- 3712 పోస్టుల భర్తీకి ఏర్పాట్లు
- లక్షమందికి 220 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండాలి
- సమీక్ష సమావేశంలో మంత్రి కెటిఆర్
సుబేదారి,ప్రజాతంత్ర, ఏప్రిల్ 20, :
తెలంగాణ రాష్ట్రంలోని పురపాలక సంస్థలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. బుధవారం హన్మకొండ, వరంగల్ నగరంలో 150 కోట్లకు పైగా అభివృద్ధి పనుల, శంకుస్థాపనల కార్యక్రమాలు ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మకొండ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునిసిపల్ అస్మినిస్ట్రేషన్‌కు 3712 ఉద్యోగుల నియామకానికి కాబినెట్ అమిదించిందని తెలిపారు. త్వరలో సిబ్బంది కొరత తీరుతుందని తెలిపారు. త్వరలో సిబ్బంది కోరుతుందన్నారు. జిడబ్ల్యూఎంసిలో ఉన్న 51 వర్క్ ఇన్సెస్పెక్టర్ లను రెగ్యులైజ్ చేస్తామన్నారు మున్సిపాలిటీలో 50 వేల పై ఉన్న జనాభాకు ఒక వార్డ్ ఆఫీసర్ ను నియమిస్తామన్నారు. శానిటేషన్ పక్కాగా జరగాలని ఆదేశించారు. స్వచ్ భారత్ మిషన్ గైడ్లైన్స్ ప్రకారం లక్ష మందికి 280 పారిశుధ్య కార్మికులు ఉండేలా చర్యలు తీసుకోవాలని, మంజూరు చేసిన నిధులను ప్రణాళిక బద్దంగా ప్రాధాన్యత క్రమంలో సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మంజూరైన నిధులకు పూర్త్తిగా టెండర్ జరిగి 100 శాతం నిధులు వినియోగం కావాలన్నారు వరంగల్ స్మార్ట్ సిటీలో పథకంలో రాష్ట్ర వాటా రూ. 250 కోట్లు కట్టేలా చేసేలా చర్యలు తీసుకోవాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ని కోరారు. జిడబ్ల్యూఎంసీకు క్రెడిట్ రేటింగ్ ద్వారా రూ. 90 కోట్ల రుణం బాంక్ మంజూరు చేస్తున్నందున రెవిన్యూ జనరేటింగ్ ప్రొజెక్ట్‌లలో పెట్టాలన్నారు. ఈ నిధులతో హన్మకొండ, వరంగల్ బస్ స్టేషన్స్ అభివృద్ధి చేయుటకు చర్యలు తీసుకోవాలని, కుడా క్రియాశీలంగా పని చేయాలన్నారు. వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్‌లలో ల్యాండ్ పూలింగ్, లే ఔట్ ల ద్వారా ఆదాయం పెంచుకొని అభివృద్ధి చేయాలని మంత్రి పేర్కొన్నారు.
ఈసమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, ఎంపీ మలోతు కవిత,ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కలపల్లి రవిందర్, పాడి కౌషిక్ రెడ్డి, జెడ్పి చైర్మన్లు డాక్టర్ సుధీరకుమార్, గండ్ర జ్యోతి, కుసుమ జగదీష్, పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యేలు దరంసోత్ రెడ్య నాయక్, ఒడుతల సతీష్ బాబు, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, అరురి రమేష్, చల్లా ధర్మరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, బానొత్ శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర వికలాంగుల కార్పోరేషన్ చైర్మెన్ వాసు దేవ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, రాష్ట్ర మునిసిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, డైరెక్టర్ పురపాలక శాఖ, సీడీఎంఏ డాక్టర్ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.గోపి, కుడా చైర్మన్ సుందర్ రాజన్,జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ పి.ప్రావీణ్య, ఉన్నత స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.