రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 26 : ఫార్మా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రత కోసం షీ షటిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.లాల్‌గాడి మలక్‌పేట్‌లోని జినోమ్ వ్యాలీ, ఫార్మా లైఫ్ సైన్సెస్ నుంచి అల్వాల్ వరకు ఎస్‌సీఎస్‌సీ అందుబాటులోకి తీసుకొచ్చిన 3వ షీ షటిల్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో నడిచే భద్రత వ్యవస్థలో మహిళా ఉద్యోగులు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు.
మహిళల భద్రత కోసం అల్వాల్ నుంచి లాల్‌గడీ మలక్‌పేట్, తుర్కపల్లి నుంచి జనోమ్ వ్యాలీ వరకు నడుస్తుందన్నారు. ఎస్‌సీఎస్‌సీ కార్యదర్శి కృష్ణ ఏదుల మాట్లాడుతూ… ఐటీ, ఫార్మా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల కోసం ఇప్పటి వరకు 12 షీ షటిల్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.