హ్యాట్రిక్ కొట్టి సిఎం కావడం ఖాయం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్,సెప్టెంబర్12: ప్రపంచ దేశాలను సైతం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్శిస్తున్నాయని, దీంతో తెలంగాణ ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అన్నివర్గాల సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ది లక్ష్యంగా కెసిఆర్ ముందుకు సాగుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన వారంతా బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ప్రపంచ దేశాలు తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల వైపు చూస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతే గ్రామాలఅభివృద్ధి జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు గ్రామాల్లో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, ప్రతి గ్రామంలోఅన్నిరకాలఅభివృద్ధిపను
అధికారులుకష్టపడి పని చేస్తున్నారని కొనియా డారు. అంతకుముందు 8,690 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం 3,414 గ్రామ కార్యద ర్శులు ఉండే వారన్నారు. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడిందన్నారు. ఈ దుస్థితిని మార్చేందుకు 9,355 మంది కార్యదర్శులను కొత్తగా నియమించడంతో 2,769 మంది గ్రామ కార్యదర్శులు పనిచేస్తున్నారన్నారు. దీంతో ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యదర్శి కలిగిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణెళి అన్నారు. రాష్ట్రంలో 8,900 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులుపని చేస్తుండగా అందులో ఇప్పటివరకు 4,600 మందిని గ్రేడ్-4కు క్రమబద్ధీకరి ంచినట్లు మంత్రితెలిపారు. ప్లలె ప్రగతి ద్వారా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు.
పాత పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించి, తెలంగాణ పంచా యతీ రాజ్ చట్టం 2018 ద్వారా ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధిని మన రాష్ట్రంలో చేసి చూపించామని తెలిపారు. కేంద్రంతో సమానంగా కేవలం మన ప్రభుత్వమే నిధులను మంజూరు చేస్తుండడం వల్ల ప్రతి గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి జరుగుతోందన్నారు. హరితహారం కార్యక్రమాన్ని సర్పంచ్‌లు పోటీపడి విజయవంతం చేస్తున్నారన్నారు. ప్లలె ప్రగతి ద్వారా ప్రతీ గ్రామానికి ట్రాక్టర్ కొనుగోలు చేసి ఇవ్వడంతో ఉదయమే తడి,పొడి చెత్తను సేకరించి ఎరువును తయారు చేసే స్థాయికి జీపీలు చేరాయన్నారు. గంగదేవిప్లలె ఒక ఊరుకే ఆనాడు అవార్డులు వచ్చేవని, ఇప్పుడు అన్ని గ్రామాలు, ప్రతీ కేటగిరీకి దేశవ్యాప్తంగా అనేక అవార్డులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ఒక విజన్‌తో చేసిన అభివృద్ధి వల్లనే నేడు మనకు అవార్డులు వస్తున్నాయన్నారు. అలాగే,ప్రతిచెరువు నీటితో కళకళలా డుతోందన్నారు .ఒకప్పుడు పల్లెటూరుకి పోవాలంటే ఆలోచించే వారు నేడు ప్రతీ పండుగకు గ్రామాలకు పోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. మరోమారు కెసిఆర్ హ్యాట్రిక్ సాధించి సిఎం అవుతారని అన్నారు.



