ప్రజలకు అందుబాటులో ఉంటా మల్లారెడ్డి

కీసర,  ప్రజాతంత్ర , డిసెంబర్  06 :  చామకూర మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా రెండవసారి ఎన్నికైన సందర్భంగా  నాగారం మున్సిపాలిటీ కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో  బుధవారం  ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా  కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు  పూల బోకే అందజేసి, శాలువాతో సన్మానించి  అభినందించారు. నియోజవర్గ ప్రజలకు,  కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీని  అన్ని రంగాలలో  మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.  ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే  పరిష్కరించడానికి  కృషి చేస్తానని  అన్నారు.   ఈ  కార్యక్రమంలో  శ్రీరామ్ నగర్,  సంతోష్ నగర్, వెస్ట్ గాంధీనగర్ కాలనీలా సంక్షేమ సంఘం నాయకులు,   బి ఆర్ఎస్  నాయకులు   తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page