఫర్‌ ఏదైనా ఉందో దాంట్లో పారదర్శకత పెంచాం. అనేక సంస్కారవంతమైన ఆర్థిక క్రమశిక్షణను కఠినంగా పాటించడం మూలన దేశంలోని 28 రాష్ట్రాలు అప్పులు చేసే క్రమంలో మనం 25వ ర్యాంకులో ఉన్నాం. మన కన్నా 24 రాష్ట్రాలు  మనకన్నా  చాలా అప్పులు ఎక్కువ చేశాయి. కాంగ్రెస్‌ ‌పాలించే రాజస్థాన్‌, ‌పంజాబ్‌లో ఎక్కువగానే ఉన్నది. ఇతర రాష్టాల్రు  ఇక సరేసరి. 25వ స్థానంలో ఉన్నామంటే చాలా తక్కువ అప్పులు చేస్తున్నామని అర్థం. అప్పుల వల్ల మనకు వొచ్చే ప్రమాదం ఏవి• లేదు. దీనిపై భట్టి విక్రమార్క రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు

జివో 111 అర్థరహితం.. ఎత్తేస్తాం : అసెంబ్లీలో సిఎం కెసిఆర్‌ ‌‌‌‌ప్రకటన  

జంటనగరాల తాగునీటి కోసం తీసుకొచ్చిన 111 జీవోపై అసెంబ్లీలో సిఎం కేసీఆర్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. 111 జీవో అర్ధ రహితం..ఈ జీవోను ఎత్తేస్తామని పేర్కొన్నారు. ఈ అంశంపై సిఎం మాట్లాడుతూ…‘హైదరాబాద్‌, ‌సికింద్రాబాద్‌ ‌ప్రజల తాగునీటి సమస్య తీర్చడం కోసం ఈ జీవో విడుదల చేశారు. ఈ జీవో కింద లక్షా 32 వేల 600 ఎకరాల స్థలముంది. ఉస్మాన్‌ ‌సాగర్‌, ‌హిమాయత్‌ ‌సాగర్‌ ‌లేక్‌లు కలుషితం కాకుండా అప్పట్లో ఈ జీవో పెట్టారు. ఇప్పుడు అసలు ఆ నీళ్లే వాడటం లేదు. మరో 100 సంవత్సరాల వరకు హైదరాబాద్‌కు తాగునీటి సమస్య రాదు. ఎక్స్‌పర్ట్ ‌కమిటీ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నాం. ఆ రిపోర్టు రాగానే గ్రీన్‌ ‌జోన్‌, ‌మాస్టర్‌ ‌ప్లాన్‌ అమలు చేస్తూ 111 జీవోను ఎత్తివేస్తాం’ అని సీఎం ప్రకటించారు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నపై సిఎం కెసిఆర్‌ ఈ ‌సమాధానం ఇచ్చారు.

తిరిగి విధుల్లోకి సెర్ఫ్ ఉద్యోగులు…

రాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ఫ్, ‌మెప్మా ఉద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభవార్త చెప్పారు. ‘సెర్ఫ్‌లో 4,500 మంది పని చేస్తున్నారు. సెర్ఫ్ ‌సొసైటీ.. ప్రభుత్వ ఉద్యోగులు కాదు. అయినప్పటికీ మహిళా సంఘాలను చైతన్యం చేసేందుకు, ఆర్గనైజింగ్‌ ‌కెపాసిటీ పెంచేందుకు విశేష కృషి చేస్తున్నారు. మంచి ఫలితాలు వొస్తున్నాయి. సర్ఫ్ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తాం. ఫీల్డ్ అసిస్టెంట్స్ అని చెప్పి ఉపాధిహావి•లో పని చేస్తారు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ఓ భ్రమలో సమ్మెకు వెళ్లారు. సమ్మె వద్దని పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి, సంబంధిత శాఖ అధికారులు చెప్పినా వినకుండా వెళ్లారు. ఇప్పుడు తప్పయిందని అక్కడికి ఇక్కడి తిరుగుతున్నరు. వాళ్లపై మాకేం కోపం లేదు. ఆ అవసరం లేదు. వారికి పెద్దన్నలా హెచ్చరిస్తున్నా.. ఇకపై పొరపాట్లు పునరావృతం చేయొద్దు. మానవతా దృక్పథంతో తీసుకుంటాం. మళ్లీ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటాం. వాళ్లు పొరపాటు చేశారు.. పెద్ద మనసుతో వాళ్లను క్షమించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఇకపై మళ్లీ ఆ తప్పు చేయమని చెప్పారు. అందరి మాటనే నా మాట..వారందరిని విధుల్లోకి తిరిగి తీసుకుంటాం’ అని సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించారు. ఆ తర్వాత మెప్మా ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని అన్నారు. వాళ్లను సైతం పరిగణలోకి తీసుకుంటామన్నారు. పంచాయతీరాజ్‌, ‌మున్సిపల్‌ ‌శాఖల మంత్రులు ఆర్థిక మంత్రితో కలిసి లెక్కలు తేల్చి, అందరికీ న్యాయం చేస్తామన్నారు.

దళితబంధుతో 40 వేల కుటుంబాలకు లబ్ది : సిఎం కెసిఆర్‌

‌మార్చి 31 నాటికి 40 వేల కుటుంబాలకు దళిలబంధు అందిస్తామని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. ఇప్పటినుంచి సంవత్సరానికి రెండు లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వబోతున్నట్లు కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దళితులను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బ్యాంకు నుంచి నేరుగా లబ్దిదారుని ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గాల్లో ఈ పథకం విజయవంతమయ్యేలా చూడాలని కోరారు. దళితులందరి కోసం ‘దళిత రక్షణ నిధి’ పేరుతో 4 వేల కోట్లు కేటాయించామన్నారు. దీంతో భవిష్యత్‌లో వారి సమస్యలను తీర్చే ఏర్పాట్లు చేస్తామన్నారు.

ఉక్రెయిన్‌ ‌విడిచి వొచ్చిన వైద్య విద్యార్థుల చదువులు ఇక్కడ పూర్తయ్యేలా చూస్తాం

ఉక్రెయిన్‌ ‌రిటర్న్ ‌విద్యార్థులపై తెలంగాణ సర్కార్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రాంతం నుంచి ఉక్రెయిన్‌కు 700 మందికి పైగా విద్యార్థులు వెళ్లారని.. అందరూ డాక్టర్లు అవ్వాలనే ఉద్దేశంతోనే ఆ దేశానికి వెళ్లారని.. ఇక్కడ వసతి లేదు కాబట్టి ఆ దేశం పోయారని సిఎం కెసిఆర్‌ ‌గుర్తుచేశారు. ఇక, కింద వి•ద పడి టికెట్లు మనమే పెట్టి పిల్లల్ని ఇంటికి చేర్చామన్న కేసీఆర్‌..‌పిల్లల చదువులకు ఎంత ఖర్చు అయినా తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నామని అసెంబ్లీ వేదికగా వెల్లడించిన కేసీఆర్‌..ఉ‌క్రెయిన్‌లో మెడిసిన్‌ ‌చదువుతున్న వారి ఖర్చు భరించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చదువు పూర్తి అయ్యేందుకు వారికి సహకరిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page