ప్రగతి ప్రధాతకు పట్టం కడదాం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 21: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పటాన్ చెరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి విజయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి పిలుపునిచ్చారు.శనివారం మండల కేంద్రమైన గుమ్మడిదల చంద్రారెడ్డి గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన బిఆర్ఎస్ పార్టీ మండల స్థాయి విద్యార్థి యువత సోషల్ మీడియా కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ నుండి గుమ్మడిదల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గూడెం విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ.. నేడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు అభివృద్ధికి అవినీతికి మధ్య జరుగుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పటాన్చెరు నియోజకవర్గ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలుస్తోందని తెలిపారు. నియోజకవర్గంలోని పల్లెలు జాతీయ స్థాయి ఉత్తమ పంచాయతీలుగా అవార్డులు పొందుతున్నాయడానికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. నిరుపేదల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కొనసాగుతున్న అభివృద్ధి మరింత ముందుకు వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ బి ఆర్ ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.బిఆర్ఎస్ పార్టీకి వెన్నుముకైనా విద్యార్థి, యువత, సోషల్ మీడియా కార్యకర్తలు సైనికుల వలె పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కుమార్ గౌడ్, విజయభాస్కర్ రెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, గూడెం సంతోష్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ హుస్సేన్, నక్క వెంకటేష్ గౌడ్,  సురేందర్ రెడ్డి, గుమ్మడిదల గ్రామ సర్పంచ్ లు నరసింహారెడ్డి, మురళి, రాజశేఖర్, వేణు, శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, స్వామి, దామోదర్ రెడ్డి, శంకర్, ఆంజనేయులు, హనుమంత్ రెడ్డి, శ్రీనివాస్, ఎంపీటీసీలు, మెరాజ్ ఖాన్, శ్యాంసుందర్ రెడ్డి, కృష్ణకాంత్ యాదవ్  సీనియర్ నాయకులు, యువజన విద్యార్థి సోషల్ మీడియా విభాగాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page