Take a fresh look at your lifestyle.

ప్రశ్నాపత్రం లీకయ్యిందంటే ఉద్యోగాలు అమ్ముకోవడమే..

  • టిఎస్‌పిఎస్‌సిలో అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలి
  • ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌మద్దతు

ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి14 : మంగళవారం చిక్కడిపల్లిలో నిరుద్యోగులు చేస్తున్న ధర్నాకు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా  ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌మాట్లాడుతూ…నిరుద్యోగులు అందరు ఒక్కతాటి పైకి వొచ్చి ప్రభుత్వం సమాధానం చెప్పేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంతకు ముందు నిర్వహించిన పరీక్షల పరిస్థితి కూడా ఇదే తతంగం ఉండొచ్చని , నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని అన్నారు. నిరుద్యోగులు పరీక్షలు రాద్దామనుకుంటే ప్రశ్నాపత్రం ముందే లీక్‌ అయ్యిందంటే దీని వెనుకాల ఉన్న అస్సలు దోషులను తేల్చాలని, సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ఇమాండ్‌ ‌చేశారు. నిరుద్యోగులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని అద్దె రూమ్‌ ‌లలో ఉంటూ కోచింగ్‌లు తీసుకొని ప్రిపేర్‌ అవుతున్నారు..ప్రభుత్వం మాత్రం నిరుద్యోగులకు భరోసా ఇవ్వకుండా వ్యవహిరిస్తుంది…రాష్ట్రంలో కొన్ని నోటిఫికేషన్‌ ‌లు వేశారు…వాటి పరిస్థితి ఏందీ అనేది ప్రభుత్వం తేల్చాలి, పరీక్షల తేదీలు మొత్తం రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్‌లు వేయాలని కోదండరామ్‌ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం వొస్తే నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని అప్పుడు తాము కొట్లాడితే ఇప్పుడు కేసీఅర్‌ ‌ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఆందోళనకు గురి కావద్దని, వారికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని అన్నారు. టిఎస్‌పిఎస్‌సి ఇంతకు ముందు నిర్వహించిన పరీక్షలపై కూడా అనుమానాలు ఉన్నాయని, వాస్తవాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్‌ ‌జేశారు. అస్సలు దోషులు ఎవరు అనేది తేలాలనీ..

నిరుద్యోగులు ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో చదువుకుంటే ఉద్యోగాలు అమ్ముకోవడం ఎందని మండిపడ్డారు. నిరుద్యోగులు నోటిఫికేషన్‌లు రాక ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ పేపర్‌ ‌లీక్‌తో ఇంక ఆత్మస్థైర్యం కోల్పోయే ప్రమాదం ఉందని కోదండరామ్‌ ఆమేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌ ‌దగ్గర ఉండాల్సిన పాస్‌వర్డ్ ‌సాధారణ ఉద్యోగి దగ్గర ఉందంటే దీని వెనుకాల ఎవరు ఉన్నారు అనేది తేలాలని అన్నారు.  ప్రభుత్వం దిగి రాకపోతే రాబోయే రోజుల్లో లక్షలాది నిరుద్యోగులతో ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నిజ్జన రమేష్‌ ‌ముదిరాజ్‌, ‌మొగుడంపల్లి ఆశప్ప, అనిల్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply