Take a fresh look at your lifestyle.

పక్కా ప్లాన్‌తో కెసిఆర్‌ ‌జాతీయపార్టీ

పక్కా ప్లాన్‌తో కెసిఆర్‌ ‌జాతీయపార్టీ
మోదీని ఢీకొనే క్రమంలో వ్యూహాలకు పదును
బిజెపి ఆలోచనలకు చిక్కకుండా అడుగలు
మునుగోడులో గెలుపుతో బిజెపికి షాక్‌ ఇచ్చేలా ప్లాన్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌రాజకీయ చాణక్యుడుగా పేరుపొందిన కేసీయార్‌ ‌పక్కా ప్లాన్‌ ‌తోనే జాతీయ రాజకీయాల్లో ముం దుకు సాగబోతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆయన ఆలోచనలు బీజేపీకి చిక్కకుండా దక్కకుండా ఉంటున్నాయని కూడా చెబుతున్నారు. బిజెపికి భిన్నంగా చేస్తున్న ఆలోచ నలతో బలంగా తన సంకల్పం నెరవేర్చుకునేలా ముందుకు సాగుతున్నారు. మోఢీని ఢీకొట్టే క్రమంలో ఈ నెల 5న జాతీయపార్టీకి సంకల్పి ంచి దసరా ముహూర్తంగా నిర్ణయించారు. మునుగోడు ఉప ఎన్నికతో సబంధం లేకుండా ఆ రోజుకార్యక్రమం ఉంటుందని కూడా కెసిఆర్‌ ‌స్పష్టతను ఇచ్చారు. ఈమేరకు కేసీఆర్‌ అనుకున్న విధంగానే దసరారోజుననే జాతీయ పార్టీని ప్రకటించబోతున్నారు. ఈ జాతీయ పార్టీ పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఈ పక్రియ డిసెంబర్‌లోగా పూర్తి అయితే ఆ వెంటనే ఢిల్లీ వేదికగా 9న భారీ బహిరంగ సభకుకేసీయార్‌ ‌రెడీ అవుతారని అంటున్నారు.

కేసీఆర్‌ ఆలోచన మేరకు వచ్చే ఏడాది ఎన్నికల నాటికి పార్టీని విస్తరించాలని, అలాగే తెలంగానలో కూడా పెట్టించుకుని మూడవసారి ముచ్చటగా గెలిచి ఇక్కడ అధికారం పదిలపర్చుకోవాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది. 2024 లోక్‌ ‌సభ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. దాంతో ఇక ఒక్క క్షణం కూడా విరామం ఇవ్వకుండా దేశమంతా కేసీయార్‌ ‌చుట్టేయాలని చేస్తున్నారని అంటారు. ఇక షెడ్యూల్‌ ‌ప్రకారం తెలంగాణాలో ఎన్నికలు జరిగితే మాత్రం కేసీయార్‌ ‌జాతీయ రాజకీయానికి ఇబ్బంది కలుగుతుందని లెక్కలేస్తున్నారు. 2023 డిసెంబర్‌ ‌లో తెలంగాణకు ఎన్నికలు అంటే కేసీయార్‌ ‌తన సమస్త శక్తులనూ తెలంగాణాకే ధారపోయాల్సి ఉంటుంది. ఇక ఇంత ఎక్కువ టైం ఇస్తే బీజేపీ సహా కాంగ్రెస్‌ ‌సైతం గట్టిగా బలపడే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రజా వ్యతిరేకత ఏమైనా ఉంటే అది కూడా మరింతగా పెరుగుతుంది. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ఆయనకు ఇపుడు అత్యంత అవసరం. ఈ ఒక్క ఉప ఎన్నిక ఏకంగా తెలంగాణా రాజకీయాన్ని దేశ రాజకీయాన్ని మలుపు తిప్పుతుందని ఆయన భావిస్తున్నారు.

