Take a fresh look at your lifestyle.

పేపర్‌ ‌లీకేజీపై సిఎం కెసిఆర్‌ ఎం‌దుకు మాట్లాడరు

  • ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని వొదిలిపెట్టేది లేదు
  • బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌
  • ‌నిరుద్యోగులను ఫూల్స్ ‌చేసిన కెసిఆర్‌  : ‌సిఎం మాటలను జతచేస్తూ బండి ట్వీట్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌టీఎస్పీఎస్సీ పేపర్‌ ‌లీకేజీ కేసుపై సీఎం కేసీఆర్‌ ఎం‌దుకు మాట్లాడడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. పేపర్‌ ‌లీకేజీ వెనుక బీఆర్‌ఎస్‌ ‌లీడర్ల హస్తం ఉందని విమర్శించారు. ఈ కేసులో ప్రభుత్వాన్ని వొదిలిపెట్టే ప్రసక్తే లేదన్న ఆయన.. ఈ కేసులో తన కొడుకు ఉన్నాడనే సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడడం లేదని ఆరోపించారు. బిడ్డ లిక్కర్‌ ‌కేసుపైనా సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడడం లేదన్నారు. మంత్రి కేటీఆర్‌ను ఎందుకు బర్తరఫ్‌ ‌చేస్తలేరని బండి సంజయ్‌ ‌నిలదీశారు. ఏది జరిగినా సంబంధం లేదనడం మంత్రి కేటీఆర్‌ ‌కు అలవాటేనని బండి సంజయ్‌ అన్నారు.

దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు జరిగేది ఒక్క తెలంగాణలోనేనన్న ఆయన..చిన్న వాళ్లను అరెస్ట్ ‌చేసి కేసు క్లోజ్‌ ‌చేయాలని చూస్తున్నారని, టీఎస్పీఎస్సీ కేసులో పెద్దమనుషుల హస్తం ఉందని ఆరోపించారు. నష్టపోయిన విద్యార్థులకు రూ.1లక్ష ఇవ్వాలని బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ అంటే భయమెందుకు అన్న ఆయన.. సీఎం కేసీఆర్‌ ఏ ఒక్క హావి• నెరవేర్చలేదని విమర్శించారు.

నిరుద్యోగులను ఫూల్స్ ‌చేసిన కెసిఆర్‌  : ‌సిఎం మాటలను జతచేస్తూ బండి ట్వీట్‌
‌నిరుద్యోగ భృతిపై మాట తప్పిన కెసిఆర్‌ ‌యువతను ఫూల్స్ ‌చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. బీఆర్‌ఎస్‌ ‌మళ్లీ అధికారంలోకి వొస్తే నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3,016 నిరుద్యోగ భృతిని ఇస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం కేసీఆర్‌ ‌హావి•ని గుర్తు చేస్తూ ఆయన పోస్ట్ ‌చేశారు. ఓ నిరుద్యోగి ఫోన్‌కు వొచ్చిన మెసేజ్‌ అని రాసి ఉన్న ఓ ఫొటోతో పాటు సీఎం కేసీఆర్‌ అన్న అప్పటి మాటలను క్యాప్షన్‌ ‌లో చేర్చారు.

దాంతో పాటు వి•రు దీనిని నమ్మితే ఏప్రిల్‌ ‌ఫూల్స్ ‌డే శుభాకాంక్షలు అంటూ సెటైరికల్‌గా రాసుకొచ్చారు. బండి సంజయ్‌ ‌షేర్‌ ‌చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు సైతం పలు సెటైరికల్‌ ‌కామెంట్లు పెడుతున్నారు. మోడీ తాత తనకు రూ.15లక్షలు వొచ్చాయని, వి•కు వొచ్చాయా బంటి అన్న అంటూ బీఆర్‌ఎస్‌ ‌సపోర్టర్‌ ఒకరు కామెంట్‌ ‌చేయగా.. ‘హుసేన్‌ ‌సాగర్‌ ‌లోకి కొబ్బరినీళ్లు’, ’సిగ్నల్‌ ‌ఫ్రీ సిటీ’, ’ ప్రతి మండలంలో 30 బెడ్ల ఆసుపత్రులు’, ‘రూ.500కోట్లతో కేసీఆర్‌ ఏర్పాటు చేసిన ఎన్‌ఆర్‌ఐ ‌సెల్‌’ అం‌టూ గతంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హావి•లను గుర్తు చేస్తూ ఏప్రిల్‌ ‌ఫూల్స్ ‌డే శుభాకాంక్షల పోస్ట్‌లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Leave a Reply