Take a fresh look at your lifestyle.

పరీక్షా సమయంలో పరేషాన్‌ ‌కావొద్దు…!

 ఇది పరీక్షల సమయం, ఇటు వార్షిక పరీక్షలు, అటు సెమిస్టర్‌ ‌పరీక్షలు మొదలయ్యాయి, విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఇంటర్‌ ‌పరీక్షలు మొదల య్యాయి. పదవ తరగతి ,డిగ్రీ, అలాగే పి జి మరియు మొదలైన పరీక్షల లో విద్యార్థులు  సరైన  జాగ్రత్తలు   తీసుకు ంటే విజయాలు సాధిస్తారు. తెలం గాణలో  ఇంటర్మీ డియట్‌  ‌పరీక్షలు ప్రారంభమయ్యయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కొన్ని సూచనలను తప్పక పాటించినట్లైతే మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు.
పరీక్షలు ప్రారంభమయ్యాయి అని ప్రణాళిక లేకుండా చదవకూడదు. సరైన నిద్ర లేకుండా నైట్‌ అవుట్‌ ‌చేసి  ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. పరీక్ష రాసే విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే  వారు రాసే పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. విద్యార్థులు రాయబోయే పరీక్ష సెంటర్‌ ‌ముందుగానే చూసి పెట్టుకోవాలి.పరీక్షకు వెళ్లేటప్పుడు హాల్‌ ‌టికెట్‌, ‌ప్యాడ్‌ ‌తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే గాబరాగా కాకుండా ప్రశాంతంగా ఒకటికి రెండుసార్లు  ప్రశ్నపత్రం చదువుకోవాలి.మొదట ప్రశ్నాపత్రాన్ని క్షుణ్ణంగా చదివిన తర్వాత అందులో చదువని ప్రశ్నలు ఉన్నా కంగారు పడవద్దు.ఎందుకంటే ఇంకా చాలా ఇతర ప్రశ్నలు ఉంటాయి  గనుక.ప్రశ్న పత్రంలో అన్ని తెలిసిన ప్రశ్నలే రావు. చదివిన ప్రశ్నలే రావు. అలాంటప్పుడు మనస్సును నిర్మలంగా, నిశ్చలంగా  ఉంచుకొని సమాధానాలను రాయాలి. విద్యార్థుల మేధస్సును పరీక్షించడానికి  కోన్ని స్థాయిలలో  ప్రశ్నలు అడగడం జరుగుతుంది .కావున ఎటువంటి టెన్షన్‌ ‌లేకుండా, కూల్‌ ‌గా ఆలోచించినట్లయితే విద్యార్థులు పరీక్షలను బాగా రాయగలుగుతారు.
పరీక్ష రాసేటప్పుడు ఇచ్చిన  సెక్షన్‌, ‌ప్రశ్న నెంబర్‌, ‌స్పష్టంగా మార్జిన్‌ ‌లో మాత్రమే రాయాలి. విద్యార్థులు వారికి తెలిసిన,వారు చదివిన ప్రశ్నలను  మొదట ఎంచుకుని జవాబులను స్పష్టంగా రాయాలి. అలా రాసినప్పుడు విద్యార్థులకు  కొంత ఉపశమనము కలిగి, నేను రాయగలను అనే నమ్మకం ఏర్పడుతుంది. అంతేగానీ మొదటనే కొట్టివేతలతో అసంపూర్తిగా సమాధానాలను రాయరాదు. మొదటగా పూర్తిగా జవాబులు వచ్చిన వాటిని రాసిన పిదప, మిగతా జవాబులను రాయాలి.అవసరమైన చోట జవాబులకు సంబంధించిన  చిత్రాలు కొట్టివేతలు లేకుండా వేయాలి. వాటికి కూడా మార్కులు ఉంటాయి కాబట్టి అవసరం ఉన్న జవాబుకు మాత్రమే ఆన్సర్‌ ‌షీట్‌ ‌లో  చిత్రాలను గీయాలి.ఒక జవాబు పూర్తి అయిపోయాక పెన్సిలుతో కానీ, పెన్నుతో కానీ  అడ్డంగా ఒక లైన్‌ ‌డ్రా చేసి మరొక
ప్రశ్నకు జవాబు మొదలు పెట్టాలి.పరీక్షా పత్రంపై మీ స్వంత వివరాలు అనగా ఫోన్‌ ‌నెంబర్‌, ‌మీ అడ్రస్‌  ‌లాంటివి రాయ కూడదు . ఒక ప్రశ్నకు ఎంతవరకు సమాధానం రాయగలవో,అంతవరకు ఖచ్చితంగా రాయాలి. ఒకవేళ పూర్తిగా విద్యార్థులు రాయలేకపోయినా, రాసిన జవాబును బట్టి మార్కులు వేసే అవకాశం ఉంటుంది.ప్రశ్నకు కేటాయించిన మార్కులను బట్టి మనం రాసే సమాదానం ఉండాలి. ఎక్కువ మార్కులు ఉన్నదానికి ఎక్కువ పంక్తుల్లో  సమాధానం రాయాలి. తక్కువ మార్కులు ఉన్న వాటికి  తక్కువ పంక్తుల్లో  సమాధానం రాయాలి.
పిల్లలు పరీక్షా కాలంలో పరీక్షకు వెళ్లేముందు వారి వారి వస్త్రధారణ మీదనే సమయం ఎక్కువ కేటాయించుతారు. త్వరగా తయారయ్యే విధంగా ఉండే దుస్తులను ఎంచుకొని వాటిని ధరిస్తే మంచిది. అలంకరణ పై దృష్టి పెట్టడం  ఇది ఎంత మాత్రం మంచిది కాదు.ఇక్కడ ఒక్క విషయం మరువరాదు, సంవత్సర కాలం చదివిన అంశాలను గుర్తుపెట్టుకుని విజయవంతంగా పరీక్ష రాయడానికి, విద్యార్థులు తమ సమయం కేటాయించాలి. అంతేగానీ ఇతర అనవసర విషయాలపై మాత్రం దృష్టి పెట్టరాదు.సమయం ఉంటే  రాయవలసిన దానికన్నా ఎక్కువ జవాబులు రాస్తే మంచిది.ఇక ఇంటి వద్ద విద్యార్థులు సెల్‌ ‌ఫోన్‌ ‌కు, ఆటలకు  దూరంగా ఉండాలి. దానివల్ల మనకు తెలియకుండానే ఎక్కువ సమయం వృథా అవుతుంది. పరీక్షా సమయంలో  టీవీ,సెల్‌ ‌ఫోన్‌, ‌సినిమాలు, కంప్యూటర్‌ ‌కు దూరంగా ఉంటే  చాలా మంచిది. సెల్‌ ‌ఫోన్‌, ‌స్మార్ట్ ‌గడియారాలు పరీక్షా హాలుకు తీసుకువెళ్లకూడదు. ఎంటర్టైన్మెంట్‌ ‌కు కాకుండా  ఎడ్యుకేషన్‌ ‌కు ప్రియారిటి ఇవ్వాలి.
పరీక్షల సమయంలో సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే మంచిది.ఎక్కువగా నూనె పదార్థాలు, జంక్‌ ‌ఫుడ్‌ ‌లకు దూరంగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి   పోషక విలువలతో కూడిన  ఆహారాన్ని విద్యార్థులు తీసుకోవాలి. ఎక్కువ సమయం  చదవడం వల్ల శక్తి ఎక్కువగా ఖర్చవుతుంది కాబట్టి వీలైనంతవరకు  పండరసాలు, పండ్లు, సులువుగా జీర్ణమయ్యే పదార్థాలను ఆహారంగా తీసుకుంటే మంచిది. ఫాస్ట్ ‌ఫుడ్స్ ‌తీసుకోవడం వల్ల, అనారోగ్యం పాలైతే ఈ సమయంలో పరీక్షలు మంచిగా రాయక, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏదైనా పరీక్ష సమయంలో చిన్న  అనారోగ్య సమస్య ఉన్ననూ ప్రతీ సెంటర్లో ప్రథమ చికిత్స అందించే ఏర్పాటు ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అనుకున్న లక్ష్యాలను సాధించాలి.పోషకాలు కలిగిన ఆహారాన్ని మాత్రమే  క్రమం తప్పకుండా తీసుకోవాలి. నీటిని బాగా తీసుకోవాలి.
విద్యార్థులు తమ భవిష్యత్‌ ‌ను మంచిగా మలచుకోవటం వారి  చేతుల్లోనే ఉంటుంది. ఆ విషయం మరువరాదు. విజయం కావాలంటే దానికి తగిన శ్రమ చేయాలి.పరీక్ష ల్లో విద్యార్థులు విజయం సాధించాలంటే ఒక ప్రణాళిక ప్రకారం చదవాలి. పంచ సూత్రాలను పాటించాలి. నాలెడ్జ్, ‌డిసిప్లిన్‌, ‌కాన్సన్ట్రేషన్‌, ‌హానెస్ట్ ‌హార్డ్ ‌వర్క్ ‌వీటితో పాటు అతి ముఖ్యంగా పంచువాలిటీ అనగా సమయపాలన పాటించాలి. ప్రణాళిక ప్రకారం ఒక క్రమశిక్షణతో, నీతిగా, నిజాయితీగా, ఏకాగ్రతతో జ్ఞాన సమపార్జన కోసం చదవాలి. ముందు నుండే  విద్యార్థులు ఎప్పటికప్పుడు  ఒక్కో చాప్టర్‌ ‌ను  చదువుకొని, చదువుకున్న జవాబులను మరల చూసుకోవడానికి సమయం ఉండేట్టుగా చూసుకోవాలి. పూర్వపు ప్రశ్నాపత్రాలను  గమనించి చదివాలి. తద్వారా ఎటువంటి ప్రశ్నలు పరీక్షల్లో అడుగుతారో తెలుస్తుంది. గాబరా పడకుండా, పరేషాన్‌ ‌కాకుండా పరీక్ష సమయంలో  అతి ముఖ్యంగా సమయపాలన పాటించాలి. ఒక్కో ప్రశ్న కు  మార్కులను బట్టి కొంత నిర్దిష్టమైన సమయాన్ని పెట్టుకుని సమాధానం రాయాలి. పరీక్ష హాలుకు  గంట ముందే చేరుకోవాలి.ఇచ్చిన నిర్దిష్ట సమయము కంటే ముందుగానే పరీక్ష మొత్తము  పూర్తిచేసి, జవాబులను మరలా చూసుకోవాలి. వీలైతే, సమయం ఉంటే ఎక్కువ సమాధానాలు రాయడానికి ప్రయత్నించాలి.
విద్యార్థులు ఏమైనా చెడు వ్యసనాలను కలిగి ఉన్న  పరీక్షా సమయంలో వాటికి దూరంగా ఉండాలి. ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యం బాగుండాలి అంటె పోషక విలువలు కలిగిన పౌష్టికాహారాన్ని విద్యార్థులకు తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు అందించాలి. నిద్రపోకుండా చదవడం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి సమయానుకూలంగా నిద్రపోయి, చదివినంత సేపు  కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలి. పరీక్షా సమయంలో ఇంట్లో ఉన్న పెద్దలు పిల్లల ముందు గొడవ పడడం, ఇంటి సమస్యలను పిల్లల ముందు చర్చించకుండా ఉంటే చాలా మంచిది. ఈ ప్రభావం కూడా విద్యార్థుల పైన పడి, పరీక్షను బాగా రాయలేక పోతారు.
పరీక్షలు విద్యార్థులకే కాదు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు బోధించిన ఉపాధ్యాయులకు, కళాశాలలో ఎక్కువ మార్కులు, ఎక్కువ మంది విద్యార్థులకు  ర్యాంకులు  రావడానికి ప్రయత్నించే యాజమాన్యాలకు, అందుకే పరీక్షా కాలంలో పరేషాను వద్దు. శాంతంగా, ప్రణాళిక, పద్ధతి ప్రకారం చదువుకున్నట్లయితే విద్యార్థులు వారు అనుకున్న గమ్యాలను చేయగలుగుతారు.పంచ సూత్రాలను పాటించుకుంటూ, సమయాన్ని వృధా చేయకుండా, భవిష్యత్తుపై భరోసా కల్పించడానికి, భవిష్యత్తుకు  బాటలు వేసుకోవడానికి  విద్యార్థులకు ఇది సరైన సమయం.
గమ్యం చేరాలన్న, ఉన్నత చదువులు చదవాలన్న భవిష్యత్తు విద్యార్థి చేతుల్లోనే ఉంది.ఒక వ్యక్తిని జయించే శక్తి ఏదీ లేదు,అందుకే అంటారు పెద్దలు,మీ చేతుల్లోనే మీ భవిష్యత్తు ఉందని, మీ తలరాతకు మీరే బాధ్యులు  కాబట్టి,మంచి గమ్యం వైపు పయనించండి, కొన్ని కఠిన నిర్ణయాలు, నియమాలు పాటించినట్లయితే విజయం మీ సొంతం అవుతుంది. శ్రమ నీ ఆయుధమైతే, విజయం నీ బానిస అవుతుంది. దీన్ని మరవకుండా ప్రయత్నించినట్లయితేనే విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాలను నిర్దిష్ట గడువులోగా సాధిస్తారు.
image.png
మోటె చిరంజీవి
సీనియర్‌ అధ్యాపకులు, సామాజిక విశ్లేషకులు.
9949194327.

Leave a Reply