భద్రాచలం, ఏప్రిల్ 11(ప్రజాతంత్ర ప్రతినిధి) : గవర్నర్ జిల్లా పర్యటనకు హెలీక్యాప్టర్ లేకపోవడం చర్చనీయ అంశం అవ్వగా ప్రొటోకాల్ ప్రకారం కలెక్టర్, ఎస్పీ హాజరై స్వాగతం పలకాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కూ మధ్య దూరం పెరుగుతూనే ఉంది. గవర్నర్ భద్రాచలం శ్రీరామపట్టాభిషేకానికి హాజరైన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులైన కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ఎస్పీ సునీల్ దత్, ఐటిడిఏ పిఓ గౌతమ్ పొట్రూ పర్యటన ఆద్యంతం కనిపించలేదు. ప్రతీ సంవత్సరం మహాపట్టాభిషేకానికి గవర్నర్ రావడం ఆనావాయితీ కాగా ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక హెలీక్యాఫ్టర్ ద్వారా రావడం, తిరిగి కార్యక్రమం పూర్తైన తరువాత హెలీక్యాఫ్టర్‌లో తిరిగి వెళ్ళటం, వంటి వాటితో సహా పూర్తిగా ప్రభుత్వ అధికారుల కనుసందళ్ళో కార్యక్రమం జరుగుతూ వొస్తుండేది.
గత కొంతకాలంగా గవర్నర్ వ్యవస్థకు, ప్రభుతానికి మధ్య విభేదాల కారణంగా గతంలో ఆమె పర్యటించిన మేడారం జాతరకు మరియు యాదాద్రి ఆలయ పర్యటనకు అధికారులు గైర్హాజరైనట్లే రాముని మహాపట్టాభిషేకం విషయంలోనూ అదే కొనసాగింది. సాధారణ వ్యక్తిగానే రైలు మార్గం ద్వారా ఆమె రావడం ద్వారా ప్రభుత్వ సహాయ సహకారాలు అందటం లేదని స్పష్టంగా తెలుస్తుంది. భద్రాచలం పట్టాభిషేక కార్యక్రమం తరువాత వనవాసి కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన మహిళల సీమంత వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గిరిజనుల కార్యక్రమం అయినా స్థానిక పిఓ ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. గవర్నర్ పర్యటన సందర్భంగా ప్రభుత్వం కల్పించవలసిన ప్రొటోకాల్ మొత్తం కింది స్థాయి సిబ్బందితో తూతూ మంత్రంగా కార్యక్రమాన్ని ముగించేసారు.
రామయ్య సాక్షిగా రాజ్ భవన్‌కు అవమానం
రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అగాథం రోజు రోజుకు పెరుగుతుందనే చెప్పాలి. గవర్నర్ భదాద్రి జిల్లా పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన తీరు అగ్నికి ఆజ్యం పోసినట్లు కనిపిస్తుంది. శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ నుండి రైలు మార్గాన సోమవారం తెల్లవారు ఝామున (భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్) కొత్తగూడెం చేరుకున్న గవర్నర్ తమిళిసై దంపతులకు స్వాగతం పలికేందుకు ఏ ఒక్క జిల్లా ఉన్నతాధికారి సైతం అందుబాటులో లేకపోవడం సీఎం కేసీఆర్ ముందస్తు వ్యూహంగానే కనిపిస్తుంది. కొత్తగూడెం చేరుకున్న గవర్నర్ తమిళిసైకి జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు, ఆర్డివో స్వర్ణలత స్వాగతం పలికారు. గవర్నర్‌కు తెలంగాణ సర్కార్ ప్రొటోకాల్ పాటించడం లేదంటూ ఇటీవల దిల్లీ పెద్దలు, జాతీయ మీడియా ఎదుట స్వయంగా తమిళిసై బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. ![]() ఇదిలా ఉండగా మంత్రి కేటిఆర్ ఇటీవల జరిగిన సమావేశంలో మాట్లాడుతూ…తమ ప్రభుత్వం గవర్నర్‌కు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తున్నామని తెలిపారు. గవర్నర్ ఊహించుకుని మాట్లాడుతున్నారని, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. అయితే తాజా ఘటనతో గవర్నర్‌కు, స్టేట్ గవర్నమెంట్‌కు విభేదాలు ఇస్తాయిలో ఉన్నాయో అవగతం అవుతుంది.
|
|