- ఆరు రోజుల్లో ఐదోసారి పెరిగిన ధరలు
- పెట్రోలుపై 50 పైసలు, డీజిల్‌పై 55 పైసలు పెంపు
న్యూ దిల్లీ, మార్చి 27 : దాదాపు నాలుగు నెలల విరామం అనంతరం మార్చి 22న ప్రారంభమైన పెట్రోలు డీజిల్ ధరల పెరుగుదల కొనసాగూనే ఉంది. ఆరుఉ రోజుల్లో ఐదు సార్లు చమురు కంపెనీలు ధరలు పెంచాయి. అసలే కొరోనా దెబ్యతో కోలుకోలేకపోతున్న సామాన్యుడిపై ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పెరుగుతున్న పెట్రో ధరల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఆదివారం పెట్రోల్ ధర లీటరుకు 50 పైసలు, డీజిల్ ధర 55 పైసలు పెరిగింది. దీంతో• ఈ వారం రోజుల్లో లీటరుకు రూ. 3.70-3.75 వరకు పెరిగింది.
ఈ పెరుగుదలతో దిల్లీలో పెట్రోల్ ధర రూ.99.11గా ఉండగా..డీజిల్ ధరలు లీటరుకు రూ.90.42కి చేరుకుంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.30కి చేరుకోగా డీజిల్ ధర రూ.98.65కు చేరుకుంది. దేశవ్యాప్తంగా రేట్లు పెంచబడినా స్థానిక పన్నులను బట్టి రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య ధరలు మారుతూ ఉంటాయి.