న్యూజెర్సీలో తెలంగాణ తెలుగు అసోసియేషన్ సంబరాలు

న్యూ జెర్సీ ,మే 27: తెలంగాణ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో శుకృవారం నుండి మూడు రోజుల పాటు ..మే 30 వరకు సంబరాలు నిర్వహించడానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు కాన్ఫరెన్స్ కమిటీ కన్వీనర్ గనగొని శ్రీనివాస్, అధ్యక్షుడు పటోళ్ల మోహన్ రెడ్డి తెలిపారు. ‘ మూడు రోజుల పాటు జరిగే సంబరాల విశేషాలను, కార్యక్రమాలను వివరించారు. న్యూ జెర్సీ కన్వెన్షన్ సెంటర్లో 27వ తేదీ రాత్రి బ్యాంక్ వెట్ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు అవార్డులు అందజేస్తామని తెలిపారు.

అనంతరం కోటి బృందంచే మ్యూజికల్ నైట్ ఉంటుందని తెలిపారు. 28వ తేదీ ఉదయం తెలంగాణ వైభవాన్ని సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా స్వాగత నృత్యం గీతం ఉంటుందని తెలిపారు. దీనిని జొన్నవిత్తుల, వడ్డేపల్లి కృష్ణ రూపొందించారని వందేమాతరం శ్రీనివాస్ ఆలపించారని తెలిపారు. న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ స్థానిక సెనేటర్ మేయర్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనలు అనంతరం సాయంత్రం సింగర్ సునీత బృందంచే సంగీత విభావరి ఉంటుందని తెలిపారు. రసమయి బాలకిషన్ బృందం ప్రదర్శన .. సినిమా నటీనటులు నిఖిల్ రితూ వర్మ అంజలి జబర్దస్త్ బృందం ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.

మూడవరోజు ఉదయం వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం తో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అమెరికాలో తొలిసారిగా ఈ కల్యాణాన్ని తమ వేడుకల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాత్రి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు రోజులపాటు యాంకర్ లు సుమా, రవి లు కార్యక్రమాలు నిర్వహిస్తారని, యాంకరింగ్ చేస్తారని శ్రీనివాస్ గనగొని మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు ,సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, భాజపా నేతలు డి .అరవింద్, డీకే అరుణ, వి వివేక్ స్వామి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ,ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు* కాన్ఫరెన్స్ కు అనుబంధంగా వాణిజ్యం ఐటీ మహిళ రాజకీయం యువత మ్యాట్రిమోనీ తదితర సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రముఖ అటార్నీ లతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. TTA స్టార్ సింగర్ ను ఉత్సవాల సందర్భంగా ప్రకటిస్తామని తెలిపారు. యువత కోసం క్రూజ్ పర్యటన ఏర్పాటు చేసినట్లు తెలిపారు .తెలంగాణ వైభోగం సాంప్రదాయం చాటిచెప్పే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page