‘‘లంబాడీ తెగ. ప్రజల నుండి బయట సమాజం చాలా నేర్చుకోవాలి. పూర్వం తండాల్లో లంబాడీలు నైతిక విలువలు, మహనీయ విలువలు పాటించే వారి సంస్కృతిని, సాంప్రదాయాలను పరిరక్షించుకున్నారు. కానీ ఈ గిరిజన ప్రజల గురించి ఏ మత గ్రంథాలు, ఏ చరిత్రకారులు, ఏ పుస్తకాలలో రాయలేదు. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం. గిరిజనులు ఈ నాగరిక సమాజంలో పూర్వం నుండి మోసపోతూనే ఉన్నారు.’’
భారతదేశ చరిత్ర ,సంస్కృతి, సాంప్రదాయాలు ఒకవైపు.. గిరిజనుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ఒకవైపు.. ప్రధానంగా లంబాడీ పూర్వీకులు అనుభవాలతో ముడిపడిన అంశం. లంబాడి పూర్వీకులు ఒక మహోన్నత ఆలోచనతో లంబాడి సంస్కృతి, సంప్రదాయాలు కాపాడడం కోసం తండాలను తమ నివాసులుగా చేసుకున్నారు. లంబాడీలది ప్రాచీన సంస్కృతి.. అడవులలో పశువుల పోషణ వీరి జీవన ఆధారం. తండా ప్రజలు గౌరవాన్ని నాయకత్వం పంచాయతీ వ్యవస్థ, ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు కలిగి ఉన్నారు. లంబాడిలు పవిత్రమైన ఆచారాలను కలిగి ఉంటారు. లంబాడీలు సంతలో కానీ.. బంధువుల ఇంటికి వచ్చినప్పుడు ఏడుస్తారు. దీనికి ఒక చరిత్ర ఉంది. లంబాడీలు తెలంగాణ ప్రాంతం నుండి గోదావరి నది దాటి మహారాష్ట్ర,, ఛత్తీస్‌ఘఢ్ ఇతర ప్రాంతాలకు పశువులను తీసుకొని వెళ్ళేవారు. మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళిన వారు అందరూ తిరిగి వచ్చేవారు కాదు. కొంత మంది చనిపోయేవారు. వారిని తలుచుకొని లంబాడీలు ఏడుస్తారు. ఈ దృశ్యం కన్నీళ్లు పెట్టిస్తోంది.
లంబాడీ తెగ. ప్రజల నుండి బయట సమాజం చాలా నేర్చుకోవాలి. పూర్వం తండాల్లో లంబాడీలు నైతిక విలువలు, మహనీయ విలువలు పాటించే వారి సంస్కృతిని, సాంప్రదాయాలను పరిరక్షించుకున్నారు. కానీ ఈ గిరిజన ప్రజల గురించి ఏ మత గ్రంథాలు, ఏ చరిత్రకారులు, ఏ పుస్తకాలలో రాయలేదు. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం. గిరిజనులు ఈ నాగరిక సమాజంలో పూర్వం నుండి మోసపోతూనే ఉన్నారు. గిరిజనుల్లో మూఢనమ్మకాలు ఎక్కువ లంబాడీలు శారీరకంగా భారీ మనసులు… దృఢమైన శరీరం కలిగి ఉంటారు. వారిని చూసిన బ్రిటిష్ ప్రభుత్వంLong Bodies అని పేరు పెట్టింది. దీనినుండి లంబాడి అని పేరు వచ్చింది.
ఒకే రాష్ట్రంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆంధ్ర ప్రాంతం సుగాలీలు ( లంబాడీలు ) గిరిజనులను తెలంగాణ ప్రాంతం లంబాడీలు డి నోటిఫైడై ట్రైబ్స్ DNT గా వెనుకబడిన 20 సంవత్సరాలు ఇవ్వకు గురయ్యారు. ఈ వివక్షను తొలగించి తెలంగాణలోని లంబాడీలకు న్యాయం చేయడానికి జాతి నాయకులు రిజర్వేషన్లు సాధించేందుకు ఉద్యమాలు నిర్వహించారు. ఆ ఉద్యమాల ఫలితంగా భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుండి కొన్ని కులాలు, జాతులు, ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చాలని కొందరు, తీసివేయాలని ఇంకొందరు విజ్ఞప్తులను పరిశీలించడానికి 33 మంది పార్లమెంటు సభ్యులతో కూడిన కమిటీని నియమించడం జరిగింది. స్వాతంత్రం రాక ముందు నుండి హైదరాబాద్ సంస్థానంలో కూడా గిరిజనులు గానే గుర్తించబడిన తెలంగాణ ప్రాంత లంబాడీలను 1952 లో అప్పటి ప్రభుత్వాలు తప్పిదాల వల్ల జరిగిన వివక్షను కేంద్ర ప్రభుత్వం 1976 లో సవరించే వరకు లంబాడీ గిరిజనులకు DNT• కోటాలో ఉంచి కొంత న్యాయం చేయడానికి ప్రయత్నించింది.
