సామాజిక మాధ్యమాలలో నవ సమాజం తీరు తెన్నులు చూస్తే ఇది నాగరిక సమాజమేనా అనే అనుమానం కలుగక మానదు… ఖండాలు దాటి దేశాలు దాటి ఉన్న వాళ్ళను కులాలకు మతాలకు సంస్కృతలకు అతీతంగా ఒక్కటీ చేస్తున్న సామాజిక మాధ్యమాలు లక్ష్యం ఏమిటి అన్నది విస్మరిస్తున్నారు అనేకమంది.
ముఖ్యంగా ముఖపుస్తకంలో కొందరి వ్యక్తుల ధోరణి అభ్యంతర కరంగా ఉంది… మెసెంజర్ లో వ్యక్తిగత పరిచయాలు నెమ్మదిగా పెంచుకుని వాటిని కొనసాగిస్తూ అనతి కాలంలోనే నిజ స్వరూపం చూపించే వాళ్ళు ఎందరో… సామాజిక మాధ్యమాలు ఉపయోగించే వారిలో అత్యధికులు విద్యాధికులే అయినప్పటికీ వాస్తవంలో వారి నిజ ప్రవర్తనలు చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు… యువత తీరు చూస్తే కట్టుబాట్లు బంధాలు అనేవి మరచి వ్యవహరిస్తున్న తీరు చాలా అభ్యంతర కరంగా ఉంది… తల్లి వయసు.సోదరి వయసు ఉన్న వాళ్ళతో పిన్న వయసు కలిగిన వాళ్ళు వ్యహరించే తీరు చూస్తే చాలా బాధాకరం… అదే సమయంలో కొందరు మహిళలు కూడా వయసు బేధాలను కూడా పరిగణలోనికి తీసుకోకుండా తన కొడుకు లేదా తమ్ముడు వయసు ఉన్న వారితో చేస్తున్న చాటింగ్ సంభాషణలు చూస్తే ఎం మాట్లాడాలో తెలియని పరిస్ధితి.. సంబంధాలు విషయంలో కూడా వయో బేధాలను విస్మరించి నడుస్తున్న ధోరణి ఎక్కడకు తీసుకు పోతుంది??
ఈ ధోరణి పెరగడానికి గల కారణాలు ఏమిటి యుక్త వయసులో ఉన్న కుర్రోళ్ళు కారణమా?? వారిని ఆకట్టుకోవడానికి యత్నించే వివాహిత మహిళలు కారణమా?? సమకాలీన సమాజంలో ఇవి అత్యంత సహజం అంటూ సమర్దించే వర్గం కూడా లేకపోలేదు.. యుక్త వయసులో ఉన్న వారు ఆకర్షణలు పట్ల ఆకర్షితులు కావడం సహజం… అయితే జీవితంలో స్ధిర పడి ఒక బాధ్యతాయుత స్ధానంలో ఉన్న వాళ్ళు అనుసరిస్తున్న ధోరణి మాత్రం ఎంతైనా అభ్యంతరకరం.. ప్రపంచం అంతా మన సంస్కృత లను గౌరవిస్తూ ఉంటే, మనం పాశ్చాత్య విష సంస్కృతుల దిశగా వయసు, బంధం అనే వాటికి తిలోదకాలు ఇచ్చి అనేక మంది విషయంలో జరుగుతున్న ఈ చీకటి భాగోతాలు బయట పడితే కుటుంబాలు ఎలా ఛిద్రం అయిపోతాయో ఒక్క సారి ఆలోచిస్తే అటువంటి ఉద్వేగాలు నిలచి పోతాయి.రాబోయే తరాల వారికి మనం ఇచ్చే సంపద ఇదేనా?? నేడే ఇలా ఉంటే రాబోయే తరాల వారు పరిస్ధితి ఉహించడానికే భయం అనిపిస్తుంది….
– ప్రియగోలి, గుంటూరు.. 8500881385
– ప్రియగోలి, గుంటూరు.. 8500881385