సంగారెడ్డి, ప్రజాతంత్ర,నవంబర్ 27: శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లాలో పకడ్బందిగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లతో కలిసి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు, ఈవిఎం యంత్రాల తరలింపు, కౌంటింగ్ ఏర్పాట్లు, తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణకు అన్ని విధాల ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి ,రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శరత్
