శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు. అందువల్లనే ‘కృష్ణ జయంతి’ అని, ‘జన్మాష్టమి’ అని కూడా అంటారు. తన లీలలు చూపటానికి గోకులం చేరింది కూడా ఈ రోజే కావున ‘గోకులాష్టమి’ అని కూడా వ్యవహరిస్తారు. సృష్టికర్త అయిన విష్ణుమూర్తి అవతారాల్లో ఒకరైన శ్రీ కృష్ణ భగవానుడు సామాన్య జనుల మధ్య, సామాన్య మానవుడి రూపంలో జన్మించి నివురుగప్పిన నిప్పులా దినదినాభివృద్ధి చెందుతూ ధర్మానికి ఆటంకం కలిగించే శక్తులను తనలో ఉన్న మధ్యాహ్న సూర్యకాంతితో మండించే శక్తిలా అవతరించాడు. దుష్టశక్తులను నశింపజేస్తూ.. సామాన్య జనులకు ఊరట కలిగిస్తూ.. మానవులందరు ఎలా కలిసి మెలసి జీవించాలో జ్ఞానబోధను చేస్తూ ముందుకు సాగిపోతుంటాడు. అట్టి ‘‘శ్రీకృష్ణావతార జన్మదినం’’ మనకు చాలా పవిత్రమైన పుణ్యదినంగా పరిగణిస్తుంటాం. శ్రీ ముఖనామ సంవత్సర దక్షిణాయన వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాల్గోపాదం అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవీ, వసుదేవుల పుత్రునిగా శ్రీకృష్ణుడు జన్మించాడు. యావత్ భారతీయులు ఈ పర్యాయం ఆగస్టు 19వ తేదీ శుక్రవారం శ్రీ కృష్ణజయంతిని జరుపుకుంటున్నారు.
శ్రీ కృష్ణునివన్నీ లీలలే. రామావతారంలో తన కౌగిలి కోరిన మునులంతా ఈ అవతారంలో గోపికలుగా పుట్టగా వారికి రాసలీల పేర కౌగిలి నందించి వారిని ధన్యులను చేశాడు. అది లీల తప్ప విమర్శించవలసింది లేదు. భూభారం తగ్గించటానికి పుట్టిన ఆయన రాజుల రూపంలో ఉన్న రాక్షసులను తానే వెదకి చంపే పని పెట్టుకోక జరాసంధుని ద్వారా అందరినీ తన ముందుకు రప్పించుకొని సంహరించాడు. లోకం కోసం భగవద్గీతను బోధించి జగద్గురువు అయ్యాడు. ‘శ్రీకృష్ణ పరమాత్మా’ అని పరమాత్మ వాచకంతో ఆయననే కొలుస్తాం. దీనిని బట్టే ఆయన స్ఠానం గ్రహించాలి. ఆయన చేసినవన్నీ ధర్మ సూక్ష్మాలు. ఈనాడు కృష్ణాష్టమి రోజున వ్రతం చేయాలి. ఉపవాసం, పూజ, జాగరణలు నిర్వహించాలి. సాధ్యం కానివారు కనీసం శ్రీ కృష్ణుని ప్రతిమ లేదా పటానికి షోడశోపచార పూజ చేసి క్రిష్ణునికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, మీగడ లు నివేదించాలి. దొరికితే పొన్న పూలు తెచ్చి పూజచేయాలి. ప్రసవం రోజులలో తయారు చేసే కట్టెకారం కృష్ణష్టమి రోజున ప్రసాదంగా స్వీకరించడం ఆచారం. శ్రీకృష్ణ లీలకు చిహ్నంగా ఉట్టి కొట్టడం వంటి వేడుకలు నిర్వహిస్తారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకిట్లో బియ్యప్పిండి లేదా ముగ్గుతో బాల గోపాలుడి పాదాలను తీర్చిదిద్దడంతో పండుగ వాతావరణం మొదలవుతుంది. ద్వారాలకు మావిడాకులు, వివిధ పూవులతో తోరణాలు కట్టి, కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రపరచి, చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూవులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో పూజిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకిట్లో బియ్యప్పిండి లేదా ముగ్గుతో బాల గోపాలుడి పాదాలను తీర్చిదిద్దడంతో పండుగ వాతావరణం మొదలవుతుంది. ద్వారాలకు మావిడాకులు, వివిధ పూవులతో తోరణాలు కట్టి, కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రపరచి, చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూవులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో పూజిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకిట్లో బియ్యప్పిండి లేదా ముగ్గుతో బాల గోపాలుడి పాదాలను తీర్చిదిద్దడంతో పండుగ వాతావరణం మొదలవుతుంది. ద్వారాలకు మావిడాకులు, వివిధ పూవులతో తోరణాలు కట్టి, కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రపరచి, చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూవులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో పూజిస్తారు.
‘‘గీతాచార్యుడు’’ కృష్ణపరమాత్మ జన్మాష్టమినాడు సూర్యోదయానికి ముందరే కాలకృత్యాలు తీర్చుకుని చల్లని నీటిలో తులసీదళాలను ఉంచి స్నానమాచరిస్తే సమస్త పుణ్య తీర్థాలలో స్నానమాచరించిన పుణ్యఫలాన్ని పొందుతారని, ఆరోజు సర్వులూ వారి వారి గృహాలను ముత్యాల ముగ్గులతో, పచ్చని తోరణాలతో కృష్ణపాదాలను రంగవల్లికలతో తీర్చిదిద్ది ఆ కృష్ణ పరమాత్మకు ఆహ్వానం పలుకుతూ, ఊయలలో ఓ చిన్ని కృష్ణుని ప్రతిమను వుంచి, రకరకాల పూలతో, గంథాక్షతలతో యధావిధిగా పూజించి, ధూపదీప నైవేద్యాలతో ఆ స్వామిని ఆరాధించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, దక్షిణ తాంబూలాలు సమర్పించుకుంటే ఎంతో మంచిదని పెద్దలు ప్రవచించారు.
చిలిపి బాలునిగా, పశువులకాపరిగా, రాధా గోపికా మనోహరునిగా, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగా, గొపికల మనసు దొచుకున్నవాదిగా, యాదవరాజుగా, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగా, భగవద్గీతా ప్రబోధకునిగా, తత్త్వోపదేశకునిగా, దేవదేవునిగా, చారిత్రిక రాజనీతిజ్ఞునిగా ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరణ జరిగింది.
– నందిరాజు రాధాకృష్ణ, వెటరన్ జర్నలిస్ట్