1956 కంటే ముందు తెలంగాణాలో లంబాడీలు బిసి బిఎ జాబితాలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎస్టీ జాబితా కేవలం ఆరు శాతం మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సుగాలీలు పేరుతో లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉన్నారు. అదే తెలంగాణలో లంబాడీలు బిసి.ఎ లో ఉండడం సరైంది కాదని ఎస్టీలో చేరుస్తూ ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆనాడు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకు నాలుగు శాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్లు అదనంగా మరో రెండు శాతం కలిపి మొత్తం ఆరు శాతం ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 10 శాతం ఉన్న లంబాడిలు జనాభా దృష్టిలో పెట్టుకొని ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసి ఇక్కడి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లను కల్పించుకునే వెసులుబాటు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండేలా చట్టం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అనేకసార్లు కలిసినప్పటికీ రిజర్వేషన్ల శాతం 50 శాతానికి మించివద్దని సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా కేంద్రం ప్రభుత్వం మొండిచేయి చూపడం వల్ల రిజర్వేషన్ అడ్డంకిగా మారింది. 2014 ఎన్నికల ప్రచారంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తానని, ఇచ్చిన మాట గుర్తుంచుకొని నూతన పంచాయతీ రాజ్ చట్టం 2018 ఆమోదించి చారిత్రకమైన నిర్ణయం తీసుకొని కెసిఆర్ నిబద్ధతను చాటుకున్నారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తండాలు కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పడి, తమ పల్లెలను ఇక తామే పరిపాలించుకునే అవకాశం దక్కడం, ప్రగతి గ్రామ పంచాయితీలుగా ఆవిష్కరించడం జరిగింది.
లంబాడీలు, ఆదివాసిలు భౌగోళికంగా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలో ఏజెన్సీ, మైదాన ప్రాంతాలలో అడవులలో తండాలను, గూడలను ఏర్పాటు చేసుకుని ఇప్పటికీ నివసిస్తున్నారు. అదే విధంగా వీరు గ్రామాలలో, పట్టణాలలో నివసించ కుండా అడవిలో, కొండల్లో, గుట్టల్లో సభ్య సమాజానికి దూరంగా ప్రకృతి ఒడిలో ప్రత్యేకంగా తండాలను, గూడలను ఏర్పాటు చేసుకుని జీవిస్తారు. బంజారా లంబాడిలు స్థిరనివాసుల ఏర్పాటు చేసుకొని తండాలుగా ఏర్పడి నీటి వనరులు చూసుకొని వర్షపు నీటిపైన ఆధారపడి జొన్నలు పండించేవారు. నీటి సౌకర్యం కలిగిన భూముల్లో మొక్క జొన్నలు వరి, పండిస్తారు. పురాతన కాలంలో లంబాడీలకు ముఖ్యమైన ఆహారం రొట్టెలు, కారం, ఆకుకూరలు మొదలైనవి. భాజీ ( ఆకుకూర ), బాటీ (జొన్న రొట్టె ), కాంధర్ క్వాడీ ( ఉల్లిపాయ తొక్కు) సంచార జీవనం కాలం నుండి కాయగూరలు అందుబాటులో లేని కాలంలో అటవీ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో విరివిగా లభించే ఆకుకూరలపై ఆధారపడేవారు. అందుకే లంబాడీలు నిత్యజీవితంలో జొన్న రొట్టెలు, భాజీ ఆకుకూరలు ముఖ్యమైన ఆహారం. ఇదేవిధంగా లంబాడీలకు బయట సమాజంతో ఏర్పడిన సాన్నిహిత్యం వల్ల వరి, గోధుమలు, పప్పు ధాన్యాలు మొదలుకొని వాణిజ్య పంటలైన పత్తి, పొగాకు మొదలైన ఆహారపు వాణిజ్య పంటలు వారి జీవనం సాగిస్తున్నారు. వీరిని గోర్ మాటి అని కూడా అంటారు. గోర్ బోలి భాష మాట్లాడుతుంటే తమ లంబాడీల భాషను విచిత్రంగా ఉంటుందని చర్చించుకుంటున్నారు.
