ప్రలోభాల వలలో చిక్కొద్దు

‘‘ఈనాడు పరిస్థితి చూస్తుంటే ఆరు నెలలకు ఓసారి ఒక ఎమ్మెల్యేను లేదా ఒక ఎంపీని రాజీనామా చేయిస్తూ ప్రజలదృష్టిని మల్లించే నాటకం మొదలు పెడుతున్నాయి. ఈ ప్రభుత్వాలు సమస్యలెన్నో కోకోలలుగా ఉన్న వాటన్నిటిని మరిపించేందుకు అర్థాంతరంగా ఉపఎన్నికలు అంటూ ప్రజల విలువైన కాలాన్ని శ్రమను దోచుకుంటూ, ప్రజా ధనాన్ని వృధచేస్తున్నాయి.’’

ఈనాడు ప్రభుత్వాల పనితీరు చూస్తుంటే ప్రజలను పరిపాలించడంలో కంటే వారి సంపాదనకు మార్గాలు వెతుక్కుంటూ  ఆలోచన లేకుండా అసలు సమస్యలను పక్కదో పట్టించేందుకు రాజకీయాలను ముందుకు తీసుకొస్తూ నీచమైన రాజకీయాలను  చేస్తున్నాయి. ఎంతకైన తెగిస్తూ పరిపాలనంతా దోపిడీలతో, పెత్తందారితనంతో, నియంతృత్వ పోకడలతో  ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా పరిపాలనను కొనసాగిస్తున్నాయి. ఈనాడు పరిస్థితి చూస్తుంటే  ఆరు నెలలకు ఓసారి ఒక ఎమ్మెల్యేను లేదా ఒక ఎంపీని రాజీనామా చేయిస్తూ ప్రజలదృష్టిని మల్లించే నాటకం మొదలు పెడుతున్నాయి. ఈ ప్రభుత్వాలు  సమస్యలెన్నో కోకోలలుగా ఉన్న వాటన్నిటిని మరిపించేందుకు అర్థాంతరంగా ఉపఎన్నికలు అంటూ ప్రజల విలువైన కాలాన్ని శ్రమను దోచుకుంటూ, ప్రజా ధనాన్ని  వృధచేస్తున్నాయి.
ఈ ఉపఎన్నికల కోసం చేసే ఖర్చు ఎన్నో విధాలైన సంక్షేమ కార్యక్రమాలకు , పెండింగ్‌ ‌నిర్మాణం పనుల కోసం, బలహీనుల అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే ప్రజల జీవితాలు బాగుపడతాయి. నేడు వచ్చిన మునుగోడు ఎలక్షన్‌ ఎం‌త దుర్మార్గంగా ఉన్నాయంటే  పాలకులు, రాష్ట్రాల మంత్రులు మాత్రమే కాకుండాఅందరూ మకాం మార్చరంటే డబ్బున్నోడే నాయకుడన్నంతగా మారిపోయింది. నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా, మద్యం ఏరులై పారుతుంది.   ప్రతిపక్ష పార్టీలు సైతం అధికారాన్ని పొందడం కోసం డబ్బును గుమ్మరిస్తున్నాయి. అనేక సమస్యలు ఉన్నాయి, అయినా వాటన్నిటిని పక్కనపెట్టి అందరి దృష్టి మునుగోడు ఎన్నికల వైపు దృష్టిసారిస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ కళ్ళు తెరిచి ఇలాంటి కుళ్ళు రాజకీయాలకు సమాధి కట్టాల్సిన పరిస్థితి దాపురించింది. నిజంగా ప్రజలు గొర్రెల్లా కాకుండా తమ బుర్రలకు పనిచెప్పి, తమ జ్ఞానాన్ని విచక్షణనతో ఈనాటి రాజకీయ నాయకులకు తగిన గుణపాఠం నేర్పాల్సిన తరుణం ఆసన్నమైంది. నేడు మునుగోడు నియోజకవర్గంలో పాలకవర్గ సభ్యులు ప్రతిపక్ష సభ్యులు వివిధ పార్టీల నాయకులు డబ్బును మందును ఉచితంగా వెదజల్లుతన్నారంటే, ఆ డబ్బులెవరివి? అక్కడున్న ప్రజలందరి ఓటుకు నోట్లోని వెదజల్లుతున్నాయి. ఈమధ్య అనేక వాగ్దానాలను గుమ్మరిస్తున్నాయి మునుగోడును అమెరికా చేస్తామంటున్నారు కొందరైతే. మరికొందరు పోటీపడుతూ నోట్ల కట్టలను ఇంట్లోకి విసిరి వేస్తున్నారు. రాజకీయమంటే నేడు మనుషులపైకి మందును, డబ్బును, బంగారాన్ని, కానుకలను, అతి ఖరీదైన కానుకలను ఇస్తూ ప్రజలను అనేక ‘ప్రలోభాలకు’ గురి చేస్తున్నారు.
వారికి ఆలోచించుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా నిత్యం డబ్బుతో మద్యం సీసాలతో నిదురపుచ్చుతున్నారు. ఎందుకు ఇంత నీచంగా దిగజారుడుతనంతో అధికారం పై వ్యామోహంతో ఎన్నో పాట్లు పడుతూ ప్రజల సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నారు  ఈ మద్యంతర ఉప ఎన్నికల కోసం ఎవరినో ఒకరిని రాజీనామా చేయించడం రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించకుండా, చేయాల్సిన పనులు చేయకుండా అనేక పనులు ఎలక్షన్‌ ‌కోడ్‌ ‌తో ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈ ఉపఎన్నికలనేవి నేడు ఆనవాయితీగా మారిపోయాయి. అభివృద్ధికి ఆటంకంగా మారాయి. ప్రజల ఆలోచన దిగజారుడుతనానికి ఇది బాట వేస్తుంది. నాయకులెప్పుడు ఏం మాట్లాడినా నేడు ఏం చేస్తున్నా ఎన్ని ఉచిత పథకాలు ప్రకటించిన ఎంత రైతుబంధు ప్రకటించిన ఎన్ని ఆసరా పింఛన్లు ఇచ్చినా, ఎన్ని కల్యాణ లక్ష్మి పథకాలు ఇచ్చిన ఇవన్నీ భవిష్యత్‌ ‌తరాల తలపైకి అప్పుగా వస్తుందే తప్ప, బాగుపడింది ఎవ్వడు లేడు. ఇక్కడ ఒక్క రాజకీయ నాయకుడు తప్ప.  రైతుబంధు పథకంలో ఎన్ని లొసుగుల, దానికంటూ నియమాలు గాని, నిబంధనలు గాని, ఏమీ లేకుండా ‘ఎవరైనా భూమి ఉంటే చాలు’ వాళ్ళందరూ రైతులే వాళ్ళందరికీ రైతుబంధు ఇక్కడ. అర్థమవుతున్నది ఏమిటంటే భూమి ఉన్నది ఎవరికి? పేదవాడికి ఒకటి లేదా, రెండు లేదా, మరీ ఎక్కువ అంటే 5 ఎకరాలు మాత్రమే ఉంటుంది. మరి మన ఉన్నత వర్గాల ప్రజలకు ఒక్కొక్కరి గుప్పిట్లో వందల, వేల ఎకరాలు ఉంటాయి. మరి వీరందరూ పేదవ రైతులా, వీరందరికీ రైతుబంధు అవసరమా?! నిజానికి రైతులపై ప్రేమ ఉంటే, ఒక ఐదు ఎకరాలు వరకు మాత్రమే రైతుబంధు ఇవ్వాలి. అంతేకానీ సంపూన్న వర్గాలకు దోచిపెట్టె పథకమే రైతుబంధు పథకం. ఇది పేదవాడికి  అర్థం కాదు. స్వేచ్ఛగా దోచుకునే పతకమే రైతుబంధు పథకం. కాబట్టి ఆశపడినంత కాలం రాష్ట్రం ‘అప్పుల ఊబిలోని’ మునిగి ఉంటుంది తప్ప, అభివృద్ధికి ఏమాత్రం నోచుకోకుండా, పైన పటారం లోన లొటారం అన్నట్టుగా, దీనంగా తయారవుతుంది.
నేడు రాష్ట్రంలో నిరుద్యోగం ఒక పెద్ద సమస్య, అదిగో ఉద్యోగాలు ఇదిగో ఉద్యోగాలు అంటూ, కాలయాపన చేస్తూ, ఎన్నికలు దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు మాత్రమే ‘నోటిఫికేషన్‌ ‘  ‌జారీ చేసి, పరీక్షల నిర్వహణ చేసి, ఫలితాలను ప్రకటించకుండా ఉంచి, తిరిగి మళ్లీ మేము అధికారంలోకి వస్తే వెంటనే ఉద్యోగాలు అని మోసం చేస్తూ కాలం గడుపుతూ అధికారాన్ని నిలుపుకుంటున్న వైనం. ఉన్న ఉద్యోగులకు ఏమి చేయకుండా కనీసం వారికి రావలసిన డి. ఏ ను కూడా ఇవ్వకుండా ఏమాత్రం పట్టింపు లేకుండా వారి హక్కులనన్నింటినీ కాలరాస్తూ ఏదో ఒక సాకు చూపుతూ, సరైనటువంటి ప్రమోషన్స్ ‌లేకుండా రిటైర్డ్ ‌కావలసిన పరిస్థితి నేడుంది. ఇలాంటి నీచ పరిస్థితి ఉద్యోగులది. విద్య, వైద్యం ప్రజలందరికీ సమకూర్చాల్సిన ప్రభుత్వం అన్నింటినీ ప్రైవేట్‌ ‌పరం చేస్తూ సామాన్యులకు విద్య వైద్య సౌకర్యాలను ఆమడ దూరం చేస్తున్నది. స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన ఇంకా బడి గోడలు కూలిపోతూనే ఉన్నాయి వైద్యాలయాలు రోగం వచ్చిన రోగిలా సరైన సౌకర్యాలు లేక అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఎంతకాలం ఇలా? బహుజనులందరు ఏకమైతేగానీ భారతదేశం అభివృద్ధి చెందదు. ఎందుకంటే పదిశాతం జనం తొంబైశాతం ఉన్న జనాన్ని పాలించడమే. వారికి కావలసింది వారి అభివృద్ది మాత్రమే అన్నది గ్రహించలేని హీనస్థితినుండి బయటపడాలి. ఓటు అనే వజ్రాయుధాన్ని విచక్షణ కలిగి ప్రలోభాలకు లొంగకుండా ఉపయేగిస్తేనే మార్పు సాధ్యమౌతుంది.
image.png
సి. శేఖర్‌(‌సియస్సార్‌),
‌పాలమూరు,9010480557.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *