‌ప్రమాదంలో ఫెడరలిజం…

  • యూపిఎపై నిందలు మోపి అధికారంలోకి బిజెపి
  • కానీ నాటికన్నా దిగజారిన ఆర్థికాభివృద్ధి
  • కొరోనాతో వొచ్చిన ఆర్థిక దివాలా కానేకాదు
  • డబుల్‌ ఇం‌జిన్‌ ‌ప్రభుత్వం పేరుతో మోసం
  • తెలంగాణ కన్నా అధ్వాన్నంగా యూపి పురోగతి
  • హిజాబు లాంటి వివాదాలతో పెట్టుబడులు వొస్తాయా
  • మత చిచ్చులపై యువత అప్రమత్తం కావాలి
  • అసెంబ్లీ వేదికగా కేంద్రం తీరును తూర్పారా పట్టిన కెసిఆర్‌

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 15 : యూపీఏ వి•ద నిందలు మోపి బీజేపీ ప్రభుత్వంలోకి వొచ్చిందని, బిజెపి తీరుతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని సిఎం కెసిఆర్‌ అసెంబ్లీ వేదికగా మారోమారు ధ్వజమెత్తారు. తెలంగాణతో పోలిస్తే దేశ జిడిపి రేటు అతి తక్కువగా ఉందన్నారు. కొరోనా వల్ల వొచ్చిన ప్రమాదం కాదన్నారు. బీజేపీని నమ్మి వోటేసినందుకు ప్రజల పరిస్థితి అన్న వస్త్రానికి పోతే..ఉన్న వస్త్రం పోయినట్లుగా మారింది. దేశ ఆర్థిక పరిస్థితి పడిపోవడానికి కొరోనా కారణం కాదు. ఎప్పటినుంచో దేశ ఆర్థిక పరిస్థితి పడిపోయిందన్నారు. ఇక డబుల్‌ ఇం‌జిన్‌ అం‌టూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపైనా కెసిఆర్‌ ‌మండిపడ్డారు. డబుల్‌ ఇం‌జిన్‌గా ఉన్న యూపిలో అభివృద్ధి తెలంగాణ కన్నా తక్కువగా ఉందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండాలన్న విధానంతో లాభం జరిగిందా నష్టం జరిగిందా అన్నది గమనించాలన్నారు.డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమంటూ కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ తరచూ చెబుతూ..

తెలంగాణలోనూ డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌ ‌రాబోతుందని వ్యాఖ్యానిస్తున్న బిజెపి వారికి కౌంటర్‌ ఇచ్చారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు..అసెంబ్లీలో వివిధ అంశాలపై మాట్లాడుతూ..డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. డబుల్‌ ఇం‌జన్‌ ‌కాదు.. అది ట్రబుల్‌ ఇం‌జన్‌ అం‌టూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా పలు గణాంకాలను అసెంబ్లీలో ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్‌లో డబుల్‌ ఇం‌జన్‌ ‌ప్రభుత్వ పాలనలో ఆర్థిక వృద్ధి దేశంలో చివరి స్థానంలో ఉందని గుర్తుచేసిన ఆయన.. సింగల్‌ ఇం‌జన్‌ ‌ప్రభుత్వం ఉన్న తెలంగాణ మొదటి వరుసలో ఉందని పేర్కొన్నారు. డబుల్‌ ఇం‌జన్‌ ‌స్ట్రాటజీ తెలంగాణలో పనిచేయవని అసెంబ్లీ వేదిగా స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ఐటీ ఎగుమతుల విలువ ఏడాదికి దాదాపు లక్షన్నర కోట్లు ఉంటే.. బెంగళూరు ఐటీ ఎగుమతుల విలువ ఏడాదికి రూ. 3 లక్షల కోట్లు. ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధం అని హాజాబును దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించారు. మత కలహాలు పెట్టి హిజాబ్‌ ‌పంచాయితీ పెట్టారు.

ఇలాంటి ఆలోచనలు చేస్తే దేశం ఏమవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హిజాబ్‌ ‌లాంటి ఇష్యూలు ఉంటే దేశానికి పారిశ్రామికవేత్తలు వొస్తారా అంటూ ప్రశించారు. ఇలాంటి వివాదాలు దేశ యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయి. కేంద్ర తీరును అన్ని రాష్ట్రాలు  వ్యతిరేకించాలి. కొందరు దేశంలో విషబీజాలు నాటుతున్నారు. మతచిచ్చు పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశంలో ఫెడరలిజం ప్రమాదంలో ఉందన్నారు. అధికార ప్రతిపక్షం అనే భేదాభిప్రాయాలు లేకుండా ఫెడరల్‌ ‌స్ఫూర్తిపై చర్చ చేయాలన్నారు. ఆల్‌ ఇం‌డియా సర్వీస్‌ అధికారుల విషయంలో కేంద్రం రాష్ట్రాల హక్కులు కాలరాస్తుందన్నారు. వాళ్ళను కూడా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. వోట్లు..సీట్లు లెక్క పెట్టుకోవడమే రాజకీయం కాదని, ప్రేమ పూర్వక దేశంలో విషబీజాలు నాటుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.

బెంగుళూరు సిలికాన్‌ ‌వ్యాలీ ఆఫ్‌ ఇం‌డియా, హైదరాబాద్‌ ఐటీలో రెండో ప్లేస్‌లో ఉన్నాం, ఫార్మాకి ఫేమస్‌ ‌హైదరాబాద్‌ అని ఆయన వ్యాఖ్యానించారు. మత కలహాలు పెట్టి హిజాబ్‌ ‌పంచాయతీ పెట్టారని, ఆహార అలవాట్ల వి•ద పంచాయతీ పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వంకి వీటి వి•ద సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. సంకుచిత ఆలోచన చేస్తే దేశం ఏమవుతుందని, ఉన్మాద చర్య ఇది అంటూ ఆయన ధ్వజమెత్తారు. అనేక వ్యయ ప్రయాసాల వి•ద నిలబడ్డ దేశం ఏం అవుతుందని, యూపీఏ వి•ద రకరకాల నిందలు మోపి ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిందన్నారు. రాష్ట్రాల ఉనికి లేకుండా చేస్తాం, రాష్ట్రాలను అణిచేస్తాం అనే దుర్మార్గ వైఖరితో కేంద్రం ఉంది. కేంద్రం పనితీరు మనకన్నా దారుణంగా ఉంది. ప్రస్తుతం భారతదేశం అప్పు 152 లక్షల కోట్లు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తుంది. దేశంలో ఫెడరలిజం ఇప్పుడు ప్రమాదంలో ఉంది. ఐఎస్‌ఎస్‌ల విషయంలోనూ కేంద్రం కొత్త అధికారాల కోసం ప్రయత్నిస్తుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పారు.

25 వేల మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. ఎంబీబీఎస్‌ ‌చదవుకోడానికి అక్కడికి వెళ్లారు. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ ‌ఖర్చు తక్కువ అని విద్యార్థులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌ ‌నుంచి వొచ్చిన విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ప్రభుత్వం చదివిస్తుందని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. భట్టివిక్రమార్క మన వూరు మనబడి విషయంలో ప్రశంసించారని, ఆయన అనేక విషయాలు మాట్లాడారని, అయితే కేంద్రంచేస్తున్న దుర్మార్గాలను మాపై మోపరాదన్నారు. ఇవన్నీ పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలన్నారు. భట్టికి ప్రమోషన్‌ ఇచ్చి మనమంతా ఆయనను పార్లమెంట్‌కు పంపుదామన్నారు. దీంతో సభలో నవ్వులు విరిసాయి. మన వద్ద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతున్నామన్నారు. ఆర్టీసీ, సింగరేణి సంస్థలను మన పరిధిలో ఉన్న మేరకు కాపాడుకుంటూ వొస్తున్నాం. హ్యాండ్‌ ‌బుక్‌ ఆఫ్‌ ‌స్టాటిస్టిక్స్ ‌పబ్లిష్ట్ ‌బై రిజర్వ్ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా ప్రకారం.. డజన్ల కొద్ది విషయాల్లో తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రమైనప్పటికీ అద్భుతమైన విజయాలు సాధిస్తుందని రిజర్వ్ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా చెబుతుంది. అన్నింటిపై ఆర్థికమంత్రి సవివరంగా వివరించారని సిఎం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page