లంబాడీల పెళ్ళిళ్ళు, పేరంటాలు, విందులు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. పెళ్లికి వచ్చిన యువతి, యువకుడు పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించుకుంటే బంధువుల ద్వారా వరుసకు అయ్యే యువతి యువకుల వివరాలు తెలుసుకోని చర్చించుకుంటారు. ముఖ్యమైన ఒక వరుసకు మన కుటుం బంలో యువకుడు ఉన్నాడని అని తెలిస్తే అమ్మాయికి సంబం ధించిన కుటుంబ సభ్యులు గానీ, బంధు మిత్రులు గానీ, భాట్ గానీ, వచ్చి కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకుని చేరవేస్తారు. అన్ని విధాల చర్చించుకుని ఇరువురికి సమ్మతమై నప్పుడు అమ్మాయి ఇంటి వద్దకు వచ్చి కాబోయే వియ్యంకులు సమ్ ది సేగా సేణ్ కుటుంబ సభ్యులు, బంధువులు, పెద్దలు, ఇరువైపుల వారు కూర్చొని ఇచ్చి పుచ్చుకొని విషయాలను తండా పెద్దలు మద్య చర్చించుకొని ఇరువురు అంగీకారానికి వచ్చిన శుభ సందర్భంగా తీపికి సంబంధించిన చాయ్ తాగి నోటిని తీపి చేసుకుంటారు. దీనిని సాగాయి అని అంటారు. సగాయి చేసేటప్పుడు గాని, గోల్ తినేటప్పుడు అందరూ క్షేమంగా ఉన్నారా ? అని అడిగినప్పుడు ఈ విధంగా క్షేమ సమాచారం అడుగుతారు. ఆనాటి నుండి ఆ రెండు కుటుంబాల వియ్యంకుల మద్య కుదిరినట్లు భావిస్తారు. అటు తర్వాత ఎండాకాలంలో పెళ్ళి తంతు కార్యక్రమాలు ప్రారంభమౌతుంది.
తెలంగాణలోని ప్రతి గిరిజన తండాల్లో తీజ్ పండగ తరతరాలుగా చేస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలు లంబాడీలు, పెళ్లి కాని యువతులు ఘనంగా జరుపుతారు. ఈ పండుగ బతుకమ్మ ను పోలి ఉంటుంది. తీజ్ పండుగ ఎనిమిది రోజుల పాటు పూజించి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తారు. ఈ ఉత్సవాలను తండాలోని పెళ్లి కాని ఆడపిల్లలు నిర్వహిస్తారు. వీరికి తండ పెద్దలు సోదరులు ప్రత్యేకంగా సహకరిస్తారు. వర్షాకాలం ప్రారంభంలో కనిపించే ఎర్రని ఆరుద్ర పురుగును ‘‘ తీజ్ ‘‘ అంటారు. అలాగే గోధుమ మొలకలను కూడా’ తీజ్ గా’ పిలుస్తారు. బతుకమ్మను పూలతో అలంకరించినట్లే%••% తీజ్ లో గోధుమ మొలకలను పూజించడం లంబాడీలు ఆనవాయితీ. కొత్త పేర్లు కొత్త రూపాల్లో పండగలు తండాలో కి ప్రవేశిస్తున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా వీరిని మరింత ఇబ్బందులు పడేసే విధంగా మూఢనమ్మకాలు నమ్మిస్తారు. ఇదంతా వారి జీవన విధానాన్ని సహజీవనాన్ని ధ్వంసం చేయడం గతంలో తండ పెద్దలు కూర్చుని ఏ కార్యం అయినా, పండగ అయినా, పెళ్లి అయినా, పంచాయతీ అయినా, సామూహికంగా పరిష్కరించుకునేది. కార్యం పూర్తి చేసింది. ఇప్పుడు అది లేకుండా పోయింది. ఇప్పుడు బ్రాహ్మణీయ, పాశ్చాత్య సంస్కృతులు తండా మీద పడి వారి జీవన విధానం ఒక ప్రశ్నార్థకంగా మారింది. అయినా లంబాడీలు తండాలలో తమ సంస్కృతి, సాంప్రదాయ ఆచార వ్యవహారాలను పాటిస్తూనే ఉన్నారు. తండా నాయక్ (తండా పెద్ద ) ఏం చెప్తే అదే లంబాడి గిరిజన ప్రజలకు వేదం. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో సంస్కృతి భాష కనుమరుగవుతున్న ఈ కాలంలో సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడం అందరి బాధ్యతగా గుర్తించాలి.

కేయూ వరంగల్