పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించాడమే లక్ష్యం
-ఇబ్రహీంపట్నం ఎమెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,డిసెం
కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి
రంగారెడ్డి అన్నారు.శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మల్ రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రజా పాలన కార్యక్రమం ప్రవేశపెట్టి అభయ హస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారంచుట్టిందన్నారు.జనవరి 6వ తేదీ వరకు ప్రతి గ్రామ పంచాయతీ,
మున్సిపాలిటీలలోని ప్రతి వార్డులలో సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి
దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.మహాలక్ష్మి,రైతు భరోసా,
చేయూత,గృహ జ్యోతి,ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని
అన్నారు.ప్రజలు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన
లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఇప్పటికే ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచిత ప్రయాణం,ఆరోగ్యశ్రీ పరిమితి
రూ.10 లక్షలకు పెంపు హామీని నెరవేర్చామని,మిగిలిన గ్యారంటీలు అమలు చేస్తామన్నారు.మహిళలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం అర్హులైన వారికి ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని, స్థలాలు ఉన్నవారికి ఇండ్లు కట్టిస్తామని
తెలిపారు.200 యూనిట్ల ఉచిత కరెంటును, రైతు భరోసా క్రింద ఎకరాకు ఏడాదికి
15000 అందించనున్నట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామ
పంచాయతీలు,మున్సిపల్ వార్డులలో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించి
అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని అన్నారు.
చివరి వరుసలో ఉన్న ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందించేందుకు గ్రామ
సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు.ఈనెల 28 నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ప్రజా పాలన కార్యక్రమంలో కుటుంబం నుండి ఒకరు వచ్చి దరఖాస్తు చేస్తే సరిపోతుందని, అన్ని పథకాలకు ఒక దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.సందేహాల నివృత్తికి హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పెన్షన్లు
పొందుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని,కొత్తగా
పెన్షన్లు పొందాలనుకునే వారు మాత్రమే దరఖాస్తు చేయాలని అన్నారు. ఏదేని
కారణం వల్ల గ్రామ సభలో దరఖాస్తు చేసుకోలేని వారు జనవరి 6వ తేదీ వరకు తమ దరఖాస్తులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందజేయవచ్చని ప్రతి దరఖాస్తుతోపాటు ఆధార్,రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులను జత చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు.ఈ సందర్భంగా ప్రజల నుండి దరఖాస్తులను శాసన సభ్యులు సేకరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిపి,మంచాల ఎంపీడీఓ, సంబంధిత అధికారులు,లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.





