మేడ్చల్ ప్రజాతంత్ర ఆగస్ట్ 24 : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్ ఇండియా బంజారా సంఘం అధ్యక్షులుగా ఎంపికై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నానావత్ రెడ్యా నాయక్ ను, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకురా మల్లారెడ్డి, గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నివాసంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ పథకాలు నిజమైన గిరిజన పేదలకు అందేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి, పోచారం మున్సిపాలిటీ చైర్మన్ కొండల్ రెడ్డి, కార్పొరేటర్ సుమన్ నాయక్, సుభాష్ నాయక్, ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ శంకర్ నాయక్, డిఎస్ నాయక్, సోమ్లా నాయక్, రవి నాయక్, రాము నాయక్, కాశీ రామ్ నాయక్, శక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.