Take a fresh look at your lifestyle.

పేదల కోసం కాదు..పెద్దల కోసమే ‘ధరణి’

  • అక్రమాల పుట్టగా మారింది
  • వందరోజుల్లో ధరణి సమస్యలకు చెక్‌
  • ‌కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన వెంటనే చర్యలు
  • సుల్తాన్‌ ‌పూర్‌ ‌గ్రామంలో ధరణిపై ప్రజాభిప్రాయంలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌
  • ‌రద్దుతోనే సామాజిక తెలంగాణ సాధ్యమన్న సిఎల్‌పి నేత భట్టి
  • కౌలు రైతులను పట్టించుకోని ప్రభుత్వం : కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జైరామ్‌ ‌విమర్శ

పెద్దపల్లి, ప్రజాతంత్ర, మార్చి 10 : రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి రాగానే వందరోజుల్లో ధరణి సమస్య పరిష్కరిస్తామని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హావి• ఇచ్చారు. ధరణి అక్రమాల పుట్టగా మారిందన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌ ‌పూర్‌ ‌గ్రామంలో ధరణిపై కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ధరణి బాధితుల సమస్యలు తెలుసుకొని గ్రామస్తులకు హావి• కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్‌ ‌రెడ్డి…70 సంవత్సరాల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ రైతుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ ‌పార్టీ అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ ‌పేదల కోసం కాదని, భూస్వాముల కోసం మాత్రమేనని విమర్శించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం 22 లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంపిణీ చేసిందన్నారు రేవంత్‌ ‌రెడ్డి.

ధనవంతుల కోసమే కేసీఆర్‌ ‌ధరణి పోర్టల్‌ ‌తీసుకొచ్చారని ఫైర్‌ అయ్యారు. ధరణి ద్వారా 9 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 12 వేల గ్రామాల్లో ధరణి అదాలత్‌ ‌నిర్వహించి బాధితుల నుండి దరఖాస్తు స్వీకరించి వారికి కాంగ్రెస్‌ ‌గ్యారంటీ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. ధరణి పోర్టల్‌ ‌ను ఫిలిపిన్స్ ‌కు చెందిన ఒక ప్రైవేట్‌ ‌కంపెనీకి కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు కాజేస్తున్నారన్నారు. ధరణి పోర్టల్‌ను తొలగిస్తేనే సామాజిక తెలంగాణ ఏర్పడుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయం వ్యక్తం చేశారు. రణి అదాలత్‌ ‌ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క… ధరణి పోర్టల్‌ ‌తో ఎదురవుతోన్న సమస్యలపై ఇప్పటికే టీపీసీసీ ఆధ్వర్యంలో సర్వే ప్రారంభమైందన్నారు. ఉత్పత్తి రంగం కొద్దిమంది చేతుల్లో ఉంటే.. మిగతా ప్రజలు వారిపై ఆధారపడాల్సి ఉంటుందని భట్టి చెప్పారు. గతంలో భూమి ఒక్కటే ఉత్పత్తి రంగంగా ఉండేదని… కాంగ్రెస్‌  ‌పేద ప్రజలకు  భూమిని పంచిన చరిత్ర కూడా కాంగ్రెస్‌ ‌దేనని గొప్పగా చెప్పారు.

తెలంగాణలో ఏ పోరాటం చూసినా… భూమికోసం జరిగినవేనని భట్టి విక్రమార్క అన్నారు. స్వతంత్ర భారతదేశంలో పోరాటాల లక్ష్యాలకు భిన్నంగా రాష్ట్రంలో చట్టాలు తీసుకొచ్చారని చెప్పారు. పేదలకు పంచిన భూములను ధరణి చట్టంలోకి రాకుండా పక్కనబెట్టారని ఆరోపించారు. వారికి పాస్‌ ‌బుక్‌ ‌లు, పట్టాలు ఇవ్వడంలేదన్న ఆయన.. కాస్తు కాలమ్‌ ‌ను తొలగించి భూమిని భూస్వాములకు అప్పగించారని ఆరోపణలు చేశారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో కేసీఆర్‌ ‌ను నిలదీశామన్న భట్టి.. ఫ్యూడల్‌ ‌వ్యవస్థను, భూస్వామ్య విధానాన్ని బీఆర్‌ఎస్‌ ‌మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే… కాస్తు కాలమ్‌ ‌తో పాటు ఇతర కాలమ్స్ ‌ను మళ్లీ చేరుస్తామని ఆయన హావి• ఇచ్చారు. ఈ కార్యక్రమానికి భట్టి విక్రమార్కతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌, ‌మాజీ ఐఏఎస్‌ అధికారి కొప్పుల రాజు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ ‌చౌదరి, పొన్నం ప్రభాకర్‌, ‌మల్లు రవి ఇతర నేతలు పాల్గొన్నారు.

కౌలు రైతులను పట్టించుకోని ప్రభుత్వం : కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జైరామ్‌ ‌విమర్శ
తెలంగాణలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు ..వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని కాంగ్రెస్‌ ‌నేత, ఏఐసీసీ కార్యదర్శి జైరాం రమేష్‌ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌ ‌పూర్‌ ‌గ్రామంలో జరిగిన ధరణి అదాలత్‌ ‌లో కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాబోయే రోజుల్లో వి• భూమి..వి• హక్కు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ధరణిలో 60 లక్షల మంది పేర్లు ఉంటే దాదాపు 20 లక్షల ఖాతాల్లో సమస్యలు ఉన్నాయని తెలిపారు.

ధరణి పోర్టల్‌ ఉద్దేశం ఒకరి ఫోటో ఒకరికి పెట్టడం కాదు..ఎవరి భూములకు వారి హక్కులు కల్పించాలని జైరాం రమేష్‌ ‌వెల్లడించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడ్డాక రెండేళ్లలో భూముల సర్వే చేయిస్తామని జైరాం రమేష్‌ ‌హావి• ఇచ్చారు. రాష్ట్రంలో భూములకు సంబంధించి 125 చట్టాలు..30 వేల జీఓలు ఉన్నాయి..కానీ మేము ఒకే చట్టం తీసుకొస్తామన్నారు. 2013లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం భూయజమాని అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితిలో సేకరించవద్దని చట్టం తీసుకొచ్చామని గుర్తు చేశారు. బలవంతంగా భూసేకరణ పూర్తిగా నిషేధిండమే కాకుండా చట్టాన్ని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు.

Leave a Reply