పెళ్లి వేడుకలను ఇంకా నిషేధించలేదుగా..

  • రాహుల్‌ ‌నైట్‌క్లబ్‌ ‌పార్టీపై కాంగ్రెస్‌ ‌నేతలు సుర్జేవాలా, మాణికం టాగూర్‌ ‌‌కౌంటర్‌
  • ‌బిజెపి విమర్శలకు ఘాటు స్పందన
  • జవదేకర్‌ ‌షాంపేయిన్‌ ‌ఫోటోలు విడుదల

న్యూ దిల్లీ, మే 3 : రాహుల్‌ ‌గాంధీ నైట్‌ ‌క్లబ్‌ ‌పార్టీ వీడియో పై కాంగ్రెస్‌ ‌పార్టీ ఘాటుగా స్పందించింది. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రధాన కార్యదర్శి రణ దీప్‌ ‌సూర్జేవాలా ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. వివాహ వేడుకకు రాహుల్‌ ‌వెళ్లడం నేరమా? అని ఆ పార్టీనేత సూర్జేవాలా ప్రశ్నించారు. పాక్‌ ‌మాజీ ప్రధాని నవాజ్‌ ‌షరీఫ్‌ ‌పుట్టినరోజుకు పిలవకుండా ప్రధాని మోదీ వెళ్లినట్టు.. రాహుల్‌ ‌గాంధీ వెళ్ళలేదుగా అని అన్నారు. ఆహ్వానిస్తేనే రాహుల్‌ ‌వివాహ వేడుకకు వెళ్లారని వివరించారు. ఫ్రెండ్‌ ‌పెళ్లికి హాజరయ్యేందుకు ఆయన ఖాట్మండ్‌ ‌వెళ్లారని చెప్పారు. రాహుల్‌ ‌వ్యక్తిగత టూర్‌లో ఉన్నారు. ఇందులో తప్పేముందో చెప్పాలని బీజేపీ నేతలకు సవాలు చేశారు. విద్యుత్‌ ‌సంక్షోభం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై బీజేపీ వాళ్లు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కానీ వారి సమయమంతా రాహుల్‌ ‌కోసమే కేటాయిస్తారని సుర్జేవాలా మండిపడ్డారు.

పెళ్ళిళ్లకు హాజరవ్వడం భారత్‌లో నేరం కాదుకుటుంబాన్ని కలిగివుండడం, పెళ్లిళ్లు, వివాహ నిశ్చితార్థ వేడుకలకు హాజరవ్వడం భారత్‌లో సాంప్రదాయకం, నాగరికత అని రణ్‌దీప్‌ ‌సుర్జేవాల్‌ అన్నారు. పెళ్లిళ్లు చేసుకోవడం, స్నేహం చేయడం, పెళ్లి వేడుకలకు హాజరవడం ఈ దేశంలో ఇంకా నేరంగా మారలేదనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. రాహుల్‌ ‌గాంధీ నైట్‌ ‌క్లబ్‌ ‌వీడియోలో తప్పేముందని, ఫ్రెండ్‌  ‌వివాహ వేడుకకు రాహుల్‌ ‌నేపాల్‌ ‌వెళ్లడం నేరమా? అని బీజేపీని సూటిగా ప్రశ్నిం చారు. నేపాల్‌ ఆహ్వానం మేరకే రాహుల్‌ ‌గాంధీ వివాహ వేడుకకు వెళ్లారు. అంతేగానీ ప్రధాని మోదీలా మాజీ పాక్‌ ‌ప్రధాని నవాజ్‌ ‌షరీఫ్‌ ఇం‌ట వేడుకకు వెళ్లలేదు.. షరీఫ్‌తో కలిసి కేక్‌ ‌కట్టింగ్‌ ‌చేయలేదు. ఆయన పర్యటన తర్వాతే పఠాన్‌కోట్‌లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు అని రణ్‌దీప్‌ ‌సూర్జేవాలా పేర్కొన్నారు. రాహుల్‌ ‌చేసిందాంట్లో తప్పేవి• లేదు. అలా పెళ్లికి వెళ్లడం సంప్రదాయం కూడా. నేరం కాదు. బహుశా బీజేపీ త్వరలో ఇలా బంధువులు, స్నేహితుల పెళ్లిళ్లకు వెళ్లడాన్ని ఒక నేరంగా ప్రకటిస్తుందే మో అంటూ రణ దీప్‌ ‌సూర్జేవాలా సెటైర్లు వేశారు.

గాంధీ కుటంబానికి చెందిన వ్యక్తి సాధారణ వ్యక్తిలా ఓ పెళ్లి రిసెప్షన్‌ ‌కు హాజరైతే తప్పేంటో చెప్పాలని కాంగ్రెస్‌ ఎం‌పీ మాణికం టాగూర్‌ ‌మండిపడ్డారు. ఏం తప్పు జరిగిందో దర్యాప్తు చేసుకోవచ్చన్నారు. కారణం లేకుండా కాంగ్రెస్‌ ‌నాయకుడిని విమర్శించడానికి బదులు ముఖ్యమైన సమస్యలపై దృష్టిసారించాలని హితబోధ చేశారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌, ‌బీజేపీల మధ్య కొత్త రగడకు దాడి తీసింది రాహుల్‌ ‌నైట్‌ ‌క్లబ్‌ ‌వీడియో. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉదయం నుంచి వరుస పెట్టి ట్వీట్లు, పోస్టులతో సెటైర్లు, విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్‌ ‌కౌంటర్‌కి దిగింది. బీజేపీ నేత ప్రకాశ్‌ ‌జవదేకర్‌కు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్ ‌చేసిన కాంగ్రెస్‌ ‌నేత మాణికం టాగూర్‌.. ఇది ఎవరో చెప్పాలంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page