పల్లె, పట్టణ ప్రగతిలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

18న అధికారులతో సిఎం కెసిఆర్‌ ‌సవి•క్ష

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 13 : రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సవి•క్షించనున్నారు. ప్రగతి భవన్‌ ‌వేదికగా బుధవారం ఉదయం 11 గంటలకు ఈ ఉన్నతస్థాయి సవి•క్ష జరగనుంది. ఈ సందర్భంగా మంత్రులు, జడ్పీ ఛైర్మన్లు, రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, అన్ని జిల్లాల డీపీవోలు, అటవీశాఖ అధికారులు, మున్సిపల్‌ ‌కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు, అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.

ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఐదో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి చేపట్ట నున్నారు. కార్యక్రమాల నిర్వహణపై ఈ సమావేశంలో కేసీఆర్‌ ‌చర్చిస్తారు. ఇప్పటి వరకు అమలైన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిని సవి•క్షించడంతో పాటు భవిష్యత్‌ ‌కార్యాచరణపై సీఎం కేసీఆర్‌ ‌దిశానిర్దేశం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page