మునుగోడులో టీయారెస్‌ ‌గెలిస్తే ఆ ఊపులోనే ఆయన మోడీకి గట్టిగా సవాల్‌ ‌విసరవచ్చు. ఇక ఇప్పటికి వరసగా రెండు ఉప ఎన్నికలతో పాటు హైదరాబాద్‌ ‌కార్పోరేషన్‌ ఎన్నికల్లో గెలిచిన బీజేపీకి మునుగోడుతో బ్రేక్‌ ‌వేయడమే కేసీయార్‌ ‌మార్క్ ‌మాస్టర్‌ ‌ప్లాన్‌. ఉప ఎన్నిక ఫలితంతో బిజెపి దూకుడుకు చెక్‌ ‌పెట్టాలన్నది కెసిఆర్‌ ఆలోచనగా ఉంది. వచ్చే ఏడాది తెలంగాణా ఎన్నికల్లో హ్యాట్రిక్‌ ‌విజయాన్ని సొంతం చేసుకుని జాతీయ స్థాయిలో తన దిగ్విజయ యాత్రను కొనసాగించ డానికి కేసీయార్‌ ‌మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌వేసారని చెబుతున్నారు. తెలంగాణాలో మూడు సార్లు గెలిచిన పార్టీగా బీజేపీని ఢీ కొట్టి పక్కకు నెట్టిన పార్టీగా జాతీయ స్థాయి రాజకీయాన్ని తన వైపు సులువుగా తిప్పుకోవచ్చు అని కేసీయార్‌ ‌భావిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి మునుగోడులో ఉప ఎన్నికల తరువాత కీలకమైన పరిణామాలు తెలంగాణాలో చోటుచేసుకోనున్నాయి అని అంటున్నారు.

అందుకే ముందు మునుగోడు విజయం…తరవాత దేశ వ్యాప్త పర్యటన,అందులో భాగంగానే ఉత్తరాది కోసం కొత్త ఛానెళ్ల ఏర్పాటు వంటివి కెసిఆర్‌ ‌ప్రణాళికలో ఉన్నాయని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పెట్టబోయే కొత్త జాతీయ పార్టీ కోసం మరో రెండు వార్తా చానళ్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఢిల్లీ కేంద్రంగా హిందీ, ఇంగ్లీష్‌ ‌ఛానళ్ల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ ‌ప్లాన్‌ ‌చేస్తున్నట్లుగా తెలియవచ్చింది. కొత్త ఛానళ్ల కోసం శాటిలైట్‌ అనుమతులు తీసుకోవాలా లేక ఇప్పటికే అనుమతులు ఉన్న ఛానళ్లతో అగ్రిమెంట్‌ ‌చేసుకునే విషయంలో తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. చానల్స్ ఏర్పాటు కోసం టీఎర్‌ఎస్‌ ‌పెద్దలు ఢిల్లీలో సీనియర్‌ ‌జర్నలిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. ఢిల్లీలో తెలంగాణ భవన్‌ ‌నిర్మాణం పూర్తి అయిన తర్వాత అదే భవనంలో చానల్స్ ఏర్పాటు చేసే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని, అప్పటి వరకు టి న్యూస్‌ ‌నెట్‌ ‌వర్క్‌ను అన్ని రాష్టాల్రకు విస్తరించాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించినట్లుగా సమాచారం.

5న పార్టీ సమావేశం
యధాతథం
ఉదయం 11 కల్లా అందరూ హాజరు కావాల్సిందే
మరోమారు స్పష్టం చేసిన కెసిఆర్‌
‌ములాయం ఆరోగ్యంపై ఆరా
తెలంగాణ భవన్‌లో దసరా నాడు అంటే 5న ఉదయం 11 గంటలకు తలపెట్టిన టీఆర్‌ఎస్‌ ‌పార్టీ జనరల్‌ ‌బాడీ టింగ్‌

‌యధావిధిగా జరగుతుందని పార్టీ అధినేతపక్కా ప్లాన్‌తో కెసిఆర్‌ ‌జాతీయపార్టీ సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ ‌నేపథ్యంలో దాని ప్రభావం, దసరా నాటి టీఆర్‌ఎస్‌ ‌సర్వసభ్య సమావేశం పైన ఉండదని, సభ్యులు అనుమానాలకు గురికావద్దని అన్నారు. ముందుగా ప్రకటించినట్టే అక్టోబర్‌ 05 ‌వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌ ‌లో పార్టీ సర్వసభ్య సమావేశం కొనసాగుతుందని సీఎం కేసీఆర్‌ ‌పునరుద్ఘాటించారు. అందరూ నిర్దేషిత సమయంలోపే హాజరు కావాలన్నారు.

ఇదిలావుంటే సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, పార్లమెంట్‌ ‌సభ్యుడు ములాయం సింగ్‌ ‌యాదవ్‌ ఇటీవల అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ములాయం తనయుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ ‌యాదవ్‌కు సీఎం కేసీఆర్‌ ‌స్వయంగా ఫోన్‌ ‌చేశారు. అఖిలేశ్‌తో మాట్లాడి ములాయం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. దసరా పండుగ తర్వాత స్వయంగా వచ్చి కలుస్తానని ఈ సందర్భంగా అఖిలేశ్‌ ‌యాదవ్‌కు సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు.

Leave a Reply