లేదంటే ‘సుప్రీమ్’ను ఆశ్రయిస్తాం:
బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్22: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసన సభాపతి నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. అనర్హత పిటిషన్ల విషయమై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ తీర్పుపై ఆయన స్పందించారు. మొన్నటి వరకు సభాపతిని ఆదేశించే అధికారం కోర్టుకు లేదని వాదించారని కేటీఆర్ గుర్తు చేశారు. రీజనబుల్ పీరియడ్‌లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సీజే స్పష్టం చేశారని, రీజనబుల్ పీరియడ్ అంటే మూడు నెలలు అని మణిపుర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.