ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణకు పక్క ప్రణాళిక

ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణకు పక్క ప్రణాళిక రూపొందించాలి
జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,డిసెంబర్ 25 : ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణకు పక్క ప్రణాళిక రూపొందించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఆర్థిక ప్రగతి పెంచేందుకు చేపట్టిన బృహత్తర ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు అధికారులను ఆదేశించారు.మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు
సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో ప్రజాపాలన కార్యక్రమం అమలుకు రూపొందించవలసిన ప్రణాళికపై జిల్లా అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు చేపట్టనున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజల చెంతకు తీసుకు వెళ్లేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.ముందుగా 1000 లోపు జనాభా గ్రామాలను తీసుకోవాలని ప్రతి కుటుంబానికి ఒక దరఖాస్తు అందేలా రోజుకు రెండు గ్రామాలు చొప్పున ప్రతి గ్రామ పంచాయతీలోనూ సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచిస్తూ ప్రతి గ్రామ పంచాయతీలోనూ వారం వరకు దరఖాస్తులు తీసుకుంటామని ప్రజలకు తెలియ చెప్పాలన్నారు.తహాసిల్దార్లు, ఎంపీడీవోలు,ఎంపిఓలు,ఎంఈఓలు డిప్యూటీ తహాసిల్దార్లు టీములు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ చొప్పున ఐదు కౌంటర్స్ ప్రతి పంచాయతీలో ఏర్పాటు చేయాలన్నారు.28,29 తేదీలలో చిన్న గ్రామ పంచాయతీలు తీసుకొని,30వ తేదీ నుండి పెద్ద గ్రామ పంచాయతీలను ప్రణాళికలోకి తీసుకోవాలని అన్నారు.జిల్లాలోని మున్సిపాలిటీలలో వార్డుల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 28 నుండి 6 వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంట వరకు,తిరిగి మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.ధరఖాస్తులను ప్రభుత్వమే ప్రజలకు అందజేస్తుందని మహాలక్ష్మి పథకం,రైతుభరోసా,గృహజ్యోతి,ఇందిరమ్మ ఇల్లు,చేయూత పథకాలకు అర్హులైన వాళ్లు ధరఖాస్తులు అందించవలసి ఉంటుందన్నారు.ప్రజా పాలనపై ప్రతి గ్రామంలో,మున్సిపల్ వార్డులలో విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి,జిల్లా రెవెన్యూ అధికారి సంగీత,జిల్లా అధికారులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page