పర్యాటక ప్రాంతాల ప్రాచుర్యానికి అంబాసిడర్‌గా పనిచేస్తా

  • పర్యాటక ప్రాంతాల అభివృద్దికి రోడ్‌ ‌మ్యాప్‌ ‌సిద్దం చేయాలి
  • పర్యాటక ప్రాజెక్ట్ ‌పనులను త్వరగా పూర్తి చేయాలి
  • అధికారులతో సక్షలో మంత్రి రోజా సూచన
అమరావతి,ఏప్రిల్‌ 27 : ‌రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలకు దేశ, విదేశాల్లో మంచి ప్రాచుర్యం కల్పించేందుకు ప్రత్యేక అంబాసిడర్‌గా పనిచేస్తాని రాష్ట్ర పర్యాటక, సాంస్క•తిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్‌.‌కె.రోజా అన్నారు. అందుకై పర్యాటక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించడమే కాకుండా అక్కడి సమస్యల పరిష్కారానికి, ఆయా ప్రాంతాల అభివృద్దికి శక్తివంచన లేకుండా కృషిచేస్తా నన్నారు. అందుకు తగ్గట్టుగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి వాటి అమలుకు పూర్తి స్థాయిలో సహకరించాలని పర్యాటక శాఖ అధికారులను ఆమె కోరారు.  బుధవారం  అమరావతి సచివాలయంలో రాష్ట్ర పర్యాటక, సాంస్క•తిక మరియు క్రీడలు, యువజన సర్వీసుల శాఖల అధికారులతో మంత్రి సమావేశమై ఆయా శాఖలు నిర్వహిస్తున్న కార్యక్రమాల ప్రగతిని సక్షించారు. ఈ సందర్బంగా మంత్రి  రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటకరంగం అభివృద్దికి ఇప్పటికే చేపట్టిన ప్రాజక్టుల పనులను వేగవంతం చేయాలని, భవిష్యత్తులో మరిన్ని ప్రాజక్టులను చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిలను రూపొందించాలని, అందుకు అవసరమైన నిధులను సమకూర్చి వాటి అమలుకు కృషిచేస్తానన్నారు.
దేశ, విదేశాల నుండి పర్యాటకులు రాష్టాన్రికి పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు అవసరమైన వాయు, రోడ్డు,  రైలు  రవాణా సౌకర్యాలను కల్పించే అంశంపై అధికారులు దృష్టి సారించాలని, రాష్ట్రంలోని ఏయే  పర్యాటక ప్రాంతాలకు ఎటువంటి రవాణా సౌకర్యాలు అవసరమో గుర్తించి, తన దృష్టికి తెస్తే వాటి కల్పనకు తన వంతు కృషిచేస్తాన్నారు.  ఈ సమావేశంలో పాల్గొన్న సాహిత్య అకాడ, మ్యూజిక్‌, ‌డ్యాన్సు అకాడ, నాటక అకాడ, విజ్యువల్‌ ఆర్ట్సు అకాడ, జానపద కళల అకాడ,  హిస్టరీ అకాడ, సైన్సు అండ్‌ ‌టెక్నాలజీ అకాడల  చైర్‌ ‌పర్సన్లు చేసిన పలు విజ్ఞప్తులకు మంత్రి స్పందిస్తూ  అన్ని అకాడల  చైర్‌ ‌పర్సన్లకు అవసరమైన అన్ని సౌకర్యాలను సమకూర్చుతామన్నారు. అకాడల వారీగా నిర్థేశించిన  కార్యక్రమాలన్నీ క్షేత్రస్థాయిలో  పెద్ద ఎత్తున అమలు చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను,  కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఈ అకాడలు కృషి చేయాలని ఆమె కోరారు. విజయవాడలో ఏర్పాటు చేస్తున్న బిర్లా ప్లానిటోరియం కార్యకలాపాల్లో  సైన్సు అండ్‌ ‌టెక్నాలజీ అకాడ చైర్‌ ‌పర్సన్‌ ‌ను కూడా భాగస్వామ్యులను చేయాలని అధికారులకు ఆమె సూచించారు.  కళాకారులు అందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసే విధంగా మార్గదర్శకాలను రూపొందించి జిల్లా కలెక్టర్లు అందరికీ కమ్యునికేట్‌ ‌చేయాలని సాంస్క•తిక శాఖ అధికారులకు ఆమె సూచించారు.
 రాష్ట్ర విభజన వల్ల పలు ప్రముఖ  క్రీడా ప్రాంగణాలను, క్రీడల అభివృద్దికి అవసరమైన పలు సంస్థలను, మౌలిక వసతులను  ఆంద్రప్రదేశ్‌ ‌కోల్పోయిందని రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్‌ ‌బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆందోళన వ్యక్తం చేయడంపై మంత్రి స్పందిస్తూ ప్రభుత్వ ప్రైవేటు బాగస్వామ్యంతో క్రీడ ప్రాంగణాల అభివృద్దికి చేపట్టిన పనులను వేగవంతం చేయాలని, అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో  క్రీడా ప్రాంగణాలను అభివృద్ది పర్చడంతో పాటు క్రీడా క్లబ్‌ ‌లను ఏర్పాటు చేసేందుకు చేపట్టిన చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ ఎం.డి.ప్రభాకర రెడ్డి ని మంత్రి అదేశించారు. అదే విధంగా ప్రతి పాఠశాలలోను, కళాశాల లోనూ క్రీడా తరగతులను నిర్వహించే విధంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు పర్చే విధంగా  పి.టి.లను భాగస్వాములను చేయాలని మంత్రి ఆదేశించారు. ఎన్‌.ఎస్‌.‌డి.సి. మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని మరికొన్ని క్రీడలకు గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకోవాలని  క్రీడా శాఖ అధికారులను ఆదేశించారు.  సక్షా సమావేశంలో రాష్ట్ర క్రీడా ప్రాదికారిక సంస్థ చైర్మన్‌ ‌బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ అరేమండ వరప్రసాద్‌ ‌రెడ్డి, రాష్ట్ర సాంస్క•తిక సమితి చైర్‌ ‌పర్సన్‌ ‌వంగపండు ఉష,  సాంస్క•తిక శాఖ స్పెషల్‌ ‌సి.ఎస్‌. ‌డా.రజత్‌ ‌బార్గవ, క్రీడలు యువజన సర్వసుల శాఖ ప్రధాన కార్యదర్శి వాణి మోహన్‌, ‌శాప్‌ ఎం.‌డి.ప్రభాకర రెడ్డి, సాంస్క•తిక శాఖ సి.ఇ.ఓ. మల్లికార్జున రావు తదితరులతో పాటు సాహిత్య అకాడ, మ్యూజిక్‌, ‌డ్యాన్సు అకాడ, నాటక అకాడ, విజ్యువల్‌ ఆర్ట్సు అకాడ, జానపద కళల అకాడ,  హిస్టరీ అకాడ మరియు సైన్సు అండ్‌ ‌టెక్నాలజీ అకాడల  చైర్‌ ‌పర్సన్లు,  పర్యాటక, సాంస్క•తిక, క్రీడ